Places of Worship Act 1991 - P. V. నరసింహారావు గారు – సమీక్ష.
బహుముఖ ప్రజ్ఞాశాలి, అపర చాణుక్యుడు అయిన మాజీ ప్రధాని శ్రీ పాములపర్తి నరసింహ రావు గారి మీద రెండు రోజుల క్రితం కొందరు మూర్ఖులు, అశుద్ధం తినే వెధవలు చాలా నీచంగా సంబోధిస్తూ పోస్టలు పెట్టారు. ఈ పోస్ట్ వారి కోసం.
1991 జూన్ నెలలో ప్రధానిగా శ్రీ PV నరసింహారావు గారు బాధ్యతలు చేపట్టే నాటికి దేశ ఆర్ధిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది.
PV నరసింహారావు గారి కంటే ముందు ప్రధానిగా ఉన్న చంద్రశేఖర్ గారి హయాంలో[జనవరి,1991] మన దేశ ఆర్ధిక పరిస్థితి ఎలా ఉంది అంటే అత్యవసర దిగుమతుల కోసం చెల్లించాల్సిన డాలర్లు మన దగ్గర కేవలం మూడు వారాలకి సరిపడా మాత్రమే ఉంది. క్రూడ్ ఆయిల్ దిగుమతుల కోసం రిజర్వ్ చేసిన డాలర్లు అయితే కేవలం వారం రోజులకి సరిపడ మాత్రమే ఉన్నాయి. అప్పటికే మన దేశంలో ఉన్న ఆయిల్ నిల్వలు మరో రెండు వారాలకి మాత్రమే సరిపడా ఉండగా క్రూడ్ దిగుమతి అవడానికి మరో వారం రోజులు గడువు మాత్రమే ఉంది కానీ మన దగ్గర డాలర్లు లేవు చెల్లించడానికి. ఇతర అత్యవసర వస్తువుల దిగుమతుల కోసం రెండు వారాలకి సరిపడా డాలర్లు ఉన్నాయి. ఆ స్థితిలో రాత్రికి రాత్రి రిజర్వ్ బాంక్ దగ్గర ఉన్న47 టన్నుల బంగారం ప్రత్యేక ఛార్టర్ విమానంలో లండన్ తరలించి బాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో కుదువపెట్టి $2.2 బిలియన్ డాలర్లు అప్పు తీసుకోవాల్సి వచ్చింది. మరో 20 టన్నుల బంగారాన్ని స్విట్జర్లాండ్ లోని యూనియన్ బాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ లో కుదువ పెట్టి మరో $600 మిలియన్ డాలర్లని అప్పుగా తీసుకోవాల్సి వచ్చింది. ఈ వార్త అప్పట్లో తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఇదంతా రహస్యంగా చేయాలని చూసినా బంగారాన్ని ఎయిర్ పోర్ట్ కి తరలించడానికి వాడిన వ్యాన్ టైర్ బరస్ట్ అయిపోయి నడి రోడ్డు మీద ఆగిపోవడం దాంతో అప్పటికప్పుడు ప్రత్యేకంగా పోలీసులని భద్రత కోసం నియోగించడం తో సదరు వ్యానులో బంగారం ఉందని దానిని తాకట్టు పెట్టడానికి ఎయిర్ పోర్ట్ కి తీసుకెళ్తున్నారు అని పత్రికల ద్వారా దేశ ప్రజలకి తెలిసింది. బంగారం తాకట్టు పెట్టి డాలర్లు అప్పు తీసుకోవడం మినహా వేరే మార్గం లేదు అప్పట్లో. చంద్రశేఖర్ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ని ప్రవేశపెట్టలేకపోయింది ఎందుకంటే విపరీతమయిన ద్రవ్య లోటు మరో వైపు దేశీయంగా,అంతర్జాతీయ సంస్థల దగ్గర తీసుకున్న అప్పు,వాటి వడ్డీలు పెరిగిపోవడం వల్ల అప్పటి ఆర్ధిక మంత్రి చేతులెత్తేశాడు. మరో వైపు అసలు బడ్జెట్ ప్రవేశపెట్టక పోవడం వల్ల IMF బెయిల్ అవుట్ పాకేజీ ని ఇవ్వడానికి ఒప్పుకోలేదు. మరో వైపు ఇంటా బయటా చెల్లించాల్సిన బాకీలు కొండల్లా పెరిగిపోతూనే ఉన్నాయి. నిజానికి అప్పటికప్పుడు వచ్చిన సమస్య కాదు ఇది. 80 వ దశకం లో మొదలయ్యి మెల్ల మెల్లగా అది 90 ల నాటికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఒక దశాబ్దపు ఆర్ధిక మిస్ మేనేజ్మెంట్ ఫలితం అది.
