Monday 13 June 2022

క్రిటికల్ థింకింగ్ అంటే ఇంగిత జ్ఞానం .


 "నాన్నా ! నాకు ఈ పరీక్షల్లో గత పరీక్షతో పోలిస్తే అయిదు రెట్లు ఎక్కువ మార్కులు వచ్చాయి " చెప్పాడా అబ్బాయి .

తండ్రి ఆనందం తో ఉబ్బితబ్బిబై స్నేహితులకు పార్టీ ఇచ్చాడు ." మా అబ్బాయి సూపర్!" అని చెప్పాడు .పార్టీ లో ఒకడు "ఇంతకీ, మీ అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చాయి?" అని అడిగాడు . తండ్రి అప్పుడు కొడుకుకు ఫోన్ చేసి విషయం కనుకొన్నాడు . వాడికి గత పరీక్షలో నూటికి ఒక మార్కు వచ్చింది . ఇప్పుడు నూటికి అయిదు మార్కులు వచ్చాయి . విషయం అర్థం అయ్యే సరికి పార్టీ లో ఒకడి మొఖం లో కళ లేకుండా పోయింది .
ఇంకో చోట .. రియల్ ఎస్టేట్ ప్రకటన . "మార్కెట్ రేట్ కోటి రూపాయిలు .. మా దగ్గర కేవలం యాభై lakhs . హాట్ కేకుల్లా కాదు కాదు .. రెండిసివెర్ మందులా అమ్ముడు పోయింది .
విషయం ఏమిటంటే మార్కెట్ లో అయిదు వందల గజాల సైట్ కోటి రూపాయిలు . వీడు అమ్ముతున్నది రెండు వందల గజాల సైట్ .దాన్ని కింద కనిపించి కనిపించకుండా బ్రోచర్ లో ప్రింట్ చేసాడు
రానున్నది అపసమాచార యుగం ... విషసమాచార యుగం .
ఒకప్పుడైతే సమాచారం లేక అనేక సమస్యలు ఎదురయ్యేవి . ఇప్పుడు సమాచారం పుంఖానుపుంఖాలుగా లభిస్తోంది . జనాల్ని మోసం చేసేటోడు తెలివిగా సమాచారాన్ని వక్రీకరించి గణాంకాలతో మోసం చేస్తాడు .
ఇప్పుడు కోవిద్ కేసుల గాలి లెక్కలే తీసుకోండి . గత వారం నుండి కోవిద్ టెస్ట్ లను మూడు- నాలుగు రెట్లు పెంచారు . ఆ విషయం దాచేసి "వామ్మో నాలుగు రెట్లు పెరిగిన కోవిద్ కేసులు" అని ప్రచారం . రెండుళ్లుగా ఇదే పద్దతి .ఇదే మోసం
వాక్ సీన్ సంగతే తీసుకొందాం . మొన్నటి దాకా ఏమి చెప్పారు ?" అసలు వాక్ సీన్ కు సైడ్ రియాక్షన్ ఏంటండీ ? బుద్ది ఉందా ? సైన్స్ తెలుసా ? ఇంత అజ్ఞానమా ?" అని దబాయించారు . వేల కేసుల్లో ఒకటో రెండు ప్రభుత్వం దాక చట్టబద్ధ సంస్థల దాక వెళ్లి వాక్ సీన్ వల్లే అని రుజువు కావడం తో ఇప్పుడు మాట మార్చారు . " అబ్బే .. ఎక్కడో నూటికో కోటికో ఒక్కటండి..... అయినా వాక్ సీన్ మా తల్లి చేసిన మేలు ముందు ఈ కీడు ఎంత ?" అని అనునయిస్తున్నారు .
ఇది కేవలం ప్రారంభం . రానున్న రోజుల్లో ఇలా అందమైన అబద్దాలు, గణాంకాలు, పట్టికలు తో జిగాబైట్ల కొద్దీ అబద్దాలు ప్రచారం లోకి వస్తాయి .మోసాలు నేరాలు ఘోరాలు సాధారణం అయిపోతాయి .
రానున్నది రోబో యుగం . కృత్రిమ మేధ యుగం
రోబో యుగం లో క్రిటికల్ థింకింగ్ వున్నవారే బతికి జీన్స్ పాంట్స్ ధరిస్తారు . మిగతా వారు బకరాలుగా మోసపోయి దుర్భర జీవితం గడుపుతారు
