Thursday, 19 May 2022

 తాజ్_మహల్ లేక తేజో మహాలయమా ?

ఇందిరాగాంధీ_బయటకు_రానివ్వకుండా చేసిన ఓక్_పుస్తకం_లో వున్న రహస్యాలుఏమిటి???
మీకోసం...మన కోసం



TheTaj mahal is tejo mahalaya పేరుతో ఒక్ అనబడే విదేశీ రచయత పరిశోధనాత్మక రచన నుండి తర్కానికి నిలబడే ఎన్నో శాస్త్రీయ విషయాల ను సేకరించి కేవలం చారిత్రక దృష్టి తో ఈ వ్యాసం రాయటం జరిగింది
ముఖ్యమైన విషయం ఏమిటంటే
రహస్యనీటి_ప్రవాహం తాజ్ మహల్‌లో ఎక్కడి నుండో ప్రవహించే చిన్న నీటి ప్రవాహం ఉంది.
అయితే ఈప్రవాహంయొక్కమూలం ఎక్కడో ఇంతవరకు ఎవరు కనిపెట్ట లేదు
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ముంతాజ్ సమాధి గా చెప్పబడుతున్న ప్రాంగణం అంతా వాస్తవానికి హిందూ దేవాలయం
ముంతాజ్ సమాధి గా మారక ముందు ఈ ఆలయ ప్రాంగణంలో కల శివలింగంపై నిత్యం అభిషేకానికి ఈ రహస్య నీటి ప్రవాహం నుండి వచ్చే నీటిని ఉపయోగించేవారు
తాజ్ మహల్ లో దాగివున్న అత్యంత ఆసక్తి నికలిగించే రహస్యాలలో ఇది ఒకటి. సమాధి కి సంబంధించి వల్లు గగుర్పొడిచే అనేక రహస్యాల ను మీరు చదవబోతున్నారు
షాజహాన్ రాణిముంతాజ్ మహల్ సమాధి_కాదది ఆగ్రా నగరంలోని రాజపుత్రులు పూజించే శివునిపురాతనహిందూ_దేవాలయం ఈ ఆలయాన్ని పూర్వం అప్పట్లో తేజో మహాలయ అని పిలుచేవారు
అని ఒక్ మహాశయుడు చేసినఎన్నో పరిశోధనలు తెలియచేస్తున్నాయి తన పరిశోధనలో, ఓక్, శివ మందిర్ ప్యాలెస్‌ను అప్పటి జైపూర్_మహారాజా
జైసింగ్ నుండి షాజహాన్ స్వాధీనం చేసుకున్నట్లు కనుగొన్నాడు.
షాజహాన్ స్వాధీనం చేసుకున్న ఆలయ నిర్మాణాన్ని తన భార్య ముంతాజ్ స్మారక చిహ్నంగా మార్చాడు.
హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించే తేజోమహలయం లో షాజహాన్, ముంతాజ్ యొక్క దేహాన్ని ఖననం చేయడం కోసం జై సింగ్ నుండి ఆగ్రాలోని అసాధారణమైన అందమైన గొప్ప సుందరమైన దేవా ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తన స్వీయచరిత్రలో అంగీకరించాడు.
