Friday, 8 April 2022

 కరోనావైరస్

 కరోనావైరస్ పుట్టిన దేశం అది . ఆ వైరస్ ఒక ప్రయోగశాలలో పుట్టింది . ప్రమాద వశాత్తూ లీక్ అయ్యిందో లేక వదిలారో చెప్పలేము కానీ తొలి మూడు నెలలు ( December 2019 - February 2020 ) చైనా , ప్రపంచ అనారోగ్య సంస్థ తో కలిసి ఆడిన నాటకాలు అన్నీ ఇన్నీ కావు .

వాక్సిన్ వల్ల సైడ్ రియాక్షన్స్ వుంటాయని రుజువు కాలేదని ఇప్పుడు ఏ విధంగా ఫార్మసురుల ఏజెంట్లు దబాయిస్తున్నారో అదే విధంగా ఆ రోజుల్లో ప్రపంచ అనారోగ్య సంస్థ ఇలా దబాయించింది . 1 . ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుంది అని చెప్పడానికి రుజువులు లేవు . 2 . వైరస్ విసరిస్తుందనే సాకుతో అంతర్జాతీయ విమానాలను నిషేధించడం సరి కాదు .
ఇలా దబాయించి , నమ్మబలికి, వైరస్, ప్రపంచం అంతా వ్యాపించేలా చేసింది చైనా .
.
రెండేళ్లు మానవాళి విలవిలలాడిపోయింది . ఆర్థిక వ్యవస్థలు నాశనం . శ్రీలంక లాంటి దేశం అయితే ఇప్పుడు అంధకారం లో .. తిండి లేదు .. కరెంటు లేదు . రాయడానికి పేపర్ లేక పరీక్షలు రద్దు . మన దేశం లో పెట్రోల్, కరెంటు, నిత్యావసర వస్తువులు మండిపోతున్నాయి . { యుక్రెయిన్ యుద్ధం లాంటి ఇతర కారణాలు వున్న మాట వాస్తవం }
చెరపకురా చెడేవు అనేది పెద్దల మాట .
ఇన్నాళ్లు చైనా , వైరస్ ను అదుపులో ఉంచగలిగింది. ఇప్పుడు ఓమిక్రాన్ ఉపజాతి వైరస్ . అది చండప్రచండ వేగం తో విస్తరించే వైరస్ . ఆ వైరస్ ను కట్టడి చేయాలని చైనా నేలవిడిచి సాము చేస్తోంది .
అప్పటికీ జనాభాలో 88 శాతానికి వాక్సిన్ వేయించింది . వాక్సిన్ వల్ల లాభం లేదు అని అర్థం అయినట్టు ఉంది. కేసులు తగ్గించాలని ఇప్పుడు చైనా లాక్ డౌన్ .. ఇంకా ఇతర కట్టడి పద్ధతుల్ని అమలు చేస్తోంది .
ఒక పక్క ప్రపంచం లో అన్ని దేశాలు { దక్షిణ కొరియా లాంటి ఒకటి రెండు మినహా } కరోనా కట్టడి ని వదిలేశాయి. లాక్ డౌన్ లు లేవు . మాస్క్ లు కూడా మీ ఇష్టం అంటున్నారు . అంతర్జాతీయ విమానాలు మొదలయ్యాయి . ప్రపంచం కరోనా అనంతర యుగం లోకి వచ్చేసింది . ఇప్పుడు చైనా లో మనం 2020 మార్చ్ చివరి వారం నుంచి చూసిన పరిస్థితి .. కాదు .. కాదు .. ఇంకా దారుణం .. చదవండి
1 . మనకు ముంబై .. అలాగే వారికి షాంఘై .. రెండవ అతిపెద్ద నగరం , పారిశ్రామిక నగరం... నెల రోజులుగా లాక్ డౌన్ లో ఉంది . ప్రజలు విసిగి పోయారు . రోడ్డ్ల పైకి వచ్చి ప్రదర్శన చేస్తున్నారు . మార్చ్ రెండవ తేదీ నుంచి ప్రజలు ఇంటికే పరిమితం . ఇప్పటికి పది సార్లు కరోనా మాస్ టెస్టింగ్ చేసారు . అంటే మొత్తం కోటిన్నర జనాభా కు టెస్ట్ లు .. అదీ ఒక సారి కాదు . రెండు సార్లు కాదు . పది సార్లు . మరో మూడు నెలల్లో సెంచరీ కొట్టొచ్చు .