క్రిటికల్ థింకింగ్ అంటే ఇంగిత జ్ఞానం .
విన దగు నెవ్వరు చెప్పిన... వినినంతనే వేగ పడక వివరింప తగున్. .....
పేపర్ లో వచ్చింది ... టీవీ లో వచ్చింది... వాట్సప్ లో వచ్చింది.... అని గుడ్డిగా నమ్మితే ఆస్తులు ప్రాణాలూ హరీ మంటాయి . దేన్నీ గుడ్డిగా నమ్మొదు. ఆలోచించండి . విచారించండి . తర్క విచారణ అవసరం . లాజికల్ థింకింగ్ .. లాటరల్ థింకింగ్ . క్రిటికల్ థింకింగ్ అవసరం . రోబో యుగం లో బతకడానికి అదే ఆక్సిజన్
హెడ్లైన్స్ చూసి గుడ్డిగా నమ్మేవాళ్ళు .. మెసేజ్ చదివీ చదవక వెంటనే ఫార్వర్డ్ చేసేవారు .. ఇలాంటి వారిని వెబకూఫ్ అంటారు . బేవకూఫ్ అంటే తెలివితక్కువ వ్యక్తి అని . వెబ్ అంటే నెట్ లో వచ్చింది ప్రతిదీ నిజం అని నమ్మేవాడు వెబ్ కూఫ్ .వెబ్ కూఫ్ లను మనం బాలరాజులు అని చెప్పుకొందాము
భావి రోబో ప్రపంచ విధాత గేట్ల తాత !
గేట్ల తాత నాలుగో పారిశ్రామిక యుగం లో ప్రపంచం ఎలా ఉండాలో నిర్ణయిస్తున్నాడు .రోబో యుగపు బ్రహ్మ . ఎక్కడో దూరంగా కూర్చొని మన తలరాతలు రాస్తున్నాడు .చిత్రమైన గారడీ చేస్తూ... తమాషాలు చూస్తున్నాడు
వెబ్ కూఫ్ ల గురించి గేట్ల తాత ఆలోచనలు ఇలా వున్నాయి ..
"ఏమిరా బాల రాజులూ! . ఏమిరా మీ వల్ల ప్రపంచానికి ఉపయోగం? . వృధాగా పుట్టి పుడిసినారు . రోజూ తిని పుడిసినారు . మీ వల్ల పర్యావరణం నాశనం . ప్రకృతి విలయం . రోబో యుగం లో మీ లాంటి గొర్రెల వల్ల ప్రయోజనం ఏందిరా ? పాండిరా . సూది మందు వేసుకోండి రా . ఈ భూమి భారాన్ని తగ్గించాలి . ఇంగిత జ్ఞానం వున్నవాడు ఉంటే చాలు . . పాండిరా బలరాజులు/ రాణులూ "
మీకు అర్థం అయ్యిందా ? అర్థం అయితే వెంటనే నమ్మేయకండి . ఇది నిజామా అని ఆలోచించండి . క్రిటికల్ థింకింగ్ . ఆ దారిలో ఆలోచించాలి . ప్రతి విషయం గురించి ఆలోచించాలి . కొన్ని ఉదాహరణలు ఇస్తాను . బాగా ఆలోచించండి .
1 . "కంచి దగ్గర స్కూల్ బస్సు ఆక్సిడెంట్ కు గురయింది .గాయపడ్డ బాలబాలిక చికిత్స కోసం రక్తం కావాలి" అని మెసేజ్ . అయ్యో అంటూ ఫార్వర్డ్ చేసారు బాలారాజులు. పాపం జాలి గుండె . అసలు ఆక్సిడెంట్ అయ్యింది ఎప్పుడు? డేట్ ఏంటి? అని చెక్ చేసారా ? ఆ మెసేజ్ బలరాజుల పుణ్యమా అని ఇంకా వాట్సాప్ లో తిరుగుతూనే వుంది . ఆ పిల్లలు చదువు ముగించుకొని ఉదోగాల్లో స్థిరపడి ఉంటారు. మెసేజ్ మాత్రం ఇంకా వైరల్
2 . బెంగళూరు లో ఆక్సిడెంట్ కు గురయిన దంపతుల కిడ్నీ లు ఉన్నాయి అనే మెసేజ్ వైరల్ . కిడ్నీ లు దొరకడానికి ఇదేమైనా పంజాగుట్ట మటన్ షాపా? అసలు కిడ్నీ లను ఆలా ఎవరైనా రోజుల తరబడి మెసేజ్ లు పెట్టి , ఫార్వర్డ్ లు చేసి దానం ఇస్తారా ? ఏమిరా జాలిగుండె బాలరాజులూ !