జైపూర్ మహారాజా తేజో మహాలయ ని అప్పగించాలని షాజహాన్ చేసిన రెండు ఆదేశాలను సమర్థించాడని ఒక్ పరిశోధనలలో తేలింది
స్వాధీనం చేసుకున్న దేవాలయాలు మరియు భవనాలను చనిపోయిన సభికులు మరియు రాచరికం కోసం శ్మశాన స్థలాలుగా ఉపయోగించడం ముస్లిం పాలకుల ఈ దేశంలో ఒక సాధారణ ఆచారం గా పాటించే వారు
ఉదాహరణకు, హమాయున్, అక్బర్, ఇత్ముద్-ఉద్-దౌలా మరియు సఫ్దర్‌జంగ్‌లు ఇలాంటి భవనాలలో ఖననం చేయబడ్డారు అంతే కాదు వేములవాడ ఆలయ ప్రాంగణంలో ముస్లీం దర్గా నేటికీ వారు పాటించిన దురాచారాన్ని మనందరికీ గుర్తు చేస్తూనే ఉంటుంది
. ఓక్ రహస్య విచారణ తాజ్ మహల్ అనే పేరునుండి ప్రారంభమవుతుంది. షాజహాన్ కాలం లోనూ ఆ తరవాత కూడా తాజ మహల్ అనే ఈ పదం ఏ మొఘల్ కోర్టు పత్రాలలో లేదా రెవిన్యూ రికార్డ్స్ లో నమోదు చేయబడ లేదు మొఘల్ చరిత్రలో ఎక్కడా కూడా ఈ పదం కనిపించలేదని అతను చెప్పాడు. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ నుండి అల్జీరియా వరకు ఏ ముస్లిం దేశంలోనూ "మహల్' అనే పదాన్ని ఏ భవనానికి ఉపయోగించలేదు.
అయితే మహల్ అంటేఒక బహుళ అంతస్థుల భవనం అర్థం అయితే ఈ పదం "ప్రజల సమూహానికి నివాస గృహాలు" అని కూడా సూచించవచ్చు. ఇది పర్షియన్ పదం హల్ నుండి ఉద్భవించిన భారతీయ పదం, , అని కొందరి వాదన .. అయితేహల్ అనే పదానికి గమ్యం అనే అర్థం మాత్రమే వస్తుంది అంతేకానీ
నివాస స్థానం అనే అర్థం రాదు ఇంకా చెప్పాలంటే మనదేశానికి పారశీకులు అరబ్బులు రాకముందే మహల్ పేరుతో ఎన్నో కట్టడాలు ఈ దేశంలో ఉన్నాయి ఉదాహరణకు "జానకీ మహల్"తిరుమలై నాయక్కర్ మహల్ ఇలా చాలా పురాతనమైన భారతీయ కట్టడాలను మహల్ పేరుతో వ్యవహరించటం పరిపాటి కాబట్టి పెన కొందరు చేస్తున్న వాదన తర్కానికి నిలవదు
కాబట్టి ముంతాజ్ మహల్ నుండి 'తాజ్ మహల్' అనే పదం రూపొందింది అనే సాధారణ వివరణ పై పరిశీలనల ను పట్టి అశాస్త్రీయమైనది. అని తేల్చి చెప్పాడు రచయత.
తాజ్ మహల్ అనేది తేజోమహాలయ లేదా తేజేశ్వర మహాలయ అనే పదాల యొక్క వికృత రూపం కాల క్రమంలో తాజ మహల్ గా మారిందని వారు పేర్కొన్నారు.
ముంతాజ్ మరియు షాజహాన్ ల ప్రేమకథ కు ఎటువంటి సాహిత్య, చారిత్రక ఆధారాలు లేవు బ్రిటీష్ ఇండియాలో అమ్ముడు బోయిన చరిత్రకారులు మరియు దేశ పురాతన చరిత్ర పై శ్రద్ధాసక్తులు లేని పురావస్తు శాస్త్రవేత్తలు సృష్టించిన అద్భుత కల్పిత కథ అని కూడా ఓక్ చెప్పారు.
షాజహాన్ కాలం లోని సమకాలీన రాజు ల చరిత్ర ఒక్కటి కూడా ఈప్రేమకథను ధృవీకరించటంలేదు.
