రామభద్రాచార్యస్వామి..
ఈయన వల్లనే అయోధ్య తీర్పు ఏకపక్షం గా వచ్చింది. ఈ స్వామీజీ అంధుడు. అయినా ఋగ్వేదం లోని శ్రీరాముల వారికి చెందిన 157 మంత్రాలు, వాటికి భాష్యాలు కోర్టులో చెప్పారు. అంధుడై ఉండి వేదాలు చెప్పడంతోనే అక్కడి వారు ఆశ్చర్యపోయారు. వేద శక్తి ఇలా ఉంటుంది. సనాతనధర్మం అంటే ఇంత శక్తివంతమైనది..
రుగ్వేద మంత్రాలకు పదవాక్య ప్రమాణజ్ఞుడయిన శ్రీ నీలకంఠ పండితుడేనాడో వ్రాసిన భాష్యం మంత్ర రామాయణం. ఇతని తండ్రి గోవిందసూరి. దీనిలో 157 రుగ్వేద మంత్రాలకు భాష్యం ఉంది. దీనిలో దశరథుని పుత్ర కామేష్టి నుండి సీతాపృధ్వీ ప్రవేశం వరకు ఉంది. దీనిని రామభద్రాచార్యస్వామి అనే అంధ సన్యాసి కల స్పష్టం చేశారు. ఈయన ఒక మఠానికీ అధిపతి.
రామజన్మభూమిని గురించికోర్టులో వాదాలు జరుగుతున్నప్పుడు జడ్జీలలో ఒక ముస్లిం జడ్జి, హిందువులు అన్నింటికి వేదం ప్రమాణమంటారు కదా? చెప్పమని ప్రశ్నించారట.
అప్పుడే స్వాములవారిని తీసుకువచ్చి సాక్ష్యం ఇప్పించారు. ఆ అంధస్వామి అనర్గళంగా రుగ్వేదమంత్రాలు చదువుతూ దాని భాష్యం చెబుతూ రామకథని వివరిస్తూంటే జడ్జీలతో సహా కోర్టంతా దిగ్భ్రాంతికి లోనయ్యింది.
అంధుడు పుస్తకం, మనిషి అవసరం లేకుండా అతి ప్రాచీనమైన రుగ్వేద మంత్రాలు, దాని భాష్యం. రామకథ వివరించడం ఆశ్చర్యకరం కదా! దీనివలన రామ జన్మభూమి తీర్పు ఏకగ్రీవంగా వెలువడింది. తరువాత శ్రీరామభద్రాచార్యాస్వామి వారిని అభినందించిన దృశ్యం సామాజిక మాధ్యమాల్లో సంచారం చేసింది.
శ్రీ కృష్ణ సిరికృష్ణ 17, ລ໌ 2024 12:08