బంకించంద్ర ఛటర్జీ
వందేమాతరం’ గేయ రచయిత,నవలా రచయిత, కవి మరియు పాత్రికేయుడు
బంకించంద్ర ఛటర్జీ గారివర్థంతి సందర్భంగా...
#బెంగాలీలో సాహిత్యంలో "#సాహిత్య చక్రవర్తి"అని పిలవబడే బంకించంద్ర ఛటర్జీ. బెంగాల్‌లో #మొదటగా బి.ఏ డిగ్రీ పొందిన వ్యక్తి ఈయనే కావడం విశేషం. తండ్రివలెనే ఈయన కూడా డిప్యూటీ #కలెక్టరయ్యాడు. స్వస్థాన వేష భాషల పట్ల గౌరవాభిమానాలు కలవాడు. ఇరవై ఏళ్ళు నిండకముందే ‘లలిత ఓ మానస్’ అనే కవితా సంపుటి రచించాడు. దుర్గేశ్ నందిని, కపాలకుండల, మృణాళిని, దేవీ చౌధురాణి మొ దలైన 15 #నవలలు రాశాడు. దేశాన్ని మాతృమూర్తిగా సంబో ధిస్తూ... దేశభక్తిని ప్రబోధిస్తూ... ‘#వందేమాతరం’ గేయం రాసిన తర్వాత దానిని ‘ఆనంద్‌మఠ్’ నవలలో పొందుపరిచాడు. ఈ నవల వివిధ భారతీయ భాషలలో నికి అనువదించబడడం వలన ఈ గేయం దేశవ్యాప్తంగా ప్రచా రాన్ని పొందింది. ఈ గేయాన్ని బహిరంగంగా గానం చేయటాన్ని నాటి ప్రభు త్వం నిషేధించింది. ఈ గేయానికి #రవీంద్రుడు బాణీకట్టి నిషేధాజ్ఞలను ఉల్లంఘించి 1896 కాంగ్రెస్ సభలలో గానం చేశాడట.
బంకించంద్ర ఛటర్జీ (27 జూన్, 1838 -
8 ఏప్రిల్, 1894) బంకించంద్ర ఛటోపాధ్యాయ). 'ఛటోపాధ్యాయ్' కు బ్రిటిష్ వారు పలకలేక 'ఛటర్జీ' అని పిలువసాగారు. బ్రిటిష్ వారిని అనుకరిస్తూ ప్రపంచంకూడా 'ఛటర్జీ' అని పిలవడం ప్రారంభించింది. ఇతను బెంగాలీ కవి, వ్యాసరచయిత, సంపాదకుడు.
#వందేమాతరం:
ఇతని రచన వందేమాతరం ఇతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇతను వ్రాసిన ఆనంద్ మఠ్ అనే నవలనుండి ఈ గీతాన్ని సంగ్రహించారు. ఈ గీతం భారత స్వతంత్ర సంగ్రామంలో సమరశంఖంగా పనిచేసింది.మొదట సంస్కృతంలో , భారతదేశాన్ని మాతృదేవతగా వ్యక్తీకరించి స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో కార్యకర్తలను ప్రేరేపించాడు
#ఆనంద్ మఠ్:
ఆనందమఠ్ (ది అబ్బే ఆఫ్ బ్లిస్, 1882) ఒక రాజకీయ నవల, ఇది బ్రిటీష్ బలంతో పోరాడుతున్న సన్యాసి సైన్యాన్ని వర్ణిస్తుంది. ఈ పుస్తకం భారతీయ జాతీయవాదం పెరగాలని పిలుపునిచ్చింది. రవీంద్రనాథ్ ఠాగూర్ సంగీతానికి సెట్ చేసిన వందే మాతరం (ఆమె నిజంగా నా తల్లి కాబట్టి నేను నా మాతృభూమిని ఆరాధిస్తాను) పాటకు ఈ నవల మూలం. ఆనంద మఠంలో ఆయన చిత్రించిన పాత్రలు ఎటువంటి త్యాగానికైన, సాహసానికైన ప్రతీకలుగా ఉన్నాయి. ఇది చాలా మంది భారతీయ #జాతీయవాదులు ప్రేరణ గా తీసుకున్నారు.
