మోడీ ప్రధాన మంత్రి గా దేశానికి ఎంచేసాడు ?
శ్రీ నరేంద్ర మోదీ 2019 మే 30వ తేదీ న భారతదేశ ప్రధానమంత్రి గా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో శ్రీ మోదీ రెండో పర్యాయం పదవీకాలం ప్రారంభం అయింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జన్మించిన, ప్రధాన మంత్రి పదవి ని అలంకరించిన తొలి వ్యక్తి శ్రీ నరేంద్ర మోదీ. ఆయన 2014 నుండి 2019 సంవత్సరాల మధ్య కాలంలో కూడా ప్రధాన మంత్రి గా పని చేశారు. 2001 నుండి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రి గా పని చేసిన శ్రీ నరేంద్రమోదీ కి, ఆ రాష్ట్రాని కి సుదీర్ఘ సమయం పాటు సేవ చేసిన తొలి ముఖ్యమంత్రి గా ప్రత్యేక గుర్తింపు దక్కింది.
2014వ సంవత్సరం లోను, 2019వ సంవత్సరం లోను జరిగిన పార్లమెంట్ ఎన్నికల లో శ్రీ మోదీ భారతీయ జనతా పార్టీ కి రికార్డు స్థాయి లో విజయాల ను అందించారు. ఈ రెండు ఎన్నికల లో బిజెపి సంపూర్ణ మెజారిటీ ని సాధించింది. 1984 లో చివరి సారి గా ఒక రాజకీయ పార్టీ పార్లమెంటు లో సంపూర్ణ మెజారిటీ ని సాధించింది.
శ్రీ నరేంద్ర మోదీ “సబ్ కా సాథ్, సబ్ కా విశ్వాస్” మంత్రం తో సమ్మిళితమైన, అభివృద్ధి ప్రధానమైన, అవినీతి రహితమైన పాలన ను అందించే దిశ గా ఒక కొత్త మార్పు కు శ్రీకారం చుట్టారు. అంత్యోదయ .. లేదా వరుస లోని చివరి వ్యక్తి కి కూడా పథకాలు మరియు సేవల ను అందించాలన్న ధ్యేయం తో ప్రధాన మంత్రి త్వరిత గతి న మరియు భారీ ఎత్తు న కృషి చేస్తున్నారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలో, భారతదేశం లో అమిత వేగంగా పేదరిక నిర్మూలన జరుగుతున్నదని ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు గుర్తించాయి. పేద ప్రజల కు అనుకూలం గా ఉండేటట్టు కేంద్రప్రభుత్వం తీసుకున్న ఎన్నో చర్యలు ఇందుకు దోహదపడ్డాయని ఆపాదించాయి.
ప్రస్తుతం, ప్రపంచం లో అతి పెద్దదైన ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ నిర్వహణ కు భారతదేశం వేదిక అయింది. 50 కోట్ల మంది భారతీయుల కు వర్తించే ఈ . ఈ ఆయుష్మాన్ భారత్ పేదల కు, నవ్య మధ్యతరగతి ప్రజల కు భరించగల స్థాయి లో నాణ్యమైన వైద్యసేవలను సమకూర్చుతుంది.
భారతదేశం లో ఆరోగ్య రంగం పై ప్రజల లో ఉన్న అతి పెద్ద అసంతృప్తి ని ఆయుష్మాన్ భారత్ తొలగించిందని ప్రపంచ ప్రతిష్ఠాత్మక ఆరోగ్య జర్నల్ గా పేరు పొందిన లాన్సెట్ ప్రశంసించింది. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణను ప్రాధాన్యతా స్థానంలో నిలపడమే ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రయత్నం అని ఈ పత్రిక గుర్తించింది.
ఆర్థిక కార్యకలాపాల కు దూరం గా ఉండిపోవడమే పేదల కు పెద్ద శాపం అని గుర్తించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతి ఒక్క భారతీయునికి బ్యాంకు ఖాతా అందించే లక్ష్యం తో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ను ప్రారంభించారు. ఇప్పటికి 35 కోట్ల మందికి పైగా జన్ ధన్ ఖాతాలు తెరవబడ్డాయి. ఈ ఖాతాలు బ్యాంకింగ్ సదుపాయాలు అందుబాటులో లేని వారికి బ్యాంకుల ను చేరువ చేయడం తో పాటు సాధికారిత కు కూడా తలుపుల ను తెరచాయి.
