Tuesday, 16 August 2022

పాలెందుకు విరిగిపోయాయో !

బాధ్య‌త ప‌రిపూర్ణం అయితే చాలు ఏ పాలూ విర‌గ‌వు

కొందరు వ్యక్తులు సమాజంలో ప్రతికూలతను మాత్రమే హైలైట్ చేస్తారు.

అవును, అది నిజమే మంచి ఉన్నచోట చెడు ఉంటుంది

శ్రీమతి పింగళి చైతన్య యొక్క వ్రాత ఎంత భయంకరంగా ఉంది.

ఆమె తన వ్రాతలో నాణెం యొక్క ఒక వైపు మాత్రమే ప్రదర్శించింది

ఇది ఆమె మానసిక మనస్తత్వాన్ని మరియు ఆమె ఆలోచనా విధానాన్ని చూపుతుంది

ఎర్ర గురువింద తన నలుపెరుగనట్లుగా 

సైనికులంతా చెడ్డ‌వాళ్లు అన్న సూత్రీక‌ర‌ణ ఎందుకు చేయడం

మ‌న దేశంలో చాలా మంది బాధ్య‌త‌ల గురించి అస్స‌లు ప‌ట్టించుకోరు.

అదే ప‌నిగా మోడీనో జ‌గ‌న్ నో లేదా కేసీఆర్ నో తిట్ట‌డం.

ఎవరో ఒకరిని దూషించడం ఈ రోజుల్లో ఎక్కువ అయి పోయింది

నవీష్ మూర్తి రమణ మూర్తి ఇద్దరు రియల్ ఎస్తెట్ కంపెనీ అయిన జనాహర్షలో వ్యాపార భాగస్వాములు నవీష్ మూర్తి హత్య కేసులో A1 రమణ మూర్తి A2 పింగళి చైతన్య
నవీష్ మూర్తిని L B నగర్ ఓ పంక్షన్ హాల్ లో హత్య చేసి శ్రీనగర్ కాలనీ లో ఓ ఇంట్లో పూడ్చి వేసారు అన్నది అభియోగం అప్పట్లో వీరు జై భారత్ అనే సంస్థను కూడా నడిపేవారు నాకు గుర్తు వున్నంత వరకు 2005 లో ఈ హత్య జరిగింది ఇప్పటికీ జనాహర్ష భాదితులు వున్నారు
ఈ అమ్మాయి తెలుగు సినీరంగంలో అసోసియేట్ డైరెక్టర్ గా రైటర్ గా పనిచేస్తున్నారు
ఈ అమ్మాయి పింగళి వెంకయ్య ముని మనవరాలు పింగళి దశరధ రామ్ కూతురు
దశరధ రామ్ ఎన్ కౌంటర్ అనే పత్రిక నడిపారు విజయవాడ నడి బొడ్డు న హత్య కావించ బడ్డాడు



