Monday, 1 May 2023

 జులియన్ వాలాబాగ్ దురంతం

భారత స్వాతంత్ర సంగ్రామంలో మలుపు తిప్పిన జులియన్ వాలాబాగ్ దురంతం జరిగినటువంటి పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ వద్ద జలియన్ వాలాబాగ్ అనే ప్రదేశాన్ని ఈరోజు నేను సందర్శించడం జరిగింది. ఆనాటి దుర్ఘటనను ఒకసారి మననం చేసుకుందాం.




1919 ఏప్రిల్ 13న పంజాబ్ లెఫ్ట్నెంట్ జనరల్ డయ్యర్ అనే ఆంగ్లేయ అధికారి నిర్వహించినటువంటి వికృత చర్య పర్యవసానంగా సుమారు 400 మంది పైచిలుకు ప్రాణాలు పోవడం, వేలాది మందికి బుల్లెట్లు గాయాలు తగలడం, తదనంతరం ఈ ఉదంతం నాడు దేశవ్యాప్తంగా ఉద్యమ రూపం దాల్చింది. జూలియన్ వాలాబాగ్ ఉదంతానికి ప్రేరణ అప్పటి స్వాతంత్రోద్యమం సందర్భంగా బ్రిటిష్ ప్రభుత్వం రౌలత్ చట్టమును తీసుకురావడం జరిగింది. ఈ చట్టం లో చెప్పబడింది ఏమిటంటే, ఏ వ్యక్తి అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారిని ఎలాంటి కారణం లేకుండా దేశద్రోహం నేరం కింద ఎలాంటి విచారణ కూడా లేకుండా అరెస్టు చేయవచ్చు. ఈ చట్టాన్ని నిరసిస్తూ గాంధీ గారు, స్వాతంత్రోద్యమ నాయకులు పిలుపుమేరకు పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లోని జూలియన్వాలాబాగ్ అనే ప్రాంతంలో కొంత మంది జనం గుమికూడి శాంతి యుతం గా తమ నిరసనను వ్యక్తం చేయుచుండగా, అక్కడి లెఫ్ట్నెంట్ జనరల్ డయ్యర్ వెంటనే వందలాది మంది సైనికులను అక్కడికి పంపి వారి మీద విచక్షణారహితంగా కాల్పులు జరపగా సుమారు 400 మంది చనిపోగా, వందలాదిమంది గాయపడ్డారు. 150 మందికి పైగా ఎటు వెళ్లడానికి అవకాశం లేక అక్కడే ఉన్న పెద్ద బావిలో పడి చనిపోయారు. (ఈ పోస్టులో పెట్టిన ఫోటోలు, వీడియోలును పరిశీలించినట్లయితే అప్పటి కాల్పుల్లో బుల్లెట్లు తగిలి కన్నాలు పడ్డ గోడలను, బావిని చూడవచ్చు) ఈ సంఘటన దేశవ్యాప్తంగా ప్రజల ఆందోళనలకు దారితీసింది.
ఉద్దాంసింగ్
ఈ ఉదంతంలో ఉద్ధం సింగ్ అనే 19 సంవత్సరాల యువకుడి తల్లిదండ్రులు కూడా కాల్పుల్లో మరణించారు. తల్లిదండ్రుల మరణాన్ని ప్రత్యక్షంగా చూసిన ఉద్ధాంసింగ్ చలించిపోయి ప్రతీకారం తీర్చుకోవడానికి నిర్ణయించాడు. తర్వాత రోజుల్లో ఇంగ్లండ్ వెళ్లి డయ్యర్ కు దగ్గరై అతని రోజువారి దినచర్యలన్నీ తెలుసుకున్నాడు. 1940 మార్చి 13వ తేదీన లండన్ లోని క్యాక్టన్ హాల్లో సమావేశానికి డయ్యర్ హాజరవుతారని ఉద్ధాంసింగ్ తెలుసుకొని పుస్తకం మధ్యలో కనపడకుండా తుపాకీ ని పెట్టుకొని లోపలికి వెళ్లి డయ్యర్ ను కాల్చి చంపాడు. చంపిన తర్వాత ఉద్ధాంసింగ్ పారిపోకుండా అక్కడే ఉండి కోర్టు విచారణలో పాల్గొని డయ్యర్ ను చంపినందుకు తాను గర్వపడుతున్నట్లు చెప్పాడు. ఉరిశిక్షకు ముందు "నాలాంటివారు భారతదేశంలో ఎంతో మంది ఉన్నారు . బ్రిటిష్ వారు భారతీయులను బానిసలుగా చూడడం సహించరాని విషయం. నా దేశానికి నేను సేవ చేయడానికి ఉరికంభాన్ని అయినా నేను సంతోషంగా స్వీకరిస్తాను." అని అన్నాడు. 1940 జూలై 31వ తేదీన ఉద్దాంసింగ్ ఉరితీయ బడ్డాడు.
ఉద్ధాంసింగ్ యువకుడిగా ఉండి ఆ రోజుల్లో ఇంగ్లండ్ వెళ్లి డయ్యర్ పై ప్రతీకార చర్య తీసుకోవడం అనేది ఎంతో సాహసోపేతమైనది. ఆ విధంగా అనేకమంది బలిదాన ఫలితమే తరువాత రోజుల్లో మనం అనుభవిస్తున్న స్వాతంత్రం. 1995లో ప్రభుత్వం ఉత్తరాఖండ్లో ఒక జిల్లాకు "ఉద్ధంసింగ్ నగర్" అని అతని పేరు పెట్టారు.
ఈ సందర్భంగా ఉద్ధాంసింగ్ ను తలుచుకుంటూ మరెంతోమంది ఆ రోజు జలియన్ వాలా బాగ్ దురాగతంలో చనిపోయిన వారికి నివాళులు..

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...