అబద్ధపు ప్రచారం
ఎర్ర కోట లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం భారత ప్రభుత్వం10 లక్షల అద్దె చెల్లించింది!
ఈ అబద్ధపు ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
******************
నిజమేమిటో తెలుసుకుందామా?
2018 April 18
ప్రధాని శ్రీ నరేంద్ర మోడీజీ ఒక పిలుపుని ఇచ్చారు!
'Adopt A Heritage' Scheme.
దేశంలోని ప్రధాన చారిత్రిక కట్టడాలని దత్తత తీసుకోవాలని!
ప్రధాని మోదీజీ పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ సంస్థలు, ధనికులు అయిన వారు వ్యక్తిగతంగా దత్తత తీసుకోవచ్చని ప్రకటన చేశారు.
*********************
చారిత్రిక కట్టడాలని దత్తత తీసుకోవడం అంటే స్వంతం చేసుకోవడం కాదు!
*********************
జంతు ప్రదర్శనశాలలో ఉండే జంతువులను దత్తత ఇస్తారు ఎవరన్నా ముందుకు వస్తే. ఒకసారి దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చిన వారితో ఆయా జంతు ప్రదర్శన శాలలు అగ్రిమెంట్ చేసుకున్నాక సదరు వ్యక్తి తాను దత్తత తీసుకున్న జంతువు కి రోజూ ఎంత ఆహారం అవసరమో దానికి అయ్యే ఖర్చుని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఏదన్నా జబ్బు చేస్తే దానికి అయ్యే ఖర్చుని భరించాల్సి ఉంటుంది. అలా అని ఆ జంతువు దత్తత తీసుకున్న వారి స్వంతం అవ్వదు.
**********************
అలాగే పారిశ్రామిక వేత్తలు, సినీ నటులు గ్రామాలని దత్తత తీసుకొని రోడ్లు వేయడం, మంచినీటి వసతి కల్పించడం, హాస్పిటల్స్ కట్టించడం లాంటివి చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ వాళ్ళ స్వంత డబ్బుతోనే చేసారు, చేస్తున్నారు. కానీ ఆయా దత్తత గ్రామాలు దత్తత తీసుకున్న వారి స్వంతం అయిపోయాయా? లేదే!
************************
అలాగే ఎర్ర కోటతో పాటు దేశంలోని వివిధ చారిత్రిక కట్టడాలని దత్తత ఇవ్వడానికి పిలుపుని ఇచ్చారు ప్రధాని. అయితే పలు పారిశ్రామిక సంస్థలు దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చాయి. వీళ్ళలో అర్హత కలిగిన వాళ్ళతో కేంద్ర టూరిజం శాఖ MoU లు కుదుర్చుకుంది. అవి ఏమిటో చూద్దాం!
************************
IndiGo Airlines, GMR Groups లు పోటీ పడగా దాల్మియా భారత్ లిమిటెడ్ బిడ్ ని దక్కించుకుంది.
5 సంవత్సరాలకు 25 కోట్లు చెల్లించడానికి దాల్మియా గ్రూపు ముందుకు వచ్చింది.
ఎర్రకోటను దాల్మియా భారత్ లిమిటెడ్(Dalmia Bharat Limited) దత్తత తీసుకోవడానికి గర్వంగా భావిస్తున్నామని తన బీఫ్ లో పేర్కొంది. దాల్మియా సంస్థ ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంది కనుక కేంద్ర టూరిజం శాఖ MoU కుదుర్చుకుంది.
దాల్మియా భారత్ లిమిటెడ్ సంస్థ 2018 నుండి ఎర్రకోట ని నిర్వహిస్తున్నది. టూరిస్టు లకి సదుపాయాలు కల్పించడం, నిర్వహణ, సెక్యూరిటీ ని నిర్వహించడం వరకు చూసుకుంటున్నది.
కోర్ ఏరియా ఎదయితే ఉందొ అది భారత ఆర్కియాలజీ సంస్థ అధీనంలోనే ఉంటుంది. అక్కడికి ఎవరికీ ప్రవేశం ఉండదు.