3 . బెంగళూరు లో ఎవరో ఉచిత విద్య ఇస్తున్నారు అని మెసేజ్ వైరల్ . కనీసం అక్కడి ఇచ్చిన నెంబర్ ల కు ఫోన్ చేస్తే అవన్నీ ఎందుకు స్విచ్ ఆఫ్ అయివున్నాయో అర్థం అయ్యేది . కానీ మనోళ్లు బాలరాజులు . డేటా ఎక్కువ వినియోగం .. సర్వీస్ ప్రొవైడర్ ఆనందం లో . బాల రాజుల వల్ల లాభపడేది వారే . అసలు ఇలాంటి మెసేజ్ లకు పుట్టిల్లు వారే
4 . సంవత్సరాల తరబడి తెగ తిని ఒక్క సారి నిద్రలేచి స్లిమ్ అయిపోవాలి అనుకొని డైట్ కంట్రోల్ చేయలేక, వ్యాయామం చేయలేక హెర్బల్ మెడిసిన్ తింటే సన్నబడి పోతాము అనుకొని తిని కిడ్నీ లను కోల్పయిన బాల రాజు లు బాల రాణులు కోకొల్లలు . యెవడేమి చెప్పినా నమ్మేయడమేనా ? కుందేళ్ళ యాపారం, టేకు చెట్ల యాపారం ,గంధపు చెక్క యాపారం లో పెట్టుబడులు పెట్టి కోటీశ్వరులయిన అయినా వారు ఎంత మంది ? .. జపాన్ చాప పై పడుకొని .. రూమ్ లో మెషిన్ పెట్టుకొని ఆరోగ్యవంతులయిన వారెంతమంది ? ఏమిరా బాల రాజూ !
5 . మనం భారతీయులం . మన జాతీయ గీతం అంటే మనకు ఎంతో ఇష్టం . గర్వ కారణం . బాగుంది . కానీ 180 కి పైగా దేశాలు, నూరుకు పైగా భాషలు ఉన్న ప్రపంచం లో ఇన్ని భాషల్లోని జాతీయ గీతాలను విని అర్థం చేసుకొని అందులో ఒక జాతీయ గీతం ఉత్తమం అని నిర్ణయించడం సాధ్యమా? అని ఆలోచించకుండా మన జాతీయ గీతానికి ఉత్తమ గీతం అవార్డు వచ్చిందనే మెసేజ్ ని వైరల్ చేసిన బాల రాజులు .. గేట్ల తాత ఉన్నాడు. పైకి పంపించేస్తాడు . జాగ్రత్త
బాలరాజుల పట్ల గేట్ల తాత జీరో టాలరెన్స్ పాలసీ లో వున్నాడు . వాడికో పెద్ద అంతర్జాతీయ బృందం . మైక్ లు.. కరపత్రాలు .. అమ్ముడు పోయిన వారు .... మేళగాళ్ళు . బ్రోకర్ లు . ప్రచారం చేసేవారు . నిజం చెప్పేవారు పై ఎదురు దాడి చేసేవారు . తస్మాత్ జాగ్రత్త్త . బుర్ర ఉపయోగించండి .
ఇంగిత జ్ఞానం ఉన్నోనిదే రేపటి ప్రపంచం .
ఇంగిత జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అని అనుకొంటున్నారా ? ఇది సూపర్ మార్కెట్ లో . చైనా వారి కోళ్ల ఫారాల్లో దొరకదు .
తెనాలి రామలింగడి కథలు .. అక్బర్- బీర్బల్ కథలు .. పంచ తంత్రకథలు ..
చందమామ .. బాలమిత్ర ..
రోబో యుగం లో ముందుకు వెళ్ళాలి అంటే మీరు ఎప్పుడో పనికి రాదని వదిలేసిన పాత పద్ధతుల్లోకి, పాత ప్రపంచం లోకి మళ్ళీ వెళ్లాల్సిందే .
కృత్రిమ మేధ యుగం లో సహజ మేధ ఉన్నోడిదే బతుకు . దాన్ని పెంచుకోండి . మేధ అంటే బట్టి కొట్టడం కాదు . గుడ్డిగా నమ్మడం కాదు . మేధ అంటే ఒక తెనాలి రామలింగడు . ఒక బీర్బల్ .
సహజ మేధ .. అదే బతుకు .. అదే భవిత

No comments:

Post a Comment

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...