1991 జూన్ నెలలో ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న PV నరసింహా రావు గారి ముందు ఉన్న పెద్ద సమస్య తాకట్టు లో ఉన్న బంగారాన్ని అప్పు తీర్చేసి మళ్ళీ వెనక్కి తీసుకురావడం. ముందు ముందు మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా చూడడం. ఇదేమీ రాత్రికి రాత్రి జరిగే పని కాదు. చాలా ఓపికగా ఒక్కో ముడి విప్పుకుంటూ వెళ్ళాలి. మరో పక్క తన మైనారిటీ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి ఇదంతా జరగాలి అంటే. అప్పటికే ప్రణాళికా సంఘం సభ్యుడుగా ఉన్న మన్మోహన్ సింగ్ గురుంచి విని ఉన్నారు PV గారు. అప్పటికి ఇంకా ఆర్ధిక శాఖ కి మంత్రిగా ఎవరినీ నియమించలేదు PV గారు. ఒక రోజు పార్లమెంట్ భవనం లోని తన ఆఫీసు నుండి బయటికి వచ్చి కారిడార్ లో నడుస్తూ హఠాత్తుగా తన సహాయకుడిని పిలిచి మన్మోహన్ సింగ్ గారిని కలవాలి పిలుచుకు రండి అని చెప్పారు. అప్పటికే ప్రణాళికా సంఘ సమావేశానికి వచ్చిన మన్మోహన్ సింగ్ గారు అదే భవనంలో ఉన్నారు. విషయం మన్మోహన్ గారి కి చెప్పాడు PV గారి సహాయకుడు దాంతో మన్మోహన్ గారు PV గారి దగ్గరకి వచ్చారు ఆశ్చర్యపోతూ. కూర్చోవడానికి ఏమీ లేక పార్లమెంటు కారిడార్ లో ఉన్న చిన్న అరుగు మీద కూర్చొని PV గారు మన్మోహన్ గారితో అన్న మొదటి మాట ; మన్మోహన్ జీ మిమ్మల్ని ఆర్ధిక మంత్రిగా నియమించాలని అనుకుంటున్నాను మీరు సిద్ధంగా ఉన్నారా అని. దానికి మన్మోహన్ సింగ్ బదులు ఇస్తూ నేను కేవలం ఆర్ధిక పరమయిన సలహాలు మాత్రమే ఇవ్వగలను కానీ రాజకీయ నాయకుడిని కాను నాకు రాజకీయాలలో ఉండే విమర్శలని తట్టుకునే శక్తి లేదు అని బదులు ఇచ్చారు మన్మోహన్ సింగ్. దానికి బదులుగా PV గారు మీ మీద వచ్చే విమర్శలని, వేసే రాళ్ళని నేను భరిస్తాను మీకు ఆ భయం అక్కరలేదు. మంచి జరిగినా చెడు జరిగినా బాధ్యత నేనే తీసుకుంటాను తప్పితే మీకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వను అని భరోసా ఇచ్చారు PV గారు. దాదాపుగా 10 నిముషాల పాటు జరిగిన ఆ సమావేశం తరువాత మన్మోహన్ సింగ్ ని ఆర్ధిక మంత్రిగా నియమించారు PV గారు. బంగారం తాకట్టు పెట్టి తెచ్చిన అప్పు 2.8 బిలియన్ డాలర్లలో జూన్ నెల వచ్చేసరికి సగం ఖర్చు అయిపోయాయి.
