Friday 24 February 2023

 వందే భారత్ రైలు – పాకిస్థాన్ ప్రేమికులు !

మాకు తాగడానికి గంజి దొరకటం లేదు

మీరు పరమాన్నం తింటూ ఉంటే 

మేం చూస్తూ ఊరుకుంటామా???

వందే భారత్ ట్రైన్ మీద రాళ్ళు రువ్వడం వెనుక ఉన్న అసలు కారణం !

1947 లో భారత్ నుండి పాకిస్థాన్ వేరుపడిన సందర్భంలో అప్పటికే బ్రిటీష్ వాళ్ళు వేసిన రైల్వే లైన్లు,కట్టిన రైల్వే స్టేషన్లు భారత ఉప ఖండం మొత్తం మీద ఎలా ఉన్నాయో వాటిని సరిహద్దుల ప్రకారం పంచుకున్నాయి! ఇది చరిత్ర అందరికీ తెలిసిందే !PSP

1947 తరువాత భారత్ లో కానీ పాకిస్థాన్ లో కానీ చాల కాలం వరకు ఉన్న ట్రాక్లు,స్టేషన్లని అలానే వాడుకున్నారు తప్పితే వాటి మీద పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేసింది లేదు. బొగ్గు మండించడం వలన వచ్చిన ఆవిరితో నడిచే ఇంజిన్లు చాలా కాలం రెండు దేశాలలో నడిచాయి. కానీ 1957 లో అమెరికా నుండి ఆల్కొ [AALCO] నుండి డీజిల్ ఇంజిన్ కొన్నది మన ప్రభుత్వం. కానీ పాకిస్థాన్ లో మన కంటే ముందే అంటే 1953 లోనె ఆల్కొ నుండి డీజిల్ ఇంజిన్ కొని నడపడం మొదలుపెట్టింది !

*****************************

క్రమంగా సైన్యం మీద ఎక్కువ ఖర్చు పెడుతూ రైల్వే ని పట్టించుకొకపోవడం తో పాకిస్థాన్ రైల్వే వెనకబాట పట్టింది. మొదట్లో కొత్త డీజిల్ ఇంజిన్లు కొన్నా రాను రాను ఆర్ధికంగా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన అమెరికా మరియు యూరోపు దేశాలనుండి సెకెండ్ హాండ్ డీజిల్ ఇంజిన్లు కొనడం మొదలుపెట్టింది. అయితే వాటి స్పేర్ పార్టు ల ఖరీదు ఎక్కువగా ఉండడం తో డాలర్ రూపం లో చెల్లింపులు జరపలేక క్రమంగా చైనా నుండి కొనడం మొదలుపెట్టింది. 

2012 లో మన దేశం నుండి 50 డీజిల్ ఇంజిన్ల ని పాకిస్థాన్ కొన్నది కానీ వీటిలో కొన్ని లీజు పద్ధతిలో తీసుకున్నది మరికొన్ని కొన్నది. ఈ అగ్రిమెంట్ కోసం కనీసం మూడేళ్లు పట్టింది. 2012 లో మన దేశం నుండి 50 డీజిల్ ఇంజిన్లు కొనడానికి,లీజుకి తీసుకోవడానికి కారణం అప్పటికే పాక్ రైల్వే ఇంజిన్ల కొరతతో సగానికి సగం రైళ్లని నడిపే స్థితిలో లేకపోవడం వలన గత్యంతరం లేక మన దేశ సహాయం కోసం అర్ధించింది. ముంబై దాడుల నేపధ్యంలో దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతాయనే భయంతో UPA2 ప్రభుత్వం పాకిస్థాన్ అడిగిన వెంటనే అగ్రిమెంట్ చేయడానికి వెనకాడింది అప్పట్లో కానీ ఒత్తిడి ఎక్కువ అవడం తో చివరికి 50 డీజిల్ ఇంజిన్ల ఒప్పందంకి అనుమతి ఇచ్చింది మన్మోహన్ ప్రభుత్వం !

**********************************

మరో వైపు డీజిల్,పెట్రోల్ లాంటివి దిగుమతి చేసుకోవడం అంటే డాలర్ల రూపంలో చెల్లింపులు జరపాలి కాబట్టి డీజిల్ ఇంజిన్ల స్థానంలో ఎలెక్ట్రిక్ లోకో ని తీసుకొస్తే డీజిల్ ఆదా అవుతుంది అనే ఆలోచనతో తమ రైల్వే రైన్ల ని విద్యుతీకరణ చేయాలాని నిర్ణయం తీసుకొని రైల్వే ట్రాక్ ల మీద ఓవర్ హెడ్ ఎలెక్ట్రిక్ తీగలని వాటికి కావాల్సిన ఎలెక్ట్రిక్ పోల్స్ ని కాట్టలనే నెపంతో డానికి కావలసిన రాగి తీగలని చైనా నుండి దిగుమతి చేసుకుంది పెద్ద మొత్తం లో. 

2008 లో మొదటగా లాహోర్ నుండి ఖవేవాల్ జంక్షన్ వరకు అంటే 286 కిలోమీటర్ల దూరం వరకు విద్యుతీకరణ చేసి ప్రయోగాత్మకంగా ఎలెక్ట్రిక్ రైళ్లని నడపాలి అని నిర్ణయించారు.

