నాహం కర్తా హరి: కర్తా : - సర్వం సంభవాం ( క్లుప్తంగా )
అందులో నన్ను అత్యంత ప్రీతికరంగా ఆకట్టుకున్న అంశం .. బాలాజీ పంచరత్నమాల . అపర సంగీత సరస్వతి శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు ఒకానొక దశలో1970 ల కాలములో మొత్తం ఆస్తులన్నీ కోల్పోయారు . సదాశివం గారు స్వాతంత్రోద్యమ కాలములో కల్కి పత్రికను నడిపే వారు .. అలా ఎమ్మెస్ కుటుంబం మొత్తం ఆస్తులన్నీ కోల్పోయి చివరకు ఉన్న ఇల్లు కూడా పోగా వారు ఒక అద్దె ఇంటిలో అద్దెకు ఉండేవారు . ఈ విషయాన్ని మహాపెరియవ కంచి పరమాచార్యులవారు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి తెలియజేసారు . పుట్టపర్తి సాయిబాబా గారు కూడా తంతి ద్వారా తెలియజేసారు . వెంటనే ఆయన బోర్డు సభ్యులతొ సమావేశం అయి చర్చించిన పిమ్మట ఆమె అయాచితంగా డబ్బులు ఇస్తే తీసుకోదు . అప్పటికే ఆమె తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆస్థాన గాయని కూడా . మరెలా సాయం చేయడం అని తర్జనభర్జనలు పడ్డ తరువాత శ్రీ పీవీ ఆర్ కె ప్రసాదు గారికి వెంటనే ఉదయించిన ఆలోచన అన్నమయ్య బాండారములో ఉన్న కీర్తనలకు సంగీతం చేకూర్చి ప్రచారం కల్పిస్తే ? ఎమ్మెస్ వంటి మహా గాయనీమణులు పాడితే అవి దేశమంతా ప్రజలకు చేరువ అవుతాయని వారు సంకల్పించారు . అలా వారు ఎమ్మెస్ గారిని సదాశివం గారిని కలవడానికి వళ్ళువురు కోట్టం దగ్గర అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నా వారి వద్దకు వెళ్లారు . ఒకపుడు దేశాధినాయకులు అందరు వస్తూ పోతూ ఉండిన ఇల్లు, ఎందరో గొప్పవారి రాకపోకలతో కళకళలాడాల్సిన వారి ఇల్లు నిర్మానుష్యంగా ఉంది . ఎంతో వైభవంగా ఉండిన ఆ దంపతుల దీనావస్థ చూడగానే వారి గుండె తరుక్కు పోయింది . అక్కడ వాళ్ళు పరచిన ఓ చాప మీద కూర్చునే కుశల ప్రశ్నల తరువాత బాలాజీ పంచరత్న మాల విషయం తెలియ జేయగా సదాశివం గారు ..ఆమెకు తెలుగు రాదు .. పైగా ఇపుడు పెద్దదై పోయింది ఇంకా సాధన అంటూ చేసి పాడటానికి కష్టమే అని చెప్పగా ఇంటిలోనుండి అపుడే వచ్చిన ఎమ్మెస్ గారు ఆ మాట విని నా దైవం నన్ను పాడమని ఆజ్ఞాపిస్తే పాడకుండా ఎలా ఉండగలను అని ఆమె ఒప్పుకోవడము .. వెంటనే కాంట్రాక్టు కుదుర్చుకుంటూ శ్రీమతి ఎమ్మెస్ సుబ్బులక్మి గారికి రెమ్యూనరేషన్ వద్దంటున్నా వారికి అయిదు లక్షల రూపాయలు , సంగీతం కూర్చినందుకు శ్రీమతి రాధ విశ్వనాథ గారికి లక్ష రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారు . అలా వచ్చిందే శ్రీ బాలాజీ పంచరత్నమాల .. మన అందరినీ దైవిక భావనలో ఇప్పటికీ ఉర్రూతలూగిస్తున్నది .. అదంతా నాడు శ్రీ పీవీ ఆర్ కె గారి ద్వారా శ్రీవారు చేయించిందే. ఆ రికార్డుల రిలీజ్ అవగానే శ్రీవారి ప్రసాదం ఎంత ప్రఖ్యాతి పొందినదో అంత ప్రఖ్యాతి పొందాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఖర్చు పెట్టిన డబ్బులు మొదటి రోజులోనే వచ్చాయి .. వెంటనే మరో రిలీజ్ చేయాల్సి వచ్చిందిట. ఇలా అనేకమార్లి రిలీజ్ అయినా ఇప్పటికీ అమ్ముడు పోతున్నవాటిలో బాలాజీ పంచరత్నమాల ప్రసిద్ధి. అలా ఆమె జీవితాంతమూ ఆమెకు దాని మీద రాయల్టీ వచ్చేట్టు కూడా చేసారు శ్రీ పి వీ ఆర్ కే ప్రసాదు గారు.
No comments:
Post a Comment