2 . హాంకాంగ్ లో పరిస్థితి మరీ ఘోరం . మమల్ని వదిలేసెయ్యండి .. మా దేశానికి పారిపోతాం . ఇక్కడ కట్టడి భరించలేము అని లక్షలమంది విదేశీయులు అక్కడ వెయిట్ చేస్తున్నారు . ఆఫీస్ కు వచ్చిన వారు ఇంటికి పోలేక ఆఫీస్ లోనే నిద్ర .
3 . చైనా లో మాస్ టెస్టింగ్ చేసినపుడు ఎవరికైనా పాజిటివ్ వస్తే వెంటనే ఆ వ్యక్తిని ఐసోలేషన్ కేంద్రానికి తరలిస్తారు . పదకొండు నెలల బిడ్డ ను తల్లితండ్రులనుంచి వేరు చేశారు . ఆ తల్లి తనబిడ్డ ను తీసుకొని వెళ్లినందుకు భోరుభోరున ఏడ్చింది . తనకు కూడా కరోనా సోకితే తన బిడ్డ వెంట ఉండనిస్తారు అని ఆశ పడింది . కానీ ఆమెకు నెగటివ్ . బిడ్డ కు నెగటివ్ వచ్చే దాకా తల్లి ఆమెను కలుసుకునే అవకాశం లేదు . ఇలా ఒకరు కాదు .. ఇద్దరు కాదు .. వేల మంది పసి పిల్లలు .. తల్లితండ్రులకు దూరంగా ఆసుపత్రుల్లో .. ఐసోలేషన్ కేంద్రాల్లో .. వీరిలో చాల మందికి మానసిక స్థితి దెబ్బ తినడం ఖాయం . కానీ జీరో కోవిద్ పాలసీ ఆ దేశ ప్రభుత్వ కళ్ళను కప్పేసింది . కనీస మానవత్వం మరిచి ప్రవర్తిస్తోంది .
4 . ప్రజలకు తినడానికి తిండి లేదు . ప్రభుత్వం ఇచ్చే తిండి సరిపోవడం లేదు . ఇంట్లో వున్న టీవీ సెట్ లు లాంటివి వాస్తు మార్పిడి పద్దతిలో ఇచ్చి బంగాళాదుంపలు నూడిల్స్ లాంటివి తెచ్చుకొంటున్నారు .
ఇన్ని చేసినా కేసులు తగ్గడం లేదు . తగ్గినా మళ్ళీ వస్తాయి . కరోనా కట్టడి అనేది పెద్ద జోక్ . టెస్టింగ్ .. ట్రేసింగ్ .. ట్రీట్మెంట్ .. ట్రిపుల్ టి .. గుర్తొచ్చిందా ? దాన్ని ఫార్మాసూరులు అదే పనిగా ప్రమోట్ చేసారు . జనాల్ని బ్రెయిన్ ఆష్ చేసారు . ప్రాణాలు దక్కించుకోవాలంటే లాక్ డౌన్ ఒకటే మార్గం అని నమ్మించారు . మీకు గుర్తుందా ? 2020 లో మే చివరి కల్లా మన దేశం లో కరోనా ఉండదని చెప్పారు .
వైరస్ అందునా శ్వాస ద్వారా వ్యాపించే వైరస్ ఒకసారి పుడితే పోనేపోదు . పోలియో వైరస్ , స్మాల్ pox వైరస్ వేరు . . మొదటి ప్రపంచ యుద్ధ కాలం లో వచ్చిన స్పానిష్ ఫ్లూ వైరస్ .. పోయిందా ? వందేళ్లు దాటినా మన వెంటే ఉంది . తొలి రెండేళ్లు { 1918 - 1919 } అది మరణాలను కలుగ చేసింది . ఈ లోగా అందరికీ సోకింది . ఆలా ఆ నాటి మన పూర్వీకులకు వైరస్ సోకడం వల్ల సహజ ఇమ్మ్యూనిటి వచ్చింది . అటు పై అదే వైరస్ .. ఈ వందేళ్లల్లో ఎన్ని సార్లు మ్యుటేట్ అయివుంటుంది ? బహుశా కొన్ని లక్షల సార్లు . ఎన్ని కొత్త స్ట్రైన్ లు వచ్చి ఉంటాయి ? కొన్ని వేలు . మనకు మన తండ్రులకు తాతలకు అది ఎన్ని సార్లు సోకి ఉంటుంది ? బహుశా పదుల సార్లు . ఏమైనా అయ్యిందా ? లేదు . ఎందుకంటే మన శరీరాల్లో దానిని ఎదిరించే ఇమ్మ్యూనిటి ఉంది . టి సెల్స్ వున్నాయి . దీనికి వాక్సిన్ తీసుకొన్నామా ? లేదు .