మహమ్మద్ ఖస్ఖేలి, పాకిస్తాన్ రైల్వే లో మెకానికల్ ఇంజినీర్ ట్రిబ్యూన్ పత్రికకి 2009 లో ఇంటర్వ్యూ ఇచ్చాడు: మేము ప్రయోగాత్మకంగా ఎలెక్ట్రిక్ రైళ్లని నడపాలి అనుకోని ముందు లాహోర్ నుండి ఖనెవాల్ జంక్షన్ వరకు 286 కిలోమీటర్ల వరకు విద్యుతీకరణ చేయాలని కాపర్ వైర్ ని చైనా నుండి దిగుమతి చేసుకున్నాము. ముందు ఖానేవాల్ నుండి సాహెవాల్ స్టేషన్ వరకు పూర్తి చేసి కొన్ని ప్రయాణీకుల ఎక్స్ప్రెస్ రైళ్లని నడిపాము. అంతా బాగుంది అనుకునే లోపల ఖానేవాల్, సోహే వాల్ స్టేషన్ల మధ్య 25 Kv విద్యుత్ ప్రసరిస్తున్న ఓవర్ హెడ్ కాపర్ కండక్టర్ ని ఎవరో దొంగతనం చేశారు. దాంతో కొత్త కాపర్ కండక్టర్ కోసం దిగుమతి చేసుకొని గోడౌన్ లలో భద్రపరిచిన 2 టన్నుల కాపర్ బండిల్ ని తీసుకురావడానికి ప్రయత్నించగా దానిని కూడా దొంగతనం చేశారు. పోలీసులు కాపలాగా ఉన్నా అవి ఎట్లా మాయం అయ్యాయో తెలియదు. ఇలా వరుసగా కాపర్ కండక్టర్ చోరీకి గురి కావడం సాధారణం అయిపోవడంతో మళ్ళీ మళ్ళీ కొనలేక చివరకి ఎలెక్ట్రిక్ రైళ్లని రద్దు చేసింది ప్రభుత్వం 2009 లో!

******************************

ఇక్కడ విచిత్రం ఏమిటంటే 25 వేల వోల్టుల విద్యుత్ ప్రవహిస్తున్న కాపర్ కండక్టర్ ని ఎలా దొంగిలించగలిగారు ? పైగా అది రైల్వే ట్రాక్ మీద చాలా ఎత్తులో ఉంటుంది కూడా ! మొత్తం 3 నుండి 5 టన్నుల కాపర్ కండక్టర్ చోరీ అవడం తో మిగిలిన కాపర్ కండక్టర్ ని వేలం వేసి అమ్మేసింది పాక్ రైల్వే !

********************************

అప్పటికే దిగుమతి చేసుకున్న 16 ఎలెక్ట్రిక్ ఇంజిన్లని షెడ్డు కే పరిమితం చేయాల్సి వచ్చింది. ఎలెక్ట్రిక్ ట్రైన్ కోసం కొత్తగా 77 మందిని రిక్రూట్ చేసుకుంది పాక్ రైల్వే ! దాదాపుగా మూడేళ్లు వాళ్ళకి కూర్చోపెట్టి మరీ జీతాలు ఇవ్వాల్సి వచ్చింది. 2012 లో మన దేశం నుండి 50 డీజిల్ ఇంజిన్ల ఒప్పందం కుదిరాక పాకిస్థాన్ లో రైళ్లు పూర్తి స్థాయిలో తిరగడం మొదలుపెట్టాయి మళ్ళీ ! ఇక్కడితో అయిపోలేదు పాకిస్థాన్ రైల్వే కష్టాలు. అధునాతన బోగీలు అని చెప్పి చైనా పాకిస్థాన్ కి 300 ల కొత్త బోగీలు అంటకట్టింది ! అవి ఎక్కువలో ఎక్కువగా గంటకి 120 km వేగంతో ప్రయాణించగలవు అని చెప్పింది చైనా ! తీరా అవి పాకిస్థాన్ కి వచ్చి తిరిగిన మూడు నెలలకే చక్రాలు విపరీతంగా వేడెక్కి పోతుండడం తో వాటి వేగాన్ని గంటకి 60 km వేగంతో నడపాల్సి వస్తున్నది. డబ్బూ పోయే శని పట్టే !

********************

పాకిస్థాన్ లో అంతకంతకూ పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం వలన నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో వందే భారత్ ఎక్స్ప్రెస్స్ అనబడే సెమీ హై స్పీడ్ రైలు వీడియొ లు PoK లో మొబైల్ ఫోన్ల లో కనపడం తో అటు నుండి ఇటు,ఇటు నుండి అటు పరస్పర బర్నాల్ పూతలు ఎక్కువ అయ్యాయి. 

దానికి తోడు ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల రాతలని ఉర్దూలోకి అనువదించి వాట్స్అప్ ద్వారా పాకిస్థాన్ పంపించి శు కానందం పొందుతున్నారు బర్నాల్ బ్యాచ్ !

రాళ్ళతో దాడి చేస్తే వందేభారత్ సర్వీసులని ఆపేస్తారని వాళ్ళ భావన ! మరే ! కాపర్ కండక్టర్ ని దొంగతనం చేస్తే ఎలెక్ట్రిక్ ట్రైన్లు ఆపేసినట్లు వందే భారత్ ఆపేస్తారని పిచ్చి ఆలోచన !

ఎప్పుడో మన దేశంలో 1990 వ దశకం మొదట్లో హోండా మోటార్స్ రిలీజ్ చేసిన CD-100 మోటార్ సైకిల్ ని పాకిస్థాన్ లో ఇంకా కొంటున్నారు అదీ 2,50,000/- లకి. ఒక న్యూస్ చానెల్ వాళ్ళు టాటా పంచ్ కారుని చూపెట్