PV నరసింహ రావు గారు భారత దేశాన్ని అప్పుల నుండి విముక్తి చేసి ఆర్ధిక వ్యవస్థని పటిష్టంగా చేయాలి అంటూ మనమోహన్ సింగ్ గారికి పూర్తి స్వేచ్చని ఇచ్చారు. ఆ స్వేచ్చ ఆర్ధిక సంస్కరణలకి దారి చూపింది.
1. జులై 1 వ తేదీ,1991 మొదటి చర్యగా రిజర్వ్ బాంక్ డాలర్ తో రూపాయి విలువ ని 9%తగ్గించింది. జులై 3న రిజర్వ్ బాంక్ మరో 3% తగ్గించింది అంటే మొత్తం మూడు రోజుల వ్యవధిలో 11% తగ్గించింది అన్నమాట. జస్ట్ ప్రతిస్పందన ఎలా ఉంటుందో రెండు దఫాలుగా రిజర్వ్ బాంక్ రూపాయి విలువని తగ్గించింది.
2. మార్కెట్ నుండి మంచి స్పందన వచ్చింది. రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే తగ్గడం వలన ఎగుమతి చేసే వాళ్ళకి ఆదాయం పెరిగింది దాంతో ఎగుమతుల విలువ పెరగడం ప్రారంభం అయ్యింది. ఇది మంచి సూచన కానీ అదే సమయంలో దిగుమతులు మాత్రం తగ్గలేదు కానీ పెరగడం ఆగిపోయి స్థిరంగా ఉండిపోయింది సూచీ.
3. లైసెన్స్ రాజ్ వ్యవస్థ: లైసెన్స్ రాజ్ వ్యవస్థని రద్దు చేశారు నరసింహ రావు గారు. అప్పటి వరకు ఎవరన్నా పరిశ్రమ పెట్టాలంటే ఒక డజను ప్రభుత్వ సంస్థల నుండి అనుమతి కావాలి ఇందుకోసం కాంగ్రెస్ కి చెందిన శాసన సభ్యుడు కానీ పార్లమెంట్ సభ్యుడిని కానీ సంప్రదించి లంచాలు ఇస్తే అనుమతులు తొందరగా వస్తాయి లేకపోతే లేదు. అదే ప్రత్యర్ధులు అయితే పరిశ్రమ పెట్టె అవకాశమే ఉండేది కాదు. లైసెన్స్ రాజ్ వ్యవస్థ ని రద్దు చేయడం కాంగ్రెస్ లోని నకిలీ గాంధీ మద్దతుదారుల తో పాటు సోనియా కి నచ్చలేదు. ఇది వాళ్ళ గుత్తాధిపత్యానికి అడ్డు కట్ట పడ్డట్లుగా భావించారు. దాంతో PV నరసింహరావు గారి మీద కాంగ్రెస్ పార్టీలోనే కుట్రలు చేయడం ప్రారంభించారు. అప్పట్లో PV ప్రభుత్వం మైనారిటీ లో ఉండేది. ప్రతిపక్షాలు బయటి నుండి మద్దతు ఇచ్చాయి.
4. క్రమంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగడం ప్రారంభించాయి. కానీ అదే సమయంలో బిజేపి మందిర్ మసీద్ ఉద్యమం మంచి ఊపు మీద ఉన్నది. ఒక వైపు స్వంత పార్టీ వాళ్ళే తనని గద్దె దించే ప్రయత్నంలో ఉండగా దానికి తోడుగా బిజేపి సమస్యగా మారింది.
5. ముందు దేశ ఆర్ధిక వ్యవస్థ బాగుపడాలంటే బిజేపి ని అడ్డుకోవాలి అనే ఉద్దేశ్యంతో Places of Worship (Special Provisions) Act, 1991 ని ప్రవేశ పెట్టారు PV నరసింహ రావు గారు. ఈ చట్టం ప్రకారం స్వాతంత్ర్యం రాక ముందు అన్ని మతాల ప్రార్ధనా స్థలాలు ఏ స్థితిలో ఉన్నాయో అవి అలానే కొనసాగుతాయి కానీ కోర్టులో కేసు వేయడానికి వీలు లేదు కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న ప్రార్ధనా స్థలాలకి ఈ చట్టం వర్తించదు. అలాగే ఈ చట్టం అమలులోకి రాక ముందు కోర్టులో వేసిన కేసులకి ఈ చట్టం వర్తించదు.
