Wednesday, 22 June 2022

 భారత రాష్ట్రపతి కానున్న ఆదివాసీ మహిళ


ద్రౌపది ముర్ము 1958 లో బైడపోసి అనే గ్రామంలో మయుర్బంజ్ జిల్లా ఒరిస్సాలో జన్మించారు.
ఆమె BA పాస్ అయి ఆరోబిందో కాలేజిలో హానరరీ ప్రొఫెసర్ పదవిలో పని చేసి ఒరిస్సా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యారు.



1997 లో ఆమె బీజేపీలో జాయిన్ అయ్యారు. 1997లోనే రాయ్ రంగపూర్ లో కౌన్సిలర్ గా మొట్టమొదటి సారిగా ఎన్నికల్లో గెలిచారు. తరువాత అదే సం. లో ఆమె రాయ్ రంగ్ పూర్ వైస్ చైర్మన్ అయ్యారు.
2000 సం. లో ఆమె అక్కడ నుండే MLA గా గెలిచి బీజేడీ-బిజెపి ప్రభుత్వం లో నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి క్రింద రవాణా శాఖా మంత్రిగా, 2002 లో ఫిషరీస్ మరియు ఆనిమల్ హాజ్బండ్రి మంత్రిగా 2004 వరకు చేశారు. 2004లో అక్కడ నుండే మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి 2009వరకు వున్నారు. మధ్యలో కొన్ని సం. లు తప్ప 2002 నుండి 2015 వరకు ఆమె మయుర్బంజ్ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ గా వున్నారు. ఆమె ఒరిస్సా బిజెపి రాష్ట్ర ఎస్టీ మోర్చా ప్రెసిడెంట్ గా కూడా చేశారు.
2015లో ఆమె జార్ఖండ్ మొదటి మహిళా గవర్నర్ గా నియమింపబడ్డారు. ఆమె 2021 వరకు ఈ పదవిలో వున్నారు. ఈమె ఒరిస్సా నుండి ఎంపిక కాబడిన మొదటి మహిళా ట్రైబల్ గవర్నర్. అంతే కాదు ఈమె దేశంలో నియమింపబడ్డ మొట్ట మొదటి ట్రైబల్ గవర్నర్ కూడా.
NDA ఈ సారి రాష్ట్రపతి ఎన్నికలకు ఈమె పేరు నామినేట్ చేశారు. 2017 రాష్ట్రపతి ఎన్నికలు అప్పుడు కూడా ఈమె పేరు పరిశీలన లోకి వచ్చినా అప్పుడు రామనాధ్ కోవింద్ పేరు చివరికి ఖరారు అయింది.
ఈ సారి కూడా NDA సుమారు 20 పేర్లు పరిశీలించి చివరకు మూర్మ్ గారి పేరు ఖరారు చేశారు.
ఈమె మత మార్పిడి ప్రలోభాలకు లోను కాలేదు. పక్కా ఆదివాసీగా నే శ్యామ్ చరణ్ ముర్ము అనే ఆయన్ను వివాహం చేసుకున్నారు. అయితే ఆయన తొందరలోనే కాలం చేశారు. ఈమెకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు వున్నారు. దురదృష్టవశాత్తు ఒక కొడుకు ప్రమాదంలో మరో కొడుకు అనారోగ్యంతో మరణించారు. ఇప్పుడు కూతురు ఇతి ముర్ము మాత్రమే వున్నారు. ఈమెకు చదువు పూర్తి అయ్యాక బాంక్ లో ఉద్యోగం వచ్చింది. భర్త గణేష్ కూతురు ఆరాధ్య తో కలసి ఈమె రాంచీలో నివసిస్తోంది.
ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిస్తే ఆమె దేశ మొట్టమొదటి ఆదివాసీ రాష్ట్రపతి అవుతారు.
మొట్టమొదటి దళిత మరియు మొట్టమొదటి ఆదివాసీ రాష్ట్రపతులను దేశానికి ఇచ్చిన ఘనత బిజెపి సాధించినట్లు అవుతుంది.
భారత్ కి స్వాతంత్రం వచ్చి 75 సం. ల అజాది కా అమృత్ మహోత్సవ్ జరుపు కుంటున్న ఈ సంవత్సరంలో దేశానికి ఒక ఆదివాసీ మహిళా రాష్ట్రపతి గా ఎన్నిక కాబోవడం నిజంగా ఒక అమృత ఘడియ.
కోపరటివ్ బాంక్ ఫ్రాడ్ కేసులో ఆరోపణలు ఉన్న ప్రతిభా పాటిల్ వంటి వారిని కాంగ్రెస్ ఈ ఉన్నత పదవిలో మొదటి మహిళా రాష్ట్రపతి గా కూర్చోబెడితే ఎటువంటి మచ్చలేని ముర్ము గారిని ఆ పదవికి ఎంపిక చేసిన ఘనత బిజెపి ది.
బిజెపికి అవకాశం వచ్చిన మూడు సార్లు ఏ మాత్రం వివాదాలు లేని వ్యక్తులను, మైనార్టీ, దళిత, ఆదివాసీ వారిని బిజెపి రాష్ట్రపతి అభ్యర్థులు గా ఎన్నిక చేసింది.
ఆమె పదవిలో ఉండగా దేశం ఉన్నత శిఖరాలను చేరాలి అని ఆశిస్తూ...
.

No comments:

Post a Comment

show image

  Sep 12 , 2025 " The Great Indian Warriors " Saragarhi Day September Twenty Sixth Trib...