కానీ ..
ఇప్పడు ..
ఫార్మాసూరులు వాక్సిన్ లు తయారు చేస్తున్నారు . వేసుకోకుంటే చస్తారు అని భయపెడుతున్నారు . వాక్సిన్ కు ఆంత ప్రభావం ఉంటే ఇప్పుడు చైనా లో లాక్ డౌన్ ఎందుకు ?
బాగా అర్థం చేసుకోండి . ఓమిక్రాన్ మనపై ఎలాంటి ప్రభావం చూపలేదు అంటే కారణం .. మనకు అంటే మన జనాభా లో తొంబై శాతానికి అది వరకే కరోనా సోకి { మొదటి వేవ్ , రెండో వేవ్ ల లో } దాని ఎదిరించే సహజ ఇమ్మ్యూనిటి రావడం . ఓమిక్రాన్ తిరిగి అందరికీ సోకింది . అది ప్రకృతి ఇచ్చిన వాక్సిన్ . తిరుగు లేదు .
ఫార్మా కంపెనీ లు తయారు చేసిన రసాయనాల వాక్సిన్ ల వల్ల సైడ్ రియాక్షన్స్ తప్పించి ఏమీ లేదు . కరోనా సోకడం వల్ల మనకు టి సెల్స్ రక్షణ వచ్చింది . చైనా దక్షిణ కొరియా లాంటి దేశాలు ఇన్ని రోజులు కరోనా రాకుండా కట్టడి చేసాయి . ఇప్పుడు అక్కడ మొదలయ్యింది . రెండేళ్లు లాక్ డౌన్ లు ఇతరత్రా కట్టడి చేసినా మళ్ళీ కథ మొదటి నుంచి మొదలు .
ఇంకో విషయం . కామన్ ఫ్లూ .. జలుబు .. అదే మొదటి ప్రపంచ యుద్ధ కాలం లో వచ్చిన స్పానిష్ ఫ్లూ .. మనం , మన తల్లి తండ్రులు, తాతలు వాక్సిన్ లేకుండా వాటిని ఎదిరించాము . వాటి అవసరం మనకు లేదు . కానీ ఫార్మా కంపెనీ లు వాక్సిన్ తయారు చేసాయి . పుట్టిన బిడ్డలకు ఆసుపత్రుల్లో వీటిని ఇస్తున్నారు . ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇవ్వడం లేదు . అదే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇస్తున్నారు . ఎందుకు ? అవి ఆంత అవసరం అయితే , అవి లేకుండా మనం ఎలా బతికాము ? పోనీ ఈ కాలం పిల్లలు అనుకొంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాటిని ఎందుకు ఇవ్వరు ?
అంటే మనిషి కోసం మందా ? మందు కోసం మనిషా ?
ఫార్మా కంపెనీ లు మందులు తయారు చేస్తున్నాయి కాబట్టి వాటిని జనాల పై రుద్దలా ?