6. దేశ ఆర్ధిక వ్యవస్థని బాగు చేసే సమయంలో ఎలాంటి అవాంతరాలు ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో PV గారు ఈ పని చేశారు. దేశంలో మత పరమయిన ఉద్రిక్తలు ఉన్నప్పుడు ఏ దేశం కూడా మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాదు. శ్రీ లంక కి ఇప్పుడు వచ్చిన సమస్య మనకి 32 ఏళ్ల క్రితమే వచ్చింది. కాకపోతే శ్రీలంక కి PV గారి లాంటి నాయకుడు లేరు మనకి ఉన్నారు మనం ఇప్పుడు హాయిగా ఉన్నాం !
7. PV నరసింహా రావు గారు ప్రవేశ పెట్టిన ఆర్ధిక సంస్కరణల వల్ల 1991-92 ఆర్ధిక సంవత్సరంలో మన దేశ GDP $266 బిలియన్ డాలర్లకి చేరుకున్నాయి. మనం బంగారం తాకట్టు పెట్టి తెచ్చుకున్న అప్పు 2.8 బిలియన్ డాలర్లు. 2019 కి మన దేశ GDP 3 ట్రిలియన్ డాలర్లకి చేరుకుంది ఇది 1100 శాతం పెరుగుదల. ఇక PPP[purchasing power parity] విషయానికి వస్తే 1991 లో అది 1 ట్రిలియన్ డాలర్లు గా ఉండగా 2019 నాటికి అది 12 ట్రిలియన్ డాలర్లు గా నమోదు అయ్యింది అంటే 1100% పెరుగుదల అన్నమాట.
8. ప్రస్తుతం మన దేశ విదేశీ మారక నిల్వలు $634.287 బిలియన్లు గా ఉంది [జనవరి,2022].
9. ఈనాడు మన దేశంలో మనం అనుభవిస్తున్న సౌకర్యాలు PV గారు పెట్టిన భిక్ష !
10. భారత దేశ ఆర్ధిక వ్యవస్థ గురుంచి మాట్లాడాలంటే అది PV గారి కి ముందు PV గారి తరువాత అనే చెప్పుకోవాలి.
ప్రార్ధనా స్థలాల చట్టం 1991 మీద అశుద్ధం వేళ్ళ గక్కీన వాళ్ళకి మన రాజ్యాంగం ఇప్పటికే 43 సార్లు సవరించి మార్పు చేసిన సంగతి తెలియదా ? అంతెందుకు ఆర్టికల్ 370 రద్దు చేశారు కదా ? అలాంటిది ఉభయ సభలలో పూర్తి మెజారిటీ ఉన్న బిజేపి ప్రభుత్వానికి ప్రార్ధనా స్థలాల చట్టం 1991 ని రద్దు చేయడానికి ఎంతసేపు పడుతుంది ? PV గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికి మన దేశ పరిస్థితికి ఆ చట్టం అత్యవసరం ! ఆ చట్టం 144 సెక్షన్ లాంటిది అవసరాన్ని బట్టి అమలు చేస్తారు అంతే కానీ 366 రోజులూ 144 సెక్షన్ పెట్టరు కదా ?
14 భాషలలొ ప్రావీణ్యం కలిగిన వ్యక్తినా మీరు మీ నోటికి వచ్చినట్లు వాగారు ! సన్యాసం స్వీకరించి తమిళనాడులో కల కుర్తాళం పీఠాధిపతి గా ఉండాలని నిర్ణయం తీసుకొని ఢిల్లీ లోని తన ఇంట్లోని సామాన్లని హైదరాబాద్ కి తరలించే సమయంలో తనంత తానే ప్రధాని పదవి వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వచ్చింది. తాను నిత్యం ఆరాధించే వెంకన్న స్వామి ఆజ్ఞ కాబోలు అనుకుంటూ ప్రధాని పదవిని స్వీకరించారు. తనకి స్వామి అప్పగించిన బాధ్యతని త్రికరణ శుద్ధిగా నిర్వర్తించారు. చివరకి స్వపక్షం లోని వాళ్ళే ఆయన మీద కేసులు పెడితే కోర్టు ఖర్చుల కోసం తన ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది కదా ?
