Thursday, 29 April 2021

..#నెహ్రూ దమనకాండలో అభాగ్యురాలైన మరో వనిత.

***************************************


1986 డిసెంబర్ 26న ఋషికేష్ పట్టణంలో గంగానది ఒడ్డున ఒక అనాథ శవం కన్పించింది..

శరీరం కుళ్లిపోయి ఉంది. గుర్తుపట్టడానికి చాలా శ్రమ పడ్డారు. ఒక నెల రోజుల తర్వాత తేల్చగలిగారు... ఆమె గొప్ప దేశభక్తురాలు #బీనాదాస్ అని.

ఆమె ఒకప్పుడు కలకత్తా విశ్వవిద్యాలయ విద్యార్థిని...

దుర్మార్గ బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధి అయిన బెంగాల్ గవర్నర్ జాక్సన్ పైనే రివాల్వర్ ఎక్కుపెట్టి కాల్చిన ధైర్యశాలిని...
బ్రిటిష్ ప్రభుత్వం బీనాదాస్‌ని అరెస్ట్ చేసి, తొమ్మిదేళ్ల కఠిన జైలుశిక్ష విధించింది...
జైలు జీవితంలో తొమ్మిదేళ్లు దుర్భరంగా గడపిన తర్వాత...ఆమె విడుదలై వచ్చి...తిరిగి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని...మళ్ళీ అరెస్ట్ అయ్యి...మరోసారి కూడా జైలు శిక్షలు అనుభవించింది...
స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇటువంటి మహనీయులను చేరదీసి గౌరవించాల్సిన నెహ్రూ ఇటువంటి వారి పేరు వింటేనే అసహ్యించుకునేవాడు..
కారణం స్వాతంత్ర్యం క్రెడిట్ అంతా తనకే దక్కాలి..
అలా జరగాలంటే ఇలాంటి మహనీయులు కనుమరుగైపోవాలి...
నిస్వార్థ దేశభక్తురాలైన బీనాదాస్
రుషికేష్ వెళ్ళిపొయి దైవసాధనలో గడపింది.. కాలం గడిచింది... ఆమెను అందరూ మరిచిపోయారు...
ఋషికేష్‌లో అనాధగా జీవించి.. మరణించింది...
ఇటువంటి అజ్ఞాత దేశభక్తులు ఎందరో..ఎందరెందరో...
వారి త్యాగాల మీద బ్రతికే ఈ నేలలో కనీసం వారి పేరు కూడా ఏడాదికి ఒక్కసారైనా తలవని దౌర్భాగ్యం మనది...
కారణం వారి పేర్లు చరిత్రలో ఎక్కడా లేకుండా కేవలం తన వల్ల గాంధీ వల్లనే స్వాతంత్ర్యం వచ్చినట్లు కమ్యూనిస్టులచేత చరిత్ర రాయించాడు నెహ్రూ....!!
జైహింద్....

No comments:

Post a Comment

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...