Thursday, 4 January 2024

 తెలుగు భాష ఔన్నత్యం


ఒక తమిళ వ్యక్తి రాసిన వ్యాసాన్ని యధాతధంగా.....


నా మాతృ భాష తమిళ భాష. దాని అర్థం ఇతర భాషలను గురించి తెలియదని కాదు. తెలుగు భాష గురించి నాకు త

    తెలుగు మాతృ భాషగా ఎవరికి వున్నదో, తెలుగు భాషను ఎవరు ప్రేమిస్తున్నారొ, తెలుగు గురించి తెలుసుకుందామనుకొనేవారి కోసం కొన్ని విషయాలు.

1. తెలుగు భాష సుమారు క్రీ. పూ. 400 క్రితం నుండి  వుంది.

2. 2012 లో తెలుగు లిపి ప్రపంచం లోనే రెండవ గొప్ప లిపిగా "International Alphabet Association" ద్వారా ఎన్నుకోబడినది.

మొదటి లిపిగ కొరియన్ భాష.

3. తెలుగు భాష మాట్లాడడం వల్ల మన శరీరం లో గల 72000 నాడులు ఉత్తేజితమౌతాయని శాస్త్రం ద్వారా నిరూపితమైంది. మిగిలన భాషల కన్న ఇది చాలా చాలా ఎక్కువ.

4. శ్రీలంకలో గల జిప్సీ తెగ ప్రజలు ఎక్కువగా తెలుగు మాట్లాడతారు.

5. మయన్మార్ లో చాలా మంది తెలుగు మాట్లాడతారు.

6.  ఇటాలియన్ భాష లాగానే   తెలుగు భాషలో కూడా  పదాలు హల్లు శబ్దంతో అంతమౌతాయని 16వ శతాబ్దంలో ఇటలీకి  చెందిన  నికోలో డీ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అందుకే  తెలుగు భాషను "ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్" అని అంటారు .

7. భారత దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య సుమారు 75 మిలియన్లు. ఇది మన దేశంలో మూడవ స్థానాన్ని, ప్రపంచం లో 15 వ స్థానాన్ని పొందింది.

8. తెలుగు అనే పదం త్రిలింగ అనే పదం నుండి వచ్చినట్లు చెపుతారు. హిందూ పురాణాల ప్రకారం  త్రిలింగక్షేత్రాలు నైజాం ప్రాంతం లోని కాళేశ్వరం, రాయలసీమలోని శ్రీశైలం, కోస్తా లోని భీమేశ్వరం మధ్యలో వుండడం వలన ఈ పేరు వచ్చిందని అంటారు.

9. ప్రపంచ ఉత్తర ప్రాంతంలో తెలుగు భాషలో మాత్రమే ప్రతి పదం హల్లు శబ్దంతో పూర్తి అవుతుంది.

10. తెలుగు భాషలో వున్నన్ని సామెతలు, నుడికారాలు ఇంకా ఏ భాష లోనూ లేవు.

11. తెలుగు భాషను పూర్వం తెనుంగు, తెలుంగు అని వ్యవహరించేవారు.

12. భారతీయ భాషలలో తెలుగు అంత తీయనైన భాష మరి ఏదీ లేదని విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ అన్నారు.

13. 200 సం. ల క్రితం మొక్కలు నాటే పని కోసం సుమారు 400 మంది తెలుగు వారు మారిషస్ వెళ్ళారు. ప్రస్తుత మారిషస్ ప్రధాని వారి సంతతివారే.

14. రామాయణ మహభారతాలలో దాదాపు 40 శ్లోకాలు కచిక పదాలతో కూడిన పద్యాలు వున్నాయి. ఈ విధంగా మరి ఏ భాషా సాహిత్యంలోనూ లేదు.

కచిక (palindrome words)పదాలు అనగా ఎటునుండి చదివిన ఒకే రకంగా పలికేవి. ఉదాహరణకు వికటకవి, కిటికి, మందారదామం, మడమ వంటివి.

15. శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యద అనే గ్రంథాన్ని తెలుగలో వ్రాసి, "దేశభాషలందు తెలుగు లెస్స" అని చెప్పి తెలుగును  తన సామ్రాజ్యంలో అధికార భాషగా చేసాడు.

16. ఏకాక్షర పద్యాలు గల భాష తెలుగు మాత్రమే. 

తెలుగు భాష ఔత్సాహికులకు కావలసినంత ఉత్సాహాన్ని, సృజనాత్మకతను అందిస్తుంది ఆనడం లో ఏమాత్రం సందేహం లేదు.

పై విషయాలన్నీ ఒక తమిళ వ్యక్తి  ఆంగ్లంలో  తెలియజేసిన విషయాలను అనువదించారు, కానీ ఇది నిజం. ఇంత గొప్ప మన భాషను మన భావి తరాలవారికి సగర్వంగా అందించే బాధ్యత మన తరంపై వుంది. తెలుగు భాషను చంపేసే తరంగా మనం ఉండకూడదని నా భావన. 

ఏ భాష ప్రజలైన వారి మాతృ భాషలోనే మాట్లాడతారు. అందుకు వారు గర్వపడతారు. కానీ అది ఏమి దౌర్భాగ్యమో, ఎక్కడినుండి వచ్చిన దరిద్రమో గానీ మనం మాత్రం ఆంగ్ల భాషలో మాట్లాడడానికి ప్రాధాన్యత ఇస్తాం. అమ్మ, నాన్న, అత్త, మామ, అన్నయ్య, అక్క, తాత, మామ్మ, వంటి పదాలు పలకడానికి సిగ్గు పడుతున్నాం. కొన్నాళ్ళకు ఆ పదాలు అంతరించిపోయే విధంగా మనం ప్రవర్తిస్తున్నాం. ఇకనుంచి అయినా తెలుగు భాషపై స్వాభిమానం పెంచుకుందాం. తెలుగులో మాట్లాడుదాం. 

 ఆంగ్లభాష బతుకుతెరువు కోసం నేర్చుకోవాలి. అందుకోసం మన తెలుగు భాషను బలిచేయనవసరం లేదు. 

తెలుగు వాడిగా పుట్టడం గర్వంగా అనుభూతి పొందుదాం. 

ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారికి

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...