#సాహిత్య సేవ:
నవలా రచనలో ఆయన సృస్టించే సంఘటనలు చదివేవారిని అమితమైన ఉత్కంఠకు లోను చెస్తాయి. ఇతివృత్త నిర్వహణలో, సన్నివేస పరికల్పనలో ఆయన సృజనసక్తి, ఆయన ప్రజ్ఞ, ఆయన ప్రతిభ అసదృశమైనవి. ఆయన నవలలు చదువుతుంటే రమణీయ లోకాలలో సంచరిస్తున్న సాహిత్యానుభవం కలుగుతుంది పాఠకులకు. గంధర్వలోకాలలో విహరింపచేస్తాయి ఆయన భావలు. అట్లా అని కేవలం కాల్పనిక జగత్తు అనుకోకూడదు ఆయన సాహిత్య స్రుష్తిని. ఆకాశంలో మబ్బుల గుంపులోను, శతాభ్దాల కింద కట్టిన అతి విశాల గంభీరమైన కోటనొ, విశాల వినీల సముద్రతీరాన్నో చూసిన మానవుడికి ఏ ఊహాజగత్తు సాక్షాత్కారమవుతుందో బంకించంద్ర చట్టొపాధ్యాయ రచనలు, ముఖ్యంగా నవలలు అటువంటి మానసికోత్తేజాన్నీ కలగజెస్తాయి.
#జాతిని ఉత్తేజపరిచిన ధేశభక్తి గీతం:
#ఆధునిక భారతీయ సాహిత్య చరిత్రలో బంకించంద్ర చటర్జీ అగ్రగణ్యుడు.ఒక్క బెంగలీ సాహిత్యాన్నే కాక సమస్త భారతీయ సాహిత్యాలను ఆయన పంతొమిదో శతాబ్ది ఉత్తరార్దంలో, ఇరవయ్యో పూర్వార్దంలో అంటే సుమారు ఒక శతాబ్దం పాటు ప్రభావితం చేసాడు. పూర్వకలంలో కాని, ఇటీవల కాలంలో కాని ప్రపంచ సాహిత్య చరిత్రలో జాతుల విముక్తి పోరాటాలలో, స్వాతంత్ర్య సమర చరిత్రలో ఒక మహా కవి రచించిన #ధేశభక్తి గీతం తన జాతి జనులను ఉత్తేజపరిచి, ఉద్యమింపచేసిన సంఘటన, బంకించంద్రుడి విషయంలో లాగ మరొక దేశంలో, మరొక దేశ స్వతత్ర్యోద్యమంలో సంభవించలేదు.
#సృజనాత్మక సంవేదన:
భారతదేశ స్వతత్ర్యోద్యమం ఒక నిర్ణాయక ఫలసిద్ధి దిశగా చైతన్యవంతమవుతున్నప్పుడు వందేమాతరం గీతం దాని వేగాన్ని త్వరితం చేసింది వంగదేశంలో కొందరు సాహిత్య విమర్శకులు, ఆదునిక కాలంలో బకించంద్రుడి వంటి నవలా రచయిత ఇంకొకరు లేరంటారు.ఆయన సృష్టించిన పాత్రలు కాల్పనిక సాహిత్యనికి చెందినవే ఆయిన సృజనాత్మక సంవేదనలలో ఆయనకాయనే సాటి అని ఆ సాహిత్య విమర్శకుల అభిప్రాయం.
#గుర్తించదగిన రచనలు:
దుర్గేష్నందిని,
కపల్కుండల,
దేవి చౌధురానీ,
ఆనంద మఠం,
" విశాబ్రిక్ష "
"వందే మాతరం " మొదలైనవి.
#సవ్వసాచి:
#బంకీమ్ చంద్ర తన రెండు చేతుల్లోనూ సమాన బలం కలిగి ఉన్నాడు, అతను నిజమైన సవ్వసాచి. ఒక చేత్తో, అతను సాహిత్య రచనలను సృష్టించాడు; మరొకటి యువ మరియు ఔత్సాహిక రచయితలకు మార్గనిర్దేశం చేశాడు. ఒక చేత్తో, సాహిత్య జ్ఞానోదయం యొక్క కాంతి; మరియు మరొకటి, అతను అజ్ఞానం యొక్క పొగ మరియు బూడిదను మరియు చెడు గర్భం ధరించిన భావనలను పేల్చివేసాడు ” అంటారు రవీంద్రనాథ్ ఠాగూర్.
#మానవుడు చేరుకోగల ఉదాత్త శిఖరాలను బంకించంద్రుడి పాత్రలు అధిరోహిస్తాయి. అనూహ్యమైన, మానవాతీతమైన త్యాగాన్ని అయన పాత్రలు ప్రకటిస్తాయి. బంకించంద్రుడిలో మాతృ దేశాభిమానం, దేశ భక్తి అనంతం, అపూర్వం.
ఆయన సాహిత్య ప్రతిభ #బహుముఖమైనది.నవలలు, వ్యాసరచన, సాహిత్య విమర్శ, వ్యాఖ్యాన రచనలో బంకించంద్రచటర్జీ వంగ సాహిత్యంలో కొత్త వరవడి సృష్టించాడు. నవలా రచనలో తక్కిన ఆధునిక భారతీయ సాహిత్యాలకు కూడా ఆయనే దారిచూపాడు.