Sunday, 24 January 2021


చరిత్ర పాఠాలలో మనకు చెప్పని తెలియనివ్వని నిజం 















టర్కీ సుల్తాను విస్తార సామ్రాజ్యాన్ని పాలిస్తూ ఖలీఫా అనే బిరుదును వహించి ఉండేవాడు. ఖలీఫా అంటే ప్రపంచ ముస్లిం ప్రజానీకానికి అధిపతి, భూమిపై అల్లా ఛాయ అని భావించేవారు. క్రీ.. 1914 నుంచి 1919 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ ఇంగ్లాండుకు వ్యతిరేక పక్షంలో పోరాడి ఓటమి చెందింది. పరిస్థితిలో భారత దేశంలోని ముస్లిం నేతలు టర్కీ సామ్రాజ్యపు సరిహద్దులను, ఖలీఫా యొక్క అధికారాలను యథాతథంగా ఉంచాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఖిలాఫత్ ఉద్యమాన్ని ఆరంభించారు.

ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తే భారత ముస్లింలు స్వాతంత్ర్య పోరాటంలో సహకరిస్తారని, హిందువుల పట్ల స్నేహాన్ని అవలంబిస్తారని, గోవధను తమంత తామే మానుకుంటారని భావించిన గాంధీజీ ఎందరు అడ్డు చెప్పినా వినకుండా ఖలీఫా పీఠపు ఉనికి భారత జాతీయ సమస్య అయినట్లుగా కాంగ్రెస్ పార్టీని, భారత ప్రజలను ఉద్యమంలోకి దించాడు. తన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఖిలాఫత్ ఉద్యమానికి జోడించి నడిపాడు.

కాని ప్రపంచ యుద్ధపు ఒప్పందాలను శాసించే బలం ఉద్యమానికెక్కడుంది? టర్కీ సామ్రాజ్యం ముక్కలు ముక్కలుగా చేయబడి సౌదీ అరేబియా, ఇరాక్, లిబియా, సిరియా, జోర్డాన్, యెమెన్, బిమన్ మొదలైన రాజ్యాలు ఏర్పడ్డాయి. ఖలీఫా పదవి రద్దు చేయబడి టర్కీ 1923 లో ఒక రిపబ్లిక్ గా అవతరించింది.

ఖిలాఫత్ ఉద్యమం చివరి దశలో కేరళలోని మోఫ్లా జాతి ముస్లింలు ఆంగ్ల ప్రభుత్వంపై జిహాద్ ప్రకటించారు. విప్లవాన్ని బ్రిటీష్ ప్రభుత్వం కఠినంగా అణచి వేసింది. 2226 మంది జిహాదీ మోఫ్లాలు వధించబడ్డారు.

వైఫల్యం వల్ల కలిగిన ఆగ్రహాన్ని మోఫ్లాలు అప్పటి వరకు తమతో సహకరించిన హిందువులపై వెళ్ళగ్రక్కారు. 1500 మంది హిందువులను హత్య చేశారు. 20 వేల మందిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారు. హిందూ స్త్రీలపై జరిగిన మానభంగాలకు, అపహరణలకు లెక్కే లేదు. ఇస్లామిక్ మత భావనలను సంతుష్టి పరచడం ద్వారా హిందూ ముస్లిం ఐక్యతను సాధించ గలనన్న గాంధీజీ నమ్మకం ఇలా బెడిసి కొట్టింది. ఆయన         "నేను హిమాలయమంత పొరపాటు చేశాను" అని తరువాత ప్రకటించాడు. కాని పొరపాటును ఎప్పుడూ సరిదిద్దుకోలేదు.

No comments:

Post a Comment

show image

  Sep 12 , 2025 " The Great Indian Warriors " Saragarhi Day September Twenty Sixth Trib...