జుట్టు రాలిపోవడం , మహిళలలో ఋతుక్రమం తప్పడం , గుండెపోటు , బ్రెయిన్ స్ట్రైక్ లాంటివి నేడు బాగా జరుగుతున్నాయి . ఇవన్నీ లాంగ్ కోవిద్ . అంటే కరోనా సోకినవారి కి వచ్చే సమస్యలు అంటున్నారు . కరోనా సోకని వారికి కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి . లేదు వారికి సోకివుండవచ్చు .. లక్షణాలు బయటపడి వుండవు అని దబాయిస్తారు . వారిలో చాలా మంది అంటి బాడీ టెస్ట్ చేయించుకున్నారు . కరోనా రాలేదని తేలింది . కానీ వీరికి జుట్టు రాలడం , చెవిలో గుయ్ మని శబ్దం , కళ్ళల్లో రక్తం .. ఇలాంటి సమస్యలు వున్నాయి . ఇలాంటి వారిని వెయ్యి మందిని స్టేజి పైకి తెస్తాను . ఈ సమస్యలు ఎందుకు వచ్చాయో చెప్పగలరా ? దబాయిస్తే నిజాలు దాగుతాయా ?
చివరిగా ఒక విషయం. ఇమ్మ్యూనిటి తో ఆటలొద్దు . సహజ సిద్ధంగా ఇమ్మ్యూనిటి సాధించుకోవడం వేరు . పోలియో , మసూచి లాంటి వాక్సిన్ లు వేరు . వాటిని అనేక సంవత్సరాలు టెస్ట్ చేసి తీసుకొని వచ్చారు . ఇప్పుడు ఉన్న కరోనా వాక్సిన్ కు కేవలం అత్యవసర అనుమతి మాత్రం వుంది . ఇప్పుడు పిల్లలకు వేయాల్సిన అత్యవసర పరిస్థితి ఏముంది ? వాక్సిన్ లేకుండానే పిల్లలలు మూడు వేవ్ లు చూసారు కదా ? అది నిజంగా గొప్పది అయితే పూర్తి స్థాయి పర్మిషన్ తీచ్చుకోవచ్చు కదా ? పోలియో లాంటి వాక్సిన్ వికటిస్తే కంపెనీ నష్టపరిహారం ఇస్తుంది . కానీ కరోనా వాక్సిన్ కంపెనీ లకు ఎలాంటి భాద్యత ఉండదు . అసలు వాక్సిన్ వల్లే జరిగింది అని చెప్పడానికి రుజువులు ఏంటి అని దబాయిస్తారు .
ఇక కరోనా అయిపొయింది కదా ? .. ఇంకా వాక్సిన్ ల గురించి చర్చ ఎందుకు అని కొంతమంది అనుకొంటున్నారు . ఫార్మాసురులు మెల్లగా ముసుగును తొలగిస్తున్నారు . ప్రతి తొమ్మిది నెలలకు ఒక సారి వేసుకోవాలి అంటున్నారు . ఏజ్ తగ్గించుకొంటూ పిల్లలకు వేసేస్తున్నారు .
ముక్కు పచ్చలారని 15 ఏళ్ళ పిల్లల్లో గుండెపోటు మరణాలు బ్రెయిన్ డెడ్ మరణాలు కనీవినీ ఎరుగుదుమా ? మందులోళ్ల ధనదాహానికి నిజాలు సమాధి కావాల్సిందేనా ? మన బిడ్డలు , మన ఒళ్ళు, ఇల్లు గుల్ల కావాల్సిందేనా ?
అమెరికా లో వ్యక్తికి 18 ఏళ్ళు వచ్చేటప్పటికి 50 వాక్సిన్ లు ఇస్తారు . ఇది ఒక పక్క . మరో పక్క .. అమెరికా లో ప్రతి ఇద్దరిలో ఒక బిడ్డ తీవ్ర ఆనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు . దీనికి దానికి సంబంధం లేదని వాదిస్తారు .
ఎలర్జీ .. ఆటో ఇమ్యూన్ వ్యాధి .. ఇవి అమెరికా పిల్లలలో బాగా ఎక్కువ . రెండు ఇమ్మ్యూనిటి వ్యవస్థ పాడు కావడం వల్ల వచ్చినవే . కానీ దానికి వాక్సిన్ కు సంబంధం లేదనేది నేటి సైన్స్ .
సైన్స్ అంటే సత్యం . కానీ అది ఇప్పుడు అది ప్రపంచ ఫార్మసురుల చేతిలో బంధీ. ఫాస్ట్ ఫుడ్ కంపెనీ ల కు , ఫార్మా కంపెనీ ల కు నష్టం జరిగే ఏది రుజువు కాదు . కానివ్వరు.
ఇదే నేటి ప్రపంచం.

No comments:

Post a Comment

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...