Sunday 3 September 2023

 భారత సాహస శిఖరం.. ‘మల్లి మస్తాన్ బాబు’




#మల్లి మస్తాన్ బాబు.....పర్వతారోహణ విషయంలో అఖండ భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టిన పర్వతారోహకుడు. అలాగే పర్వతారోహణలో గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించిన సాహసికుడు. అంతేనా అంటే.. మస్తాన్ బాబు గురించి చెప్పాలంటే.. ఎప్పటికీ తరగనంత సాహాసం, ఎక్కడా తొణకని జీవితం.. ఇలా ఒకటేమిటి సాహసం అనే విషయంలో భారతదేశాన్ని, తెలుగు మట్టిని శిఖరమంత ఎత్తులో నిలబెట్టిన ఓ మహోన్నత అధ్యాయం మన ముందు కనిపిస్తుంది.
మల్లి మస్తాన్‌బాబు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పర్వతారోహకుడు. పర్వతారోహణలో గిన్నిస్‌ ప్రపంచ రికార్డ్ సాధించిన సాహాసికుడు. మస్తాన్ బాబు 172 రోజుల్లో ఏడు ఖండాలలోని ఏడు పర్వతాలను అధిరోహించి గిన్నిస్‌ బుక్‌ రికార్డులలోకి ఎక్కాడు. ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన మొదటి తెలుగు బిడ్డడు మస్తాన్‌బాబు.
#ఇక మల్లి మస్తాన్ బాబు పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. 1974 సెప్టెంబర్ 3న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సంగం మండలంకు చెందిన గాంధిజనసంగం అనే ఓ చిన్న కుగ్రామంలో జన్మించారు. మస్తాన్ బాబు మత్స్యకార కుటుంబానికి చెందిన సుబ్బమ్మ, మస్తానయ్య దంపతులకు 5వ సంతానంగా జన్మించారు. ఆ తర్వాత 6వ తరగతి చదువుటకై కోరుకొండ సైనిక పాఠశాలలో చేరినప్పటి నుంచి మస్తాన్ బాబుకు కొండలు ఎక్కడంపై అభిరుచి పెరిగింది.ముఖ్యంగా కోరుకొండ స్కూల్ ఆవరణలో ఉన్న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే ప్రయత్నంలో 1985లో ప్రాణం కోల్పోయిన పూర్వ విద్యార్థి ఉదయకుమార్ విగ్రహం.. మస్తాన్ బాబుకు ఎత్తైన కొండలను ఎక్కి రికార్డులను సాధించాలనే కోరికను, ప్రేరణను కల్గించింది. ఈ క్రమంలో చిన్నతనంలోనే తన స్వగ్రామం వెళ్ళినప్పుడల్లా ఎన్నోసార్లు కాళ్ళు, చేతులు కట్టుకుని కనిగిరి రిజర్వాయర్ లో ఈదేవాడు. ఇలా సాహసాలు చేస్తూనే.. మస్తాన్ బాబు జంషెడ్ పూర్ లోని నిట్ లో (1992-96) బీటెక్, ఖరగ్ పూర్ లోని ఐఐటీలో ఎంటెక్, కలకత్తాలోని ఐఐఎంలో (2002-04) పీజీడీఎం కోర్సును పూర్తిచేసి ఉన్నత స్థాయి ఉద్యోగాలలో పనిచేశాడు.
#ఇండియా, కెన్యా, దుబాయి, అమెరికా దేశాలలోని పలు మేనెజిమేంట్ కోర్సు కళాశాలలోను, సాంస్కృతిక, స్వచ్ఛంద సంస్థలలోను, వృతిపరమైన సంస్థలలో, వ్యాపారసంస్థలలో,నాయకత్వం- నిర్వహణ వంటి విషయాలలో ప్రేరణ, మార్గదర్శక ఉపన్యాసాలు ఇచ్చాడు.
#సాహసాలు – పర్వతారోహణ : మల్లి మస్తాన్ బాబు సాహసాల గురించి చెప్పాలంటే.. పర్వతారోహణలో అతను సాధించిన అత్యున్నత విజయాల గురించి మాట్లాడుకోవాల్సిందే.
* అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్ మానిఫ్ పర్వతాన్ని ఎక్కిన మొదటి భారతీయుడు మల్లి మస్తాన్ బాబు.
* 2006వ సంవత్సరంలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న ఏడు ఎత్తైన, దుర్లభమైన పర్వత శిఖరాలను 172 రోజుల అతి తక్కువ కాలంలో అధిరోహించిన మొదటి భారతీయ పర్వతారోహకుడు, తెలుగువాడు, ఒకే ఒక వ్యక్తి మస్తాన్ బాబు.