రాజకీయాలు పక్కన పెడితే .. ఏదీ .. ఆ కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ‘’వేయి పడగలు ‘’ లోని ఒక్క పేజీ చదివి దాని మీద విశ్లేషణ చేయగలరా సదరు శుంఠలు ? మీకు మీ మాతృ భాష తెలుగే సరిగా వచ్చి చావదు అలాంటిది వేయి పడగలని హిందీలోకి అనువాదం చేసి దానికి ‘సహస్ర ఫణ్ ‘ అని పేరు పెట్టారు అపర చాణక్యుడు.. అలాంటి మహానుభావుడినా మీరు తిట్టింది ?
PV గారు ప్రధానిగా ఉన్న సమయంలో ఫ్రాన్స్ దేశ పర్యటనికి వెళ్ళినప్పుడు ఫ్రాన్స్ దేశపు జాతీయ టెలివిజన్ అయిన ఫ్రాన్స్ టెలివిజన్ వారు PV గారి ఇంటర్వ్యూ కోసం సమయం ఇవ్వమని కోరగా వెంటనే అంగీకరించారు. పారిస్ లో PV గారు బస చేసిన హోటల్ లోనే కెమెరాలు ఏర్పాటు చేసి ఫ్రెంచ్ భాష నుండి ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసే దుబాసీ ని ఏర్పాటు చేశారు సదరు చానెల్ అధికారులు. PV గారు వచ్చి తన కుర్చీలో కూర్చుంటూ ఇక ఇంటర్వ్యూ మొదలు పెడదామా అంటూ ఫ్రెంచ్ భాషలో ఆ ఇంటర్వ్యూ చేసే అతనితో అనగానే అక్కడ ఉన్నవారందరూ తెల్లబోయారు. చూస్తే సాదా సీదాగా ఉన్న ఆయన ఇంగ్లీష్ సరిగా వచ్చో లేదో అనే అనుమానంతో ఉన్న ఫ్రెంచ్ టెలివిజన్ అధికారులకి నేరుగా ఫ్రెంచ్ లోనే తమతో మాట్లాడే సరికి కొద్ది సెకన్ల పాటు నిశ్శబ్దంగా ఉండిపోయి తరువాత చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. తరువాత ఫ్రాన్స్ ప్రజలకి ఫ్రెంచ్ భాషలోనే అభినందనలు తెలుపుతూ తరువాతి ఇంటర్వ్యూని ఎవరి సహాయం లేకుండా అడిగిన ప్రశ్నలకి ఫ్రెంచ్ లోనే సమాధానాలు ఇచ్చిన గొప్ప వ్యక్తినా మీరు విమర్శించేది ?
నా అనుభవం :
పూర్తి పేరు తెలియదు కానీ జోషీ గారు అనే పిలిచేవాడిని 1991 లో. జోషీ గారు పదవీ విరమణ చేసిన ఇండియన్ ఫారిన్ సర్వీస్[IFS] అధికారి. భార్య చనిపోయింది,పిల్లలు విదేశాలలో స్థిరపడ్డారు. ఒక శుభ కార్యంలో పరిచయం ఏర్పడ్డది[1990 లో]. మొదటి పరిచయంలో సాహిత్యం,సంగీతం తో పాటు వర్తమాన రాజకీయ అంశాల మీద చర్చ జరిగినది మా మధ్య. ఆయన ఇండియన్ ఫారిన్ సర్వీస్ మాజీ అధికారి అని తెలియగానే సోవియట్ యూనియన్ లో అధ్యక్షుడు గోర్బచేవ్ ప్రవేశ పెట్టిన సంస్కరణలు ‘గ్లాస్ నోస్త్ ‘ ‘పెరిస్ట్రోయికా ‘ ల మీద పలు ప్రశ్నలు అడిగాను నేను దాంతో ఆశ్చర్యపోయిన ఆయన ఏదో సినిమాలు, స్పోర్ట్స్ మీద ఆసక్తి ఉండాల్సిన వయసులో నీకు ఇలాంటి విషయాల మీద అవగాహన ఉండడం నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది అంటూనే ఆయన నా ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చారు. ఇక అప్పటి నుండి నేను ఆయన ఉండే ఖైరతాబాద్ వెళ్ళినప్పుడల్లా కలిసేవాడిని.