శైవ శాఖలు ఉప శాఖలు ఆగమ శాస్త్రం ప్రకారం త్రిశూలం ను పవిత్రంగా భావిస్తాయి ఈ త్రిశూల ఆకారంలో
దాని మధ్య నాలుకలా ఓకటి మిగిలిన రెండింటి కంటే ఎక్కువ విస్తరించి ఉంటుంది. ఇది సర్వ సాధారణంగా మనకు కనిపించే శైవాగమ గోపుర నిర్మాణం. ఈ నిర్మాణం ను దగ్గరగా చూస్తే, మధ్య నాలుక "కలశం" (నీటి కుండ) ఆకారంలో రెండు మడతలు పెట్టిన మామిడిఆకులు మరియు పైన కొబ్బరికాయతో కనిపిస్తుంది. ఇది పవిత్రమైన హిందూ చిహ్నం. మనం నేడు తాజ్ మహల్ గా పిలిచే కట్టడ గోపురం పై i చిహ్నాలు మనం నేటికీ చూడ వచ్చు
త్రిశూలం శిఖరం లోపల పూజించే అధి దేవత యొక్క చిహ్నం కావచ్చు? పైన జాబితా చేయబడిన చిహ్నాలు నేరుగా హిందూ ధర్మం కు చెందినవి మరియు వాటిలో కొన్ని నాగుపాములు కూడాఉన్నాయి. ఇస్లాం ధర్మం లో సర్ప ఆరాధన లేదు "మకరతోరణం" వంటి అలంకరణలు ఉండవు.
గోడలపై రాతితో మలిచిన పూలలో ఓం. చిహ్నం ను కూడా గుర్తించారు
తాజ్ మహల్ షాజహాన్ యుగానికి ముందే ఉందని సూచించడానికి ఓక్ అనేక పత్రాలను ఉదహరించారు:
న్యూయార్క్_ప్రొఫెసర్
మార్విన్_మిల్లర్ తాజ్ మహల్ యుమున నదీతీరపు వాకిట తలుపు నుండి పలు నమూనాలను తీసుకున్నారు. కార్బన్ డేటింగ్ పరీక్షలో షాజహాన్ కంటే తలుపు 300 సంవత్సరాల పురాతనమైనది అని తేలింది.
1638లో (ముంతాజ్ మరణించిన ఏడేళ్ల తర్వాత) ఆగ్రాను సందర్శించిన యూరోపియన్ యాత్రికుడు జోహాన్ ఆల్బర్ట్ మాండెల్‌స్లో తన జ్ఞాపకాలలో అగ్రా నగరంలో ప్రజాజీవితాన్ని వివరించాడు, కానీ తాజ్ మహల్ నిర్మాణం గురించి ప్రస్తావించలేదు.
ముంతాజ్ మరణించిన ఒక సంవత్సరం లోపు ఆగ్రాకు వచ్చిన ఆంగ్ల సందర్శకుడు పీటర్ ముండి యొక్క రచనలు, షాజహాన్ కాలానికి చాలా కాలం ముందు తేజో మహాలయం ఒక అద్భుతమైన నిర్మాణం అని చెపుతోంది.
తాజ్ మహల్ ముంతాజ్ సమాధి కాకుండా ఒక ప్రత్యేకమైన హిందూ దేవాలయం అనే నమ్మకానికి మద్దతు ఇచ్చే అనేక ఆకృతులను మరియు నిర్మాణ వైరుధ్యాలను కూడా ఓక్ తన పరిశీలన లో గుర్తించాడు ఇవన్నీ కూడా మనకు ఇస్లాం ధర్మంలో వారి నిర్మాణశైలి లో ప్రపంచంలో ఎక్కడా కనిపించవు.
షాజహాన్ కాలం నుండి తాజ్ మహల్ లో అనేక గదులు మూసివేయబడ్డాయి మరియు ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో లేవు. ఆ గదులలో శివుని తల లేని విగ్రహం మరియు హిందూ దేవాలయాలలో
పూజా ఆచారాలకు సాధారణంగా ఉపయోగించే ఇతర వస్తువులు ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ నిజాలు బయట పడితే రాజకీయంగా తనకు తగిలే ఎదురుదెబ్బలకు భయపడి, నాటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రభుత్వం ఓక్ పుస్తకాన్ని పుస్తక దుకాణాల నుండి ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించింది మరియు మొదటి ఎడిషన్ యొక్క భారతీయ ప్రచురణకర్తను తీవ్రంగా బెదిరించింది. అని అప్పటి లోరాజకీయ నాయకులు అధికార్లు చెవులు కొరుక్కుంటూ ఉండేవారు
ఓక్ పరిశోధనను నిజమని ధృవీకరించడానికి లేదా అబద్ధమని అప్రతిష్టపాలు చేయడానికి నేడు మన కున్న ఏకైక మార్గం తాజ్ మహల్ యొక్క మూసివున్న గదులను తెరవడం మరియు అంతర్జాతీయ పురాతత్వ నిపుణులను దర్యాప్తు చేయడానికి అనుమతించడం.
