Saturday 8 May 2021

 ఈ పోస్ట్ లో కేవలం కొన్ని ప్రశ్నలు ! వీటికి సమాధానాలు ఆలోచించండి . ఇలాంటి ప్రచారం చేస్తున్న వారిని ప్రశ్నించండి . సమాధానాలు ఇవ్వమనండి .

amarnath vasireddy

1 . హైదరాబాద్ జూ లో సింహాలకు కరోనా టెస్ట్ లు నిర్వహించింది ఎవరు ? మనుషులకు కరోనా టెస్ట్ లు నిర్వహించేటప్పుడు నోరు బాగా తెరిచేలా చేసి, నోరు ముక్కు కలిసే చోట నుంచి శ్వాబ్ తీస్తారు . ఇలా సింహాలకు నోరు తెరిసి శ్వాబ్ తీసిన మొనగాడెవ్వడు ? ఒక వేళా సింహాలు తిరుగాడిన చోట వాటి నోట నుంచి కింద పడిన సొంగ ను సేకరించి టెస్ట్ లు జరిపితే అదెంత వరకు శాస్త్రీయం ? ఒక జీవి శరీరం లో వున్నప్పుడే వైరస్ కు ప్రాణం ఉంటుంది . జీవి శరీరం నుంచి బయటకు వచ్చినప్పుడు దానికి ప్రాణం ఉంటుందా ? . పోనీ ఇదే పధ్ధతి సరైనదనుకొంటే మనుషులను కూడా ఒక ప్లేట్ లో ఉమ్మి వేయమని దాన్ని టెస్ట్ చేయవచ్చుకదా ? నోట్లో పుల్ల గుచ్చి ఇబ్బందులకు గురి చేయడం ఎందుకు ?
2 . ఒక వ్యక్తి రోడ్ పై ఆక్సిడెంట్ కు గురై ఒక చేతి ని పోగొట్టుకున్నాడు . దానితో తీవ్ర దిగ్బ్రాంతి కి గురయ్యాడు . ఇలాంటప్పుడు అతని శ్రేయోభిలాషులు ఏమి చెబుతారు ? ఏమి కాదు .. ఫరవా లేదు అని ధైర్యం చెబుతారు . అంతేనా ? ఆలా కాకుండా ఆ వ్యక్తి వద్దకు ఒకడు వెళ్లి" అయ్యో !ఇదే ముంది . నీకు ముందు ముందు మరిన్ని ఆక్సిడెంట్ లు ఖ్యాయం . నెక్స్ట్ ఆక్సిడెంట్ లో ఇంకో చేయి పోతుంది . తరువాతి ఆక్సిడెంట్ లో ఒక కాలు .. తరువాత ఒక కన్ను" .. ఇలా చెబుతుంటే అలాంటి వాడిని ఏమనాలి ? వాడు చెప్పేది నిజామా అబద్దమా అనే విషయం తరువాత . అసలు ఆ వ్యక్తి ఉద్దేశం ఏంటి ?
ఇప్పుడు ఇదే లాజిక్ ను ఉపయోగించండి . మూడో వేవ్ అక్టోబర్ లో వస్తుంది . అది మరింత ప్రమాదకరం . నాలుగు ఐదు ఇలా వేవ్ లు వస్తూనే ఉంటాయి . మూడో వేవ్ లో పిల్లలే టార్గెట్ .. ఇలా చెబుతున్న వారి మాటల్లో నిజానిజాలు తరువాత. . అసలు వారి ఉద్దేశం ఏంటి ? ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతోంది . ఎక్కడో ఒక వాక్సిన్ కేంద్రంలో జనాలు ఒకరినొకరు తోసుకొంటూ , అరుపు కేకలతో వాక్సిన్ కోసం కొట్లాడుతున్నారు . ఇప్పుడు ప్రజల్లోని ప్రాణభయానికి ఇది ఒక సంకేతం . ప్రజలు ప్రాణభయం తో భవిష్యత్తు పై ఆశలు లేకుండా నిరాశానిస్పృహల్లో మునిగి పోతున్నప్పుడు మూడో వేవ్ నాలుగో వేవ్ అంటూ ప్రకటనలు చేస్తున్న వారి ఉద్దేశాలు ఏంటి ? అదీ ఎవరో దారిన పొయ్యే దానయ్య కాదు. ప్రభుత్వానికి సలహా లిచ్చే ఒక కీలక భాద్యత లోని వ్యక్తి . ఒక వేళా ప్రభుత్వాన్ని సన్నద్ధం చేయాలి అనుకొంటే ఆ నివేదిక ను బహిర్గతం చేయడం ఎందుకు ?
3 . మ్యుటేషన్ అంటే ఉత్పరివర్తనం . సృష్టి లో ప్రతి జీవి ప్రతి రోజు మ్యుటేషన్ కు గురి అవుతుంటుంది . కరోనా వైరస్ కూడా అంతే . కానీ అదేదో ప్లాన్ చేసుకొని తన రంగు రూపు గుణాన్ని మార్చుకున్నట్టు రాతలు రాసేవారిని ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తోంది ? ముఖ్యంగా ఆంధ్ర వైరస్ వెయ్యి రెట్లు ప్రమాదకరం అని రాసారు . అసలు మ్యూటేషన్ ద్వారా వేయి రెట్లు ప్రమాదకరం కావడానికి ఇదేమైనా రాజమౌళి గ్రాఫిక్స్ సినిమా నా ? జనాల్ని ఇంత భయబ్రాంతులకు గురి చేసిన వారిని ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తోంది ?

No comments:

Post a Comment

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...