చిత్రం వెనుక విచిత్రం
రాజా రవివర్మ అంటే తెలియని వాళ్ళు ఉండరు. 1904 సంవత్సరంలో ఆయనకి వృద్దాప్యం వచ్చి ఓపిక నశించి మంచంలో ఉన్నప్పుడు ఒకరోజు ఒక కల లాంటి ఆలోచన వచ్చింది.
“జీవితంలో ఇన్ని వేల దేవీ దేవతల బొమ్మలు గీసాను కదా..నేను ఈ కేరళ కు చెందిన వాణ్ణి..మరి ఈ కేరళలోనే పుట్టిన మహనీయులు అందరికీ తెలిసిన జగద్గురు ఆదిశంకరాచార్యులు, వారి బొమ్మ గీయలేదే..వారు ఎలా వుంటారో కూడా ఎవ్వరికీ తెలియదు..వారి బొమ్మ గీయకుండానే నేను వెళ్ళిపోవాలా..” అని చాలా బాధపడ్డారు. అలా బాధపడి ఎన్నో రాత్రుళ్ళు ఏడుస్తూ గడిపేవారు.
ఒకరోజు రాత్రి రవి వర్మకి గాఢమైన నిద్ర పట్టింది. ఆ నిద్రలో ఆయనకీ ఒక కల వచ్చింది. ఒక నది ఒడ్డున ఒక కుటీరం. కుటీరానికి కొద్ది దూరంలో ఒక చెట్టు కింద శంకరాచార్యులవారు, ఆయన చుట్టూ నలుగురు శిష్యులు పులిచర్మం మీద, కూర్చున్నట్టు కల వచ్చింది. ఇంకా రవి వర్మ వారందరి చుట్టూ తిరుగుతూ ప్రతి అంగుళాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్టుగా కూడా కల వచ్చిందిట.
ఆ మర్నాడు తన శిష్యులను పిలిచి తనకి కలలో శంకరాచార్యులవారు శిష్యులతో కూర్చున్నట్టుగా కలలో సాక్షాత్కరించార ని, ఇది ఆ జగద్గురువు కృప అని, ఆయన బొమ్మను వెయ్యటం తన లక్ష్యమని, కానీ ఒక్కడినే ఈ వయసులో వెయ్యలేనని, అందుకు మీ సహకారం కావలని అడిగారు. ఆ విధంగా వేసిన చిత్రమే ఇది.
దూరం నుండి చూస్తే నిజమైన మనుషులు కూర్చున్నట్టుగానే అనిపించే ఈ చిత్రం రవివర్మ సృజనాత్మకమైన ఆలోచనల నుండి ఈ ప్రపంచం లోకి జాలువారిన ఒక అపురూపమైన కానుక.
🙏💐🙏