తాజ్ మహల్ యొక్క అత్యంత భయంకరమైన రహస్యం ఏమిటంటే, షాజహాన్ ఆగ్రాను పరిపాలించడానికి చాలా కాలం ముందు అంటే దాదాపు మూడు నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఈ ఆలయ కట్టడం నిర్మించబడింది. అంటే అప్పటికి మొఘల్ లు ఇంకా పాలకులు గా భారత్ లోకి అడుగు పెట్టక ముందే ఈ ఆలయ కట్టడం వునికి లో ఉంది
తాజ్ మహల్ యొక్క నిజమైన కథ ఒక్ రాసినపుస్తకం ప్రకారం, ఈ కట్టడం మొదట ఆగ్రాలోని రాజపుత్రులు నిర్మించిన శివుని ఆలయం. గా ఉండేది రాజపుత్రులతో జరిగిన యుద్ధంలో షాజహాన్ గెలిచినప్పుడు ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నాడు.ఇది నాటి తేజో మహాలయం లేదా నేటితాజ్ మహల్ వెనక దాగివున్న ఉన్న రహస్యం,
అయితే మన దురుదృష్ఠం ఏమిటంటే ఇప్పటి వరకు ఈ నిజాలను ఇంకా ఏ ప్రభుత్వ సంస్థ కూడా అంగీకరించ లేదు
ఓక్ పరిశోధనలకు ప్రామాణికతను కల్పించే శాస్త్రీయ ప్రయత్నాలు భారత ప్రభుత్వం చెయ్యలేదు
రహస్య గదులు; తాజ్ మహల్, కూడా ఆనాటి సమకాలీన చారిత్రక కట్టడాల వలె అనేక రహస్య మార్గాలు మరియు గదులను కలిగి ఉంది.
ఇక్కడ మనకు తలెత్తే మరో ప్రశ్న ఏమిటంటే నిజంగా ముంతాజ్ సమాధి అయితే సమాధి నిర్మాణంలో అనేక గదులు రహస్య మార్గాలు ఎందుకుఉన్నాయి, ఇవి అన్నీ షాజహాన్ కాలం నుండి ఎందుకు మూసివేయబడి ఉన్నాయి.
పరిశోధకుల పరిశీలన ప్రకారం,ఇది శివుని ఆలయమని ఈ గదులలో ఆధారాలు ఉన్నాయి. ఒక గదిలో తలలేని శివుని విగ్రహం ఉందని కూడా కొ అంటారు. అది నిజం అయితే ఇదే అసలు సిసలు తాజ్ మహల్ రహస్యం.
భారత ప్రభుత్వానికి తెలుసు; అందుకే తాజ్ మహల్ ఉనికిపై తదుపరి పరిశోధనలను నాటిభారత ప్రభుత్వం నిషేధించింది
తాజ్‌మహల్‌కు సంబంధించిన పుస్తకాన్ని కూడా ప్రభుత్వం నిషేధించింది. మతపరమైన ఉద్రిక్తతలకు భయపడి సీలు వేసిన గదులను తెరవడానికి ప్రభుత్వం ఎవరినీ అనుమతించలేదు.ముందు ముందు కూడా పరిస్థితి ఇలానే ఉంటే
మరిన్ని ప్రశ్నలు లేవనెత్తే అవకాశం కూడా ఉంది... ఆ ప్రశ్నలన్నిటికీ కాల స్వరూపుడైన మహా కాలుడే సర్ అయిన సమాధానం ఇవ్వగలడు
మరో విషయం ఏమిటంటే తాజ్ మహల్ కు సమీపంలోనే హిందువులు తేజో మహాలయం పేరుతో మరో ఆలయాన్ని నిర్మించుకున్నారు

No comments:

Post a Comment

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...