జోషీ గారు మహారాష్ట్ర బ్రాహ్మణుడు, కాంగ్రెస్ అభిమాని సహజంగానే! నేను సహజంగానే RSS అభిమానిని కానీ ఇవేవీ మా చర్చలకి అడ్డు రాలేదు. బాబ్రీ మసీదు కూల్చివేసిన తరువాత నేను ఖైరతాబాద్ వెళ్ళి జోషీ గారిని కలిసి బాబ్రీ విషయంలో PV గారు విఫలం అయ్యారు కదా అని అడిగాను. దానికి జోషీ గారు బదులిస్తూ ఎలా అని అన్నారు నేను ఆయనకి బాబ్రీ మసీదు కూల్చివేత మీద ఇండియా టుడే వ్రాసిన ఆర్టికల్ ని ఆయన ముందు ఉంచాను. నవ్వుతూ అది నేను ఇంతకుముందే చదివాను పార్ధసారధి ఇప్పుడు ప్రత్యేకంగా చదవక్కరలేదు. మరి దీని మీద మీ విశ్లేషణ ఏమిటీ అని అడిగాను దానికి ఆయన నా అభిప్రాయం కంటే మీ RSSకి చెందిన కురువృద్ధుడు ఇక్కడే ఉన్నారు ఆయన నాతో అన్న మాటలే నీకు చెప్తాను విను.
RSS లో మహారాష్ట్ర,కర్ణాటక,ఉత్తర ప్రదేశ్,మధ్యప్రదేశ్,గుజరాత్ ఇలా దేశంలోని పలు ప్రాంతాల వివిధ శాఖలకి చెందిన బ్రాహ్మణులు ఉన్నారు కానీ తెలుగు నియోగి బ్రాహ్మణుడు అయిన నరసింహ రావు గారు ఒక్కరే RSS లోని మిగతా బ్రాహ్మణ వర్గాలకి చెక్ పెట్టాడు.
ఎలా ?
బిజేపి నిత్యం అయోధ్య రామ మందిరం పేరుతో ఏదో ఒక ఉద్యమం చేస్తూ వచ్చింది కానీ అది ముఖ్యమయిన విషయమే కానీ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన సమయం దేశానికి మేలు చేసేది కాదు. దేశం ఆర్ధికంగా రాజకీయంగా బలహీనమయిన స్థితిలో ఉంది. చాణక్యుడి నీతి: దేశం సుభిక్షంగా ఉండి ప్రజలు బలంగా ఉన్నప్పుడే ఆ ప్రజలు తమ దేశాన్ని,సంస్కృతిని కాపాడగలరు, శత్రువుతో బలంగా పోరాడగలరు. ఆ దేశ రాజు తీసుకునే నిర్ణయాలు కఠినంగా,పక్షపాతం లేకుండా ధర్మ బద్ధంగా ఉన్నప్పుడే అన్నీ బాగుంటాయి.
PV గారి ఆలోచన కూడా చాణుక్యుడి ఆలోచన లాగే ఉంది అప్పుడు. ఒక సమస్యని అది తీవ్ర రూపం దాల్చేదాకా ఆగకూడదు లేదా సమస్య తీవ్రతని తగ్గించి వేయాలి. ఎలాగూ లక్షల మంది కరసేవకులు దేశం నలుమూలల నుండి అయోధ్యకి చేరుకున్నారు. వాళ్ళని అదుపులో పెట్టాలంటే కాల్పులు జరపాలి కానీ పోలీసు కాల్పులకి భయపడి వెనకడుగు వేసే స్థితిలో లేరు కరసేవకులు. కర సేవకుల మరణం తధ్యం దానికి సిద్ధపడే వారు వచ్చారు ఇక చేయడానికి ఏముంటుంది ? కూల్చివేత జరిగిపోయింది. అంతే ! ఇక అప్పటికప్పుడు బిజేపి కి ఇష్యూ ఏమీ లేకుండా పోయింది 25 ఏళ్ల పాటు ! ఇదీ ఆ 78 ఏళ్ల RSS కురువృద్ధుడు చేసిన విశ్లేషణ !ఆర్ఎస్ఎస్ చెప్పేది దేశం కోసం,ద్ధర్మం కోసం,సంస్కృతి కోసం పాటుపడమని చెప్తుంది PV గారు చేసి చూపించారు. కాకపోతే ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు అదొక్కటే తేడా !