జన్ ధన్ నుండి మరో అడుగు ముందుకు వేసిన శ్రీ నరేంద్ర మోదీ, సమాజం లో తీవ్ర నిరాదరణ కు గురవుతున్న వర్గాల వారి కి బీమా ను, పింఛను ను కల్పించేందుకు జన్ సురక్ష ను ఆవిష్కరించారు. ఈ ‘జమ్ ట్రినిటీ’ (జన్ ధన్-ఆధార్-మొబైల్) మధ్యదళారీల ను నిర్మూలించి, సాంకేతిక విజ్ఞానం ఆధారం గా పారదర్శకత్వాన్ని, వేగాన్ని తీసుకు వచ్చింది.
దేశ చరిత్ర లో తొలి సారి గా ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన ద్వారా అవ్యవస్థీకృత రంగం లో 42 కోట్ల మందికి పైగా పింఛను సదుపాయాన్ని అందుబాటు లోకి తీసుకు వచ్చారు. 2019 ఎన్నికల ఫలితాల అనంతరం మంత్రిమండలి ఒకటో సమావేశం లో వ్యాపారుల కు కూడా అదే తరహా పింఛను పథకాన్ని ప్రకటించారు.
పేదల కు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్ లను ఇవ్వడం లక్ష్యం గా 2016 సంవత్సరం లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ను ప్రవేశపెట్టడమైంది. 7 కోట్ల మంది కి పైగా లబ్ధిదారుల కు పొగ రహిత వంటగదుల సదుపాయం అందుబాటు లోకి తెచ్చింది. లబ్ధిదారుల లో అధిక శాతం మంది మహిళలే.
స్వాతంత్ర్యం సిద్ధించి 70 సంవత్సరాల సుదీర్ఘ కాలం గడచిన తరువాత కూడా విద్యుత్తు సరఫరా లేకుండా ఉండిపోయిన 18,000 గ్రామాల కు విద్యుత్తు సౌకర్యం కల్పించబడింది.
ఏ ఒక్క భారతీయుడు తల దాచుకునే ఇల్లు లేకుండా ఉండకూడదని శ్రీ మోదీ ప్రగాఢం గా విశ్వసిస్తారు. దాని ని నిజం చేయడం లక్ష్యం గా ప్రభుత్వం 2014 నుండి 2019 సంవత్సరాల మధ్య కాలం లో 1.25 కోట్లకు పైగా గృహాల నిర్మాణాన్ని పూర్తి చేసింది. 2022వ సంవత్సరం కల్లా “అందరికీ ఇల్లు” అనే ప్రధాన మంత్రి దార్శనికత ను కార్యరూపం లోకి తీసుకు రావడం కోసం ఇళ్ల నిర్మాణం శర వేగం గా కొనసాగుతోంది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ హృదయాని కి అత్యంత చేరువగా ఉన్నది వ్యవసాయ రంగం. ఇందుకు దీటుగానే రైతుల కు ఆర్థిక ప్రోత్సాహకాన్ని పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట ప్రభుత్వం 2019 తాత్కాలిక బడ్జెటు లో ప్రకటించింది. సుమారు మూడు వారాల వ్యవధిలో 2019 ఫిబ్రవరి 24వ తేదీ న ఆ పథకాన్ని ప్రారంభించడమైంది. అంతే కాక, ఆ పథకం లో భాగం గా రైతులకు వాయిదాల ను చెల్లించడం ప్రారంభమయింది. ప్రధాన మంత్రి గా శ్రీ నరేంద్ర మోదీ రెండో విడత అధికారం చేపట్టిన తరువాత జరిగిన తొలి మంత్రివర్గ సమావేశం లో ఈ పథకం అర్హత కు నిర్దేశించిన 5 ఎకరాల పరిమితి ని ఎత్తివేసి, ఈ పథకాన్ని రైతులందరికీ విస్తరించాలని నిర్ణయించారు. దీని తో రైతు సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం దాదాపు రూ.87,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లవుతోంది.