ట్రెయిన్ లో మ‌గాళ్లు చెర‌చ‌బ‌డ్డ ఆడ‌వాళ్లు ఏవో క‌రెక్టుగా గుర్తుకు రావ‌డం లేదు. ఈ పాటి మాట‌లు ఆరుద్ర కూడా చెప్పాడు. కానీ వారేం పాటించారో కూడా నేను చెప్ప‌గ‌ల‌ను. మ‌న దేశంలో ఉన్న చెడు ఉన్నంత మంచి వీటి గురించి త‌రుచూ మాట్లాడేవారు బ‌య‌ట ప్ర‌పంచంలో విభిన్నంగా ఉంటారు అని నా ఊహ లేదా నా ప‌రిశీల‌న. ఊహాత్మ‌కం కొన్ని వాస్త‌వికం కొన్ని క‌లిస్తే జీవితం. క‌లిస్తేనే ప్ర‌యాణం.ఆ రోజు ఎన్టీఆర్ ను ఉద్దేశించి ద‌శ‌ర‌థ్ రామ్ ఏ త‌ర‌హా భాష వాడారో కూడా చెప్ప‌గ‌ల‌ను. ఇప్పుడు చైత‌న్య అనే ఓ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ లేదా రైటింగ్ అసోసియేట్ పాలు విరిగాయి.. పెరుగు పోయింది ఇలా ఏవేవో చెబుతున్నారు క‌దా వీటి గురించి కూడా మాట్లాడ‌గ‌ల‌ను. నా వ‌ర‌కు తెలుసు ఏ స్థాయిలో వాక్యం ఉంది ఏ స్థాయిలో వాక్యార్థం లేదా వ‌చ‌నార్థం ఉంది అన్న‌ది.. ఆ మేర‌కు ఈ పంద్రాగ‌స్టు నాకేం కొత్త ఆనందాలు ఇవ్వ‌లేదు కానీ బాధ్య‌త‌లో భాగంగా కొంద‌రికి సాయం చేసి వ‌చ్చాను. అదేవిధంగా నా చుట్టూ ఉన్న వారి యోగం, క్షేమం కోసం ప్రార్థించ‌ను ప్ర‌య‌త్నిస్తాను. క‌నుక కాలం పెద్ద నోరు తెరిచిందో లేదో కానీ మ‌న అరుపులు మ‌న వాస్త‌వాలు మ‌న చిత్త‌గింపులు అన్న‌వి ఎప్పుడూ ఉండాలి.. ఉంటాయి కూడా ! ఆ కోవ‌లో ఎవ్వ‌రు ప‌నిచేసినా ఆనందిస్తాను. బాధ్య‌త‌లో భాగంగా చేసే ప్ర‌తి ప్ర‌య‌త్న‌మూ గొప్ప‌దు. అప్పుడు ఊసుపోవ‌డాలు, ఊహ పోవ‌డాలు అన్న‌వి ఉండ‌వు. విమెన్ అబ్యూజింగ్ అన్నింటా ఉంది. వీటిని వీలున్నంత వ‌ర‌కూ ఆప‌డ‌మే బాధ్య‌త. అప్పుడు మాత్ర‌మే పాలు విర‌గ‌వు. అవును బాధ్య‌త‌లో భాగంగా రాత ఇంకాస్త గొప్ప‌ది.. అప్పుడు మాత్ర‌మే చైత‌న్య స‌హిత స‌మాజ నిర్మాణం సాధ్యం. దేశాన్ని నేను తిట్ట‌ను కాలాన్ని నేను తిట్ట‌ను. కిట్ట‌ని ప‌నులు చేయ‌ను. య‌థ‌తథా త‌థాగ‌తా అన్న‌ది నా సూత్రం. రాస్తున్నానొక మార్నింగ్ రాగా..
దేశాన్ని ప్రేమించే శ‌క్తులు, ప‌దే ప‌దే కొన్ని త‌ప్పులు మాత్ర‌మే సంద‌ర్భ స‌హితంగా రాసి ఊరు పేరు స్థిరం చేసుకునే వ్య‌క్తులు ఈ విధంగానో ఏ విధంగానో ఉంటూనే ఉంటారు. సంద‌ర్భం క‌దా ! మాట్లాడాలి. త‌ప్పేం లేదు. ఒక ఓఆర్ఆర్ (లాక్డౌన్ వేళ‌ల‌లో ) క్యాంప్ నిర్వ‌హించి వంద ఫొటోలు పెట్టుకోవ‌చ్చు. అది కూడా త‌ప్పేం కాదు. బీహారీల‌నూ, మ‌ధ్య ప్ర‌దేశ్ వాళ్ల‌ను బ‌స్సుల‌లో త‌రలించ‌వ‌చ్చు.