మసీదు కూల్చివేత జరిగిన తరువాత గానీ RSS వ్యూహ కర్తలకి అసలు విషయం బోధ పడింది. ఇక తమ చేతిలో ఎలాంటి ఇష్యూ లేకుండా పోయింది అని. 1991 నుండి 2018 వరకు అంటే అయోధ్య మీద కోర్టు తీర్పు వచ్చేంత వరకు బిజేపి కి ముఖ్యమయిన ఇష్యూ లేకుండా పోయింది. ఈ మధ్య కాలంలో దేశం ఆర్ధికంగా నిలదొక్కుకో గలిగింది.
ఒక వైపు ఆర్ధిక సంస్కరణలని వేగంగా అమలుచేస్తూనే మరో వైపు రెండవ అణు పరీక్ష చేయడానికి కావాల్సిన పనులని పూర్తి చేసి మళ్ళీ ఎన్నికల సమయానికి సిద్ధపడ్డాడు. తాను మళ్ళీ గెలిస్తే పోఖ్రాన్ లో అణు పరీక్ష నిర్వహించేవాడు ఎందుకంటే అణు పరీక్ష చేస్తే అమెరికా ఎలాగూ ఆంక్షలు విధిస్తుంది కానీ మన రిజర్వ్ బాంక్ లో రెండు సంవత్సరాలకి సరిపడా విదేశీ మారక నిధులు అప్పటికే ఉన్నాయి కాబట్టి నిర్భయంగా ఉండవచ్చు కానీ రెండో సారి PV గారు గెలవలేదు కానీ తన హయాంలో అంతా సిద్ధం చేసి అణు పరీక్ష కోసం ఇవ్వాల్సిన కోడ్ [పాస్వర్డ్] ని ఒక కాగితం మీద వ్రాసి నూతన ప్రధాని వాజపెయీ గారి చేతిలో పెట్టారు. క్రెడిట్ వాజపెయీ గారికి దక్కింది.
PV నరసింహా రావు గారు పదవీ విరమణ చేసిన తరువాత RSS కానీ బిజేపి లోని పెద్దలు కానీ పల్లెత్తు మాట అనలేదు. PV చాణక్యం, దేశభక్తి మీద అపారమయిన గౌరవం ఉంది ఆర్ఎస్ఎస్ కి మరియు బిజేపి కి. రాజకీయం అంటే ఎత్తుకు పై ఎత్తు వేయడమే కదా ? దేశానికి నష్టం కలగకుండా PV గారు చేసిన పని ప్రార్ధనా స్థలాల చట్టం 91.
తాజాగా సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పింది ఏమిటంటే ప్రార్ధన స్థలం ఏ మతానికి చెందిందో నిర్ధారించే హక్కుని కాదనట్లేదు PV గారు చేసిన చట్టం. ప్రస్తుత కాశీ జ్ఞానవాపి మసీదు ఉన్న ప్రాంతం ఎవరిదో తేల్చి చెప్పవచ్చు కోర్టు దానికి ఏ చట్టం కూడా అడ్డుపడట్లేదు.
కుర్తాళం పీఠాన్ని అధిష్టించదానికి అన్ని అర్హతలు ఉన్న మహానుభావుడు PV నరసింహా రావు గారు. అలాంటి మహానుభావుడిని మీ ఇష్టం వచ్చినట్లు ఫేస్బుక్ లో పోస్టలు పెట్టడానికి మీకు ఉన్న అర్హత ఏమిటి ? ఏడు జన్మల పాటు కుడి చేత్తో కడుగుకుంటూ ఎడమ చేత్తో తిన్నా మీ పాపం పరిహారం కాదు శుంఠల్లారా!