దాల్మియా భారత్ లిమిటెడ్ సంస్థ నిర్వహణ చేస్తున్నది కేవలం నో లాస్, నో ప్రాఫిట్ సిద్ధాంతం మీదనే!
ఇక రెడ్ ఫోర్ట్ ని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఉపయోస్తున్న సంగతి తెలిసిందే! ఈ వేడుకలు జరుపుకోవడానికి అద్దె చెల్లించడం అనేది హాస్యాస్పదం!
MoU లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి దాల్మియా గ్రూపుకి ఎటువంటి చెల్లింపులు జరపబడవు అని.
అయినా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరపడానికి దాల్మియా భారత్ లిమిటెడ్ 10 లక్షలు ఖర్చు పెట్టలేని స్థితిలో ఉందా?
తన పేరులో ఇండియా కాకుండా భారత్ అని పెట్టుకున్న దాల్మియా గ్రూపు అడిగితే10 కోట్లు ఖర్చుపెట్టగలదు సంతోషంగా!
లాభాలు ఆర్జించడానికి దాల్మియా గ్రూపు వేరే వ్యాపారాలు ఉన్నాయి కానీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరపడానికి ప్రభుత్వం నుంచి10 లక్షలు తీసుకుంటుందా?
ఆగస్టు నెల కి రెండు వారాల ముందే ప్రధాని భద్రతను చూసే SSG ఎర్రకోటను తన ఆధీనంలోకి తీసుకుంటుంది.
ప్రధాని వచ్చి వెళ్లే దారిని మూసివేస్తుంది!ఆ పరిసర ప్రాంతాలలోకి ఎవరినీ అనుమతించదు SSG.అంటే దీనర్థం ఎర్రకోట 30 రోజుల పాటు SSG ఆధీనంలో ఉంటే కేవలం 10 లక్షల అద్దె కట్టిందా ప్రభుత్వo? మరీ అంత చవకగా ఉందా? కనీసం10 కోట్లు అని అబద్ధం ఆడినా అతికినట్లుగా ఉండేది!
**********************
2022 May లో The Wire జర్నలిస్ట్ రెడ్ ఫోర్ట్ ని దాల్మియా గ్రూపుకి అమ్మేశాడు మోడీజీ అని అబద్ధాన్ని వ్రాశాడు. ఈ శుంఠ కి దత్తత కి ఓనర్ కి తేడా తెలియదు. 5 సంవత్సరాల కాంట్రాక్ట్ ముగియగానే మళ్ళీ ఎవరు ఎక్కువకి బిడ్ వేస్తే వాళ్లకి దత్తత హక్కులు వస్తాయి.
**********************
2018 లో ఖంగ్రెస్, TMC, AAP, వామ పక్షాలు మోదీజీ దేశాన్ని అమ్మేస్తున్నాడు అంటూ గగ్గోలు పెట్టాయి. దానికి కొంచెం మసాలా జోడించి THE WIRE లాంటి వెబ్ న్యూస్ పోర్టుల్స్ అబద్ధాలని వండి వార్చాయి!
**********************
కాంగ్రెస్ చేస్తే శృంగారం-బిజెపి చేస్తే వ్యభిచారం!
2013 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు?
మరి దీనిని ఏమంటారు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురాతత్వ శాఖ-Agha Khan Trust for Culture (AKTC),Quli Qutub Shah Urban Development Authority, Agakhan Foundation ల మధ్య 2013 లో 10 సంవత్సరాలకి గాను MoU చేసుకున్నాయి.
కుతుబ్ షా సమాధులని నిర్వహించడానికి పైన పేర్కొన్న పబ్లిక్, ప్రయివేట్ సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. మరి కుతుబ్ షా సమాధులని అమ్మేసిందా అప్పటి కాంగ్రస్ ప్రభుత్వం?
************************
ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా లో ఉన్న గండికోట లో రిసార్ట్స్ ని నిర్వహిస్తున్నన్నది ప్రయివేట్ సంస్థలు. మరి ఆ టూరిస్ట్ కేంద్రాన్ని అమ్మేసినట్లా?