అది కూడా బాధ్య‌త. దానినేం త‌క్కువ చేయం కానీ.. అధికారులు వ‌చ్చి అదే ఓఆర్ఆర్ క్యాంపున‌కు వ‌చ్చి మాట్లాడేట‌ప్పుడు కాస్త ఒళ్లు ద‌గ్గ‌ర‌పెట్టుకుని ఓ త‌హ‌శీల్దార్ తోనో., లేదా ఆర్డీఓతోనో మాట్లాడి ఉంటే ఇంకా బాగుండేది. ఎవ్వ‌రూ ఇక్క‌డ సిస్టంకు అతీతులం కాదు. నేను మొద‌ట వ్య‌వ‌స్థ‌ను గౌర‌విస్తాను. సైనికులంతా చెడ్డ‌వాళ్లు అన్న సూత్రీక‌ర‌ణ ఎందుకు చేయడం.. ఇదొక ఫ్యాషన్ కాబోలు. అయితే మంచి సైనికులు, మంచి విలువ‌లు ఉన్న పోలీసులు ఈ దేశంలోలేరా ? అంటే ఇప్పుడు క‌థా సెమినార్ ల పేరిట విమెన్ అబ్యూజింగ్ జ‌ర‌గ‌డం లేదా ? వాటిపై కూడా తిరుగుబాటు చేస్తే పాలు విరిగాయా అతికాయా అన్నవి త‌ప్ప‌క తెలుస్తాయి.
సైనికుడు చ‌నిపోయాక ఆ కుటుంబం ప‌డే వేద‌నను గుర్తించిన‌ప్పుడు, లేదా మేజ‌ర్ లాంటి సినిమాలు వ‌చ్చిన‌ప్పుడు, సీతారామం లాంటి సినిమాలు వ‌చ్చిన‌ప్పుడు వెలుగులోకి వ‌చ్చే విష‌యాలు (కొన్ని ఫిక్ష‌న‌ల్ పాయింట్స్ ఉన్నా కూడా ) ఆయా సంద‌ర్భాల్లో ఇంకా చాలా గుర్తుకు వ‌స్తాయి. నేనొక బాధిత కుటుంబాన్ని ప‌ల‌క‌రించి వచ్చాను. ప్యాండమిక్ టైమ్ లో మా ఊరి కుర్రాడు లాన్స్ నాయ‌క్ లావేటి ఉమామ‌హేశ్వ‌ర‌రావు చ‌నిపోయారు. ఆయ‌న కుటుంబాన్ని పల‌క‌రించి వీలున్నంత సాయం నా స్నేహితుల‌తో క‌లిసి చేసి వ‌చ్చాను. ఇది బాధ్య‌త. మ‌న దేశంలో చాలా మంది బాధ్య‌త‌ల గురించి అస్స‌లు ప‌ట్టించుకోరు. ఇదొక ఫ్యాష‌న్. అదే ప‌నిగా మోడీనో జ‌గ‌న్ నో లేదా కేసీఆర్ నో తిట్ట‌డం. పౌరులుగా మీరెంత బాధ్య‌త‌తో ఉన్నారు అన్న‌ది ముందు గుర్తించండి చాలు. అప్పుడు ఏ పాలూ విర‌గ‌వు. మీకు వీలున్నంత వ‌ర‌కూ విమెన్ ఎబ్యూజింగ్ ను మీడియా హౌసెస్ లో ఆపండి.
