శ్రీ కార్య సిద్ది వినాయక దేవాలయం...చోడవరం
విశాఖజిల్లా చోడవరం లోని వెలసిన గణపతి దేవాలయంకి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది.
చోడవరానికి తూర్పు ముఖంలో వున్న ఈ ఆలయాన్ని 600 సంవత్సరాల క్రితం మత్స్యవంశపు రాజులు నిర్మించినట్లు చెబుతారు.
ఈ ఆలయంలో గర్భగుడి ద్వారంపైనా తలపైభాగంలో చేప చిహ్నాలు ఉండడంతో దీనిని మత్స్యగణపతిగా పేర్కొంటారు.
శ్రీ గౌరీశ్వరుడు, మత్స్యవంశంపు రాజు కలలో కనిపించి చోడవరం కోట వున్న చోట తవ్వకాలు జరిపించగా చుట్టూ గంగాజలంతో కూడిన శివలింగం బయల్పడటంలో అక్కడే ఆలయ నిర్మాణం చేశారు.
ఆలయ మండపంలోని నాలుగు స్తంభాలు నంది విగ్రహం సింహాచల దేవస్థానం శిల్పకళను పోలి వుండటం కూడా మత్స్య వంశీయులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు భావించడానికి మరో కారణం.
ఆంధ్ర రాష్ట్రంలో స్వయంభూ విఘ్నేశ్వరాలయాలు ఉన్న క్షేత్రాలు రెండే రెండు. ఒకటి చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఉండగా రెండవది విశాఖ జిల్లా చోడవరంలో ఉంది.
సుమారు 200 సంవత్సరాల నుంచి స్వయంభూ విఘ్నేశ్వరుని దేవాలయంలో పూజలు జరుగుతున్నాయి.
ఇక్కడి విఘ్నేశ్వరుని విగ్రహము నడుము పై భాగము మాత్రమే దర్శనమిస్తుంది. తొండం చివరి భాగం పైకి కనిపించదు. ఈ విగ్రహం ఏటేటా పెరుగుతుందని ప్రతీతి.
.