వ్యవసాయ రంగాని కి సంబంధించి ఇంకా ఎన్నో కొంగ్రొత్త పథకాల ను కూడా శ్రీ మోదీ ప్రారంభించారు. సాయిల్ హెల్త్ కార్డులు ఇవ్వడం, ఇ-నామ్ ద్వారా మెరుగైన మార్కెట్ ల సదుపాయాన్ని కల్పించడం, నీటి పారుదల వసతుల కు పునరుత్తేజం వంటి ఎన్నో వినూత్న పథకాలు వాటిలో ఉన్నాయి. నీటి వనరుల కు సంబంధించిన అన్ని ప్రధానాంశాలను ఆచరణీయం చేయడం కోసం కొత్తగా జల శక్తి మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేస్తున్నట్టు 2019 మే 30వ తేదీ న హామీ ఇచ్చారు.
2014 అక్టోబరు 2వ తేదీ న, జాతి పిత మహాత్మా గాంధీ జయంతి ని పురస్కరించుకొని స్వచ్ఛత కోసం “స్వచ్ఛ భారత్” పేరిట ప్రజా ఉద్యమాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. ఈ ఉద్యమం పరిధిలో గాని, ప్రభావంలో గాని చరిత్ర లోనే అతి పెద్ద ది.
2014 సంవత్సరం లో పారిశుధ్య వసతుల విస్తరణ 38 శాతం ఉండగా ఇప్పుడది 99 శాతాని కి పెరిగింది. పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు బహిరంగ మల మూత్రాదుల విసర్జన రహిత (ఒడిఎఫ్) ప్రాంతాలు గా ప్రకటించారు. గంగా నదీ జలాల స్వచ్ఛత కు కూడా పలు చర్యల ను ప్రభుత్వం ప్రకటించింది.
స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. ఈ కార్యక్రమం వల్ల మూడు లక్షల ప్రాణాలు కాపాడడం సాధ్యమవుతుందని అభిప్రాయపడింది.
దేశ సంపూర్ణ పరివర్తన కు రవాణా అత్యంత కీలకమైందని శ్రీ మోదీ విశ్వసిస్తారు. ఆ విశ్వాసాని కి దీటుగానే కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులు, రైల్వేస్, ఐ-వేస్, జల మార్గాలు వంటి విభాగాల లో కొత్త తరం మౌలిక వసతుల అభివృద్ధి కి నిరంతరాయం గా కృషి చేస్తోంది. ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం ద్వారా విమానయాన రంగం అత్యంత ప్రజామిత్ర విభాగం గా మారింది. సంధానం గణనీయం గా పెరిగింది.
దేశాన్ని తయారీ రంగం లో అంతర్జాతీయ స్థాయి లో తిరుగులేని శక్తిగా నిలపడం లక్ష్యం గా ప్రధాన మంత్రి శ్రీ మోదీ “మేక్ ఇన్ ఇండియా” పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది పరివర్తనాత్మక ఫలితాల ను ఆవిష్కరించింది. 2014 సంవత్సరం లో దేశంలో మొబైల్ తయారీ యూనిట్ ల సంఖ్య 2 కాగా 2019 నాటి కి 122 కి పెరిగింది. “వ్యాపారానుకూల వాతావరణం” కల్పించే విషయం లో కూడా భారత్ ఎంతో పురోగమించింది. వ్యాపారానుకూల సూచి లో భారతదేశం 2014 సంవత్సరంలో 142వ స్థానంలో ఉండగా 2019 నాటికి 77వ స్థానానికి ఎదిగింది. 2017 సంవత్సరం లో జరిగిన చారిత్రక పార్లమెంటు సమావేశం ద్వారా “ఒకే దేశం, ఒకే పన్ను” స్వప్నాన్ని సాకారం చేస్తూ దేశ వ్యాప్తం గా జిఎస్ టిని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
దేశ సమున్నతమైన చరిత్ర ను, సంస్కృతిని ఉన్నత శిఖరాల కు చేర్చేందుకు తన పదవీ కాలం లో శ్రీ మోదీ అమిత శ్రద్ధ తీసుకొన్నారు. ఉక్కు మనిషి సర్ దార్ పటేల్ కు ఘన నివాళి గా ఐక్యతా చిహ్నం గా ప్రపంచంలో అతి పెద్దదైన విగ్రహాన్ని ప్రారంభించడమైంది. ప్రత్యేకమైన అతి పెద్ద ప్రజా భాగస్వామ్యం తో ఈ విగ్రహం నిర్మాణం అయింది. “ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్” స్ఫూర్తి తో అన్ని రాష్ట్రాల నుండి, కేంద్రపాలిత ప్రాంతాల నుండి పవిత్రమైన మట్టి ని, రైతుల పనిముట్ల ను తీసుకు వచ్చి చేర్చి ఈ విగ్రహాన్ని నిర్మించారు.