మీకు ద‌మ్ముంటే వాటిపై క‌థ‌నాలు రాయండి. మీకు ద‌మ్ముంటే తోటి బాధిత గొంతుక‌లు వినిపించండి. ఏం కాదు అప్పుడు ఏ పాలూ విర‌గ‌వు. అంతా మంచి అని రాయ‌డం త‌ప్పు..నాకు తెలుసు. మా ఇంటి ఎదురు మా వీధి చివ‌ర బాధితులు ఉంటారు.వారి త‌ర‌ఫున మాట్లాడ‌డ‌మే ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యం. ఆ రోజు పింగ‌ళి ద‌శ‌ర‌థ్ రామ్ ఏం రాశారో చెప్ప‌గ‌ల‌ను.. ఇప్పుడు చైత‌న్య ఏం రాస్తున్నారో మాట్లాడ‌గ‌ల‌ను. నా వ‌ర‌కూ తెలుసు ఎవ‌రు ఏంటో ఎంత మేరకు రాయ‌గ‌ల‌రో క‌నుక పాలు విర‌గ‌వు. ర‌క్త‌పు టేరులు దాటిన సంద‌ర్భాల్లో ప్ర‌తిఒక్క‌రం కూడా ఉన్నాం. కానీ దేశాన నెల‌కొనే మంచికి మ‌నం ఏ మేర‌కు దోహదం అన్న‌దే కీల‌కం. అందాక ఉన్న కొద్దిపాటి మంచిని పెంచే బాధ్య‌త అన్న‌ది అంద‌రికి కాదు పై ..అంద‌రిపై కాకపోయినా కొందరిపై అయినా ఉంద‌న్న‌ది దేవుడి ఆజ్ఞ. ఈ ఉద‌యం పంద్రాగ‌స్టు ఇచ్చిన ఆనందాల‌ను అదే స‌మ‌యంలో కొన్ని విషాద స‌మ‌యాల‌నూ స్మ‌రిస్తూ మిక్కిలి బాధ్య‌త‌తో..మ‌రికొంత రాత...
పంద్రాగ‌స్టు సాయంకాలం
సాయం కాలం సంధ్యా రాగం ఇవ‌న్నీరాయ‌డం వెరీ రొటీన్. ఏం చేయాలి సాయంకాలాల‌ను అని వృథా సంబంధ ఆలోచ‌న ఒక‌టి ఎవ‌రికి వారు చేస్తుంటారే ! నేను ఇవాళ ఒక బ‌డికి పోయాను.. ఒక కాలేజీకి పోయాను. బ‌డిలో బిడ్డ‌ల‌ను చూశాను. రేప‌టి కాలం వారికి కొత్త ఆనంద నంద‌న వ‌నాలు ఇవ్వాల‌ని కోరుకోవడం నా బాధ్య‌త అని గుర్తించాను. న‌న్ను క‌దిలించిన ఓ మావో స్టేట్మెంట్ ను మ‌ళ్లీ స్మ‌రించాను. ఈ ఆనందాల వేళ చెంత ఓ బాధ్య‌త. ఆక‌లి తీర్చే ప్ర‌య‌త్నం నుంచి అన్నం పెట్టే ప్ర‌య‌త్నం వ‌ర‌కూ ఓ క్ర‌తువుకు మూలం అయ్యే ప్ర‌తి చేత‌కూ చేయూత‌కూ వంద‌నాలు చెల్లించి ముందుకు పోయాను. కాలాన్ని కానీ దేశాన్ని కానీ నేను తిట్ట‌ను. నా బాధ్య‌త ప‌రిపూర్ణం అయితే చాలు ఏ పాలూ విర‌గ‌వు.. ఈ మంచీ ఆగిపోదు. మ‌రీ ఆ విధంగా గ్లోరిఫై చేయాల్సిన ప‌ని నా వ‌ర‌కూ లేదు. ఎందుకంటే దేశం కోసం అనే పెద్ద ప‌దం ద‌గ్గ‌ర నేను లేను. చుట్టూ ఉన్న‌వారి కోసం బాధ్య‌త‌గా మెల‌గ‌డమే గొప్ప బాధ్య‌త. క‌నుక ఇప్పుడు పాలు విర‌గ‌వు విర‌గ‌నివ్వ‌ను కూడా ! ఏవో ఎవ‌రో రాస్తారు జ‌స్ట్ పీపుల్ అటెన్ష‌న్ కోసం. ఆ రాతల్లో ఏమీ ఉండ‌దు జ‌స్ట్ సోదీ త‌ప్ప !
- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

No comments:

Post a Comment

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...