***********************
రెడ్ ఫోర్ట్ MoU లో ఉన్న ముఖ్యమయిన అంశం ఏమిటంటే రెడ్ ఫోర్ట్ నుండి టికెట్ల అమ్మకాల ద్వారా మరియు ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఢిల్లీలోని స్టేట్ బాంక్ లో జాయింట్ అకౌంట్ లో జమ చేస్తారు. ASI, టూరిజం, దాల్మియా గ్రూపు ఈ మూడింటి పేరున అకౌంట్ ఉంది. వచ్చిన ఆదాయాన్ని అభివృద్ధి పనులకి వాడుతారు తప్పితే ఎవరి జేబుల్లోకి వెళ్ళదు.
************************
ఇలాంటి దుష్ప్రచారాలని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర బిజెపి IT సెల్ లది కాదా?
ఇలాంటి పుకార్లు సోషల్ మీడియాలలో వైరల్ అవుతున్న ట్లు తెలియదా?
ఇప్పటికే కర్ణాటక పోయింది.తెలంగాణా లో ఎదో అద్భుతం జరిగితే తప్పితే అధికారంలోకి రావడం కష్టం!
*********************(
గత కొద్ది నెలలుగా బీజేపీ మద్దతు దారులు జాతీయ, రాష్ట్ర స్థాయిలో సోషల్ మీడియా లో చురుకుగా ఉండేవారు బిజెపి కి వ్యతిరేకంగా వ్రాస్తున్నారు. ఎందుకని?
పెద్దలు ఆలోచించాలి!
ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ కాంగ్రెస్ ఖర్చు పెడుతున్నది. బీజేపీ నాయకత్వం ఉదాసీనంగా ఉంది. దేశభక్తి ఉన్నా కడుపు కాల్చుకొని ఎల్లకాలం ఎవరూ బీజేపీ కి మద్దతు గా వ్రాయరు. ఇప్పటికే చాలామంది వెళ్లిపోయారు.
2024 కి ఇంకా చాలామంది వెళ్ళిపోతారు!
అందుకే గత కొద్ది కాలంగా ఒకదాని తరువాత ఇంకోటి అసత్య ప్రచారాలు ఎక్కువయ్యాయి.
సరే! అసత్య ప్రచారాలు ఖండించడానికి పార్టీ తరుపున ఎవరో ఒకరు స్పందించి వివరించకపోతే కర్ణాటక ఫలితాలు పునరావృతం అవుతాయి.
మనకి పార్టీ అధ్యక్షుల విషయంలోనే ఏకాభిప్రాయం లేదు ఇక గెలుపు విషయం గురుంచి ఎంత తక్కువ మాట్లాడుకుంటె అంత మంచిది.
*********************
ఇంత కాలం బీజేపీ కి సోషల్ మీడియా స్వచ్చంద కార్యకర్తలు అండగా ఉన్నారు కానీ స్వచ్చందం అనేది పోయి డబ్బుకు అమ్ముడుపోతున్నారు.
ఎవరి సమస్యలు వాళ్ళవి.
అమెరికా, చైనాలు వందల కోట్ల డబ్బుని వేదజల్లుతున్నాయి బాగా వ్రాయగల వాళ్ళకి.
2024 వచ్చేసరికి మరింత వేగం పుంజుకుంటుంది.
వాళ్ళు ఎలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారో తెలుసుకొని కౌంటర్ ఇచ్చే లోపలే మరో పుకారు పుట్టిస్తారు.
కర్ణాటకలో జరిగింది అదే!
మోదీజీ ని చూపించి అసెంబ్లీ, పార్లమెంట్ లకి పోటీ చేసే బీజేపీ అభ్యర్థులకు ప్రమాదం పొంచి ఉంది .
ఇప్పటికి రెండు సార్లు మోదీజీ ని చూసే ఓట్లు వేశారు.
2024 లో అలా జరగదు.
మోదీజీ గెలుస్తారు!
కాకపోతే వాజపేయి గారిలా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
తస్మాత్ జాగ్రత్త!
జైహింద్!