పర్యావరపరమైన అంశాల పట్ల కూడా ప్రధాన మంత్రి శ్రీ మోదీ కి మక్కువ ఎక్కువ. స్వచ్ఛమైన, హరిత భూమండలాన్ని సృష్టించడం కోసం ప్రతి ఒక్కరూ విభేదాలు విడనాడి చేతులు కలపాలని ఆయన పలుమార్లు పిలుపు ఇచ్చారు. గుజరాత్ ముఖ్యమంత్రి గా పని చేసిన సమయంలో శ్రీ మోదీ వాతావరణ మార్పుల ను దీటుగా ఎదుర్కొనేందుకు కొత్త తరహా చర్యల ను చేపట్టడం కోసం ప్రత్యేకం గా వాతావరణ మార్పుల శాఖ ను ఏర్పాటు చేశారు. 2015 లో పారిస్ లో జరిగిన సిఒపి 21 శిఖరాగ్ర సదస్సు లో అత్యున్నత స్థాయి చర్చలు చేపట్టడం కోసం ప్రధాన మంత్రి శ్రీ మోదీ అత్యంత కీలక భూమిక ను పోషించారు.
వాతావరణ మార్పుల పై పోరాటం లో శ్రీ మోదీ మరో అడుగు ముందుకు వేసి వాతావరణ న్యాయం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. మరింత మెరుగైన భూమండలం ఆవిష్కారం దిశ గా కొత్త తరహా చర్యల లో భాగం గా 2018 సంవత్సరం లో ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ ఏర్పాటు కార్యక్రమం లో పలు దేశాలు, ప్రభుత్వాల అధినేత లు స్వయం గా పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ పట్ల ఆయన చర్యలకు గుర్తింపుగా ఐక్యరాజ్యసమితి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీని “చాంపియన్ ఆఫ్ ద అర్థ్” అవార్డు తో గౌరవించింది.
వాతావరణ మార్పులు మన భూమండలాన్ని ప్రకృతి వైపరీత్యాల కు గురి చేస్తున్నాయన్నవిషయాన్ని పూర్తి గా అవగాహన చేసుకున్న శ్రీ మోదీ సాంకేతిక విజ్ఞానం యొక్క శక్తి ని, మానవ వనరుల బలాన్ని పూర్తి గా వినియోగం లోకి తీసుకు వస్తూ వైపరీత్యాల నిర్వహణ లో ఒక కొత్త పంథా ను అనుసరించారు. 2001 జనవరి 26వ తేదీ న అమిత వినాశకరమైన భూకంపం తో నామ రూపాలు లేకుండా పోయిన గుజరాత్ ను ముఖ్యమంత్రి హోదా లో శ్రీ మోదీ సంపూర్ణ పరివర్తన దిశ గా నడిపించారు. అలాగే వరదలు, దుర్భిక్షాల పై పోరాటం విషయం లో కూడా గుజరాత్ లో శ్రీ మోదీ సరికొత్త విధానాన్ని అవలంబించారు. ఆ విధానం అంతర్జాతీయ సమాజం ప్రశంసలకు నోచుకొంది.
పరిపాలన సంస్కరణల ద్వారా పౌరులందరి కి సమ న్యాయాన్ని కల్పించడానికి శ్రీ మోదీ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజా సమస్యల ను పరిష్కరించడం కోసం గుజరాత్ లో శ్రీ మోదీ సాయంత్రం పని చేసే కోర్టులు ప్రారంభించి ఒక కొత్త శకాన్ని ఆవిష్కరించారు. దేశ వృద్ధి ని జాప్యం చేస్తున్న పలు పెండింగ్ ప్రాజెక్టు ల నిర్మాణాన్ని వేగవంతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వ స్థాయి లో ప్రగతి (క్రియాశీల పాలన- సకాలంలో అమలు) కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు.
శ్రీ నరేంద్ర మోదీ విదేశాంగ విధానం లో తీసుకున్న చొరవ ల వల్ల ప్రపంచం లోని అతి పెద్ద ప్రజాస్వామిక దేశం గా భారతదేశం యొక్క పూర్తి స్థాయి శక్తి సామర్థ్యాలు వినియోగం లోకి వచ్చాయి. ఎస్ఎఆర్ఆర్ సి (సార్క్) దేశాధినేత ల సమక్షం లో ప్రమాణస్వీకారం చే సి ప్రధాన మంత్రి గా తొలి పర్యాయం పాలన కు శ్రీ మోదీ నాంది పలికారు. రెండో పర్యాయం పదవీకాలం ప్రారంభోత్సవానికి బిఐఎమ్ ఎస్ టిఇసి (బిమ్స్ టెక్) దేశాధినేతల ను ఆహ్వానించారు. ఐక్య రాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ లో ఆయన ప్రసంగానికి ప్రపంచం యావత్తు ప్రశంసల జల్లులు కురిపించింది. సుదీర్ఘ విరామం అనంతరం వివిధ దేశాల లో ద్వైపాక్షిక పర్యటన తొలి భారత ప్రధాన మంత్రి గా ఆయన గుర్తింపు పొందారు. 17 సంవత్సరాల అనంతరం నేపాల్, 28 సంవత్సరాల అనంతరం ఆస్ట్రేలియా, 31 సంవత్సరాల అనంతరం ఫిజీ, 34 సంవత్సరాల అనంతరం సెశెల్స్, యుఎఇ లలో పర్యటించిన మొట్టమొదటి భారత ప్రధాన మంత్రి శ్రీ మోదీ. తొలి పదవీకాలం ప్రధాన మంత్రి గా ప్రమాణ స్వీకారం చేయగానే శ్రీ మోదీ ఐక్య రాజ్య సమితి, బిఆర్ ఐసిఎస్ (బ్రిక్స్), సార్క్, జి-20 శిఖరాగ్ర సమావేశాల లో పాల్గొన్నారు. ఆయా సమావేశాల సందర్భం గా ప్రపంచ ఆర్థిక, రాజకీయాంశాల పై భారతదేశం ప్రదర్శించిన చొరవలు, ప్రకటించిన అభిప్రాయాల కు విస్తృతమైన ప్రశంసలు వచ్చాయి.
ప్రధాన మంత్రి శ్రీ మోదీ కి ఎన్నో అంతర్జాతీయ అత్యున్నత పౌర పురస్కారాలు లభించాయి. సౌదీ అరేబియా ఆయన కు తమ అత్యున్నత పౌర పురస్కారం సాష్ ఆఫ్ కింగ్ అబ్దులజీజ్ తో సత్కరించింది. శ్రీ మోదీ కి అత్యున్నత పౌర పురస్కారాల ను ప్రదానం చేసిన వివిధ దేశాల లో రష్యా (ద ఆర్డర్ ఆఫ్ హోలీ ఆపాస్సల్ యాండ్రూ ద ఫస్ట్), పాలస్తీనా (గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీన్), అఫ్గానిస్తాన్ (అమీర్ అమానుల్లా ఖాన్ అవార్డ్), యుఎఇ (జయేద్ మెడల్), మాల్దీవ్స్ (రూల్ ఆఫ్ నిశాన్ ఇజ్జుద్దీన్) లు ఉన్నాయి. శాంతి కి, అభివృద్ధి కి చేస్తున్న కృషి కి గుర్తింపుగా శ్రీ మోదీ 2018 లో ప్రతిష్ఠాత్మకమైన సియోల్ శాంతి బహుమతి ని అందుకొన్నారు.
యావత్తు ప్రపంచం సంవత్సరం లో ఒక రోజు ను “అంతర్జాతీయ యోగ దినం’’ గా పాటించాలన్న శ్రీ నరేంద్ర మోదీ పిలుపునకు ఐక్య రాజ్య సమితి లో అద్భుత స్పందన వచ్చింది. ప్రతి సంవత్సరం లో జూన్ 21వ తేదీ ని “ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ యోగ దినం”గా పాటించాలన్న తీర్మానాన్ని177 సభ్యత్వ దేశాలు ముక్తకంఠం తో ఆమోదించాయి.