* ఆ ఏడు ఖండాల్లో ఉన్న ఏడు శిఖరాలను వారంలోని ఏడు రోజులలో, అనగా ఒక శిఖరం వారంలో ఒక రోజు చొప్పున ఏడు రోజులకు ఏడు శిఖరాలు వచ్చేలా అధిరోహించడం విశేషం.
* మస్తాన్ బాబు చిలీ, అర్జెంటినా దేశ సరిహద్దుల్లో ఉన్న ఓజోస్ డెల్ సాలాడో అనే 6893 మీటర్ల ఎత్తున్న అగ్ని పర్వతాన్ని అతి సులువుగా అధిరోహించారు.
* అలాగే ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని ఎనిమిది పర్యాయాలు, రష్యాలోని ఎల్ బ్రూన్ పర్వతాన్ని మూడుసార్లు ఎక్కడం జరిగింది.
* మస్తాన్ బాబు 14 రోజుల్లో 14 రాష్ట్రాల్లో మారథాన్ చేసి రికార్డు సొంతం చేసుకున్నారు.
* ఒసియానాలోని కార్సుటెంజ్ పిరమిడ్ ను ఎక్కిన మొదటి భారతీయుడు, తెలుగువాడు మస్తాన్ బాబు.
* మస్తాన్ బాబు 2008లో ఎవరెస్ట్ పర్వతం నుంచి కాంచనగంగ వరకు 680 మైళ్ళ సుదూరమైన, కష్టతరమైన నడకయాత్రను ఒంటరిగా 75 రోజులలో ముగించిన సాహసి.
* అలాగే సార్క్ దేశాలకు సంబంధించి ఏడు శిఖరాలను అధిరోహించిన మొదటివాడు.
#పురస్కారాలు :
* 2011లో మస్తాన్ బాబుకు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, కలకత్తా వారిచే ఉత్తమ పూర్వ విద్యార్థి అవార్డు ప్రదానం చేయబడింది.
* ఇంకా అనేక దేశాల నుంచి, సంస్థల నుంచి పలు అవార్డులను, రివార్డులను మస్తాన్ బాబు అందుకున్నారు.
#ఆండీస్ పర్వతారోహణ – మరణం :
మల్లి మస్తాన్ బాబు 2015 మార్చి 24న పర్వతారోహణ చేయు సమయంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు వదిలారు. అప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన సుమారు 37 పర్వతాలను అధిరోహించి మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించిన మస్తాన్ బాబు ఆ రోజు మరో రికార్డును నెలకొల్పేందుకు వెళ్లి మరణించారు. ఆ దుర్ఘటన గురించి చెప్పాల్సి వస్తే.. మస్తాన్ బాబు మార్చి 22వ తేదీన అర్జెంటీనా, చిలీ దేశాల మధ్యనున్న ఆండీస్ పర్వతశ్రేణి అధిరోహించడానికి తన నలుగురు స్నేహితుల బృందంతో కలిసి వెళ్లారు. అనంతరం చిలీలో రెండో అత్యంత పెద్దదైన సెర్రో ట్రెస్ పర్వతాన్ని అధిరోహించడానికి ఒంటరిగా బేస్ క్యాంప్ నుంచి బయలుదేరారు. చివరగా మార్చి 24న మస్తాన్ తన స్నేహితుడితో మాట్లాడుతూ వాతావరణం ప్రమాదకరంగా మారడంతో అదే రోజు సాయంత్రానికల్లా బేస్ క్యాంప్ నాకు వస్తానని చెప్పారు. అయితే, మస్తాన్ రాకపోవడంతో అతని స్నేహితులు 25న అధికారులకు సమాచారం అందించారు. చివరకు ప్రభుత్వాలు చొరవ చూపడంతో అదే నెల 26న అన్వేషణ ప్రారంభించడంతో పాటు 31వ తేదీ నుంచి అన్వేషణ మొదలెట్టారు. ఈ క్రమంలో 2015 ఏప్రిల్ 4న రెస్క్యూ టీమ్ అర్థరాత్రి సమయంలో అక్కడి ‘సెర్రో ట్రెస్ క్రూసెస్ సుర్’ మంచు పర్వత ప్రదేశంలో 5900 అడుగుల ఎత్తున శ్వాస ఆడక, గుండె పనిచేయక అంతిమ శ్వాస వదిలిన మల్లి మస్తాన్ బాబు మృతదేహాన్ని గుర్తించారు. దీంతో యావత్ భారతదేశం శోకసంద్రంలో మునిగిపోయింది. సాహస ప్రపంచం ఓ గొప్ప సాహసికుడిని కోల్పోయింది. యావత్ ప్రపంచం ఈ సాహాస వీరుడికి సెల్యూట్ చేస్తుంది.

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...