శ్రీ మోదీ గుజరాత్ లోని ఒక చిన్న పట్టణం లో 17 సెప్టెంబర్ 1950 న జన్మించారు. సమాజంలోని అట్టడుగు వర్గాల కోవ లోకి వచ్చే ఇతర వెనుకబడిన వర్గాలు తరగతి కి చెందింది ఆయన కుటుంబం. అదనం గా “ఒక్క రూపాయి దాచుకోగల స్తోమత” కూడా లేకపోయినా ప్రేమాభిమానాలకు కొదవ లేని అత్యంత నిరుపేద కుటుంబం లో ఆయన పెరిగారు. జీవితం యొక్క ఆరంభ దశలో శ్రీ మోదీ ఎదుర్కొన్న కష్టాలు జీవితం లో శ్రమ విలువ తెలిసేలా చేశాయి. అలాగే పరిష్కారాని కి అవకాశం ఉన్న సామాన్య ప్రజల కష్టాలు ఏమిటో తెలిసేలా కూడా చేశాయి.
శ్రీ మోదీ అతి చిన్న వయస్సు లో దేశ సేవ, ప్రజా సేవ ల పట్ల ఆకర్షితుడు కావడానికి ఈ అనుభవాలు స్ఫూర్తి గా నిలచాయి. తొలినాళ్ళ లో, ఆయన జాతీయవాద సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో (ఆర్ఎస్ఎస్) అంకిత భావం తో పని చేసి జాతి నిర్మాణ కార్యక్రమాల లో పాలు పంచుకొన్నారు. తరువాత ఆయన భారతీయ జనతా పార్టీ లో రాష్ట్ర స్థాయి లో మరియు జాతీయ స్థాయి లో పని చేసి రాజకీయాలకు తనను తాను అంకితం చేసుకున్నారు. శ్రీ మోదీ గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రం లో తన ఎంఎ డిగ్రీ ని పూర్తి చేశారు.
శ్రీ నరేంద్ర మోదీ “ప్రజా నాయకుడు”. సామాన్య ప్రజల సమస్యల ను తీర్చడానికి, వారి సంక్షేమాని కి పాటు పడేందుకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. ప్రజలతో మమేకం కావడం, వారి ఆనందం, విచారాలన్నింటిలో భాగస్వామి కావడంలో శ్రీ మోదీ ఆనందాన్ని, తృప్తి ని అనుభవిస్తారు. అందుకోసం ఆయన నిరంతరం ఆన్ లైన్ లో ఉండి ప్రజల తో “వ్యక్తిగత అనుసంధానా”న్ని ఏర్పాటు చేసుకొన్నారు.
సాంకేతిక పరిజ్ఞానం పట్ల విశేషమైన మక్కువ గల నాయకుని గా శ్రీ మోదీ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. వెబ్ సహాయం తో ప్రజల జీవితాల లో మార్పునకు ఆయన శ్రీకారం చుట్టారు. ఫేస్ బుక్, ట్విటర్, ఇన్ స్టాగ్రామ్, సౌండ్ క్లౌడ్, లింక్ డ్ ఇన్, వీబో ల వంటి భిన్న సామాజిక మాధ్యమాల వేదికల పైన ఆయన చాలా చురుకు గా ఉంటూ, ప్రజల తో భావాలను పంచుకొంటూ ఉంటారు.
రాజకీయాలకు ఆవల, రచనా వ్యాసంగాన్ని శ్రీ మోదీ ఇష్టపడతారు. ఆయన పేదరికం సహా, పలు అంశాల పైన పుస్తకాలు వ్రాశారు. ఆయన ప్రతి రోజు యోగా చేస్తారు. ఇది ఆయన కు యోగా శారీరిక దార్ఢ్యాన్ని, మానసిక దృఢత్వాన్ని ప్రసాదించడం తో పాటు ఎల్లప్పుడు ఎంతో వేగవంతమైన కార్యకలాపాలతో తలమునకలుగా ఉండే ఆయన లో ప్రశాంతి తాలూకు శక్తి ని కూడాను నింపుతూ వుంటుంది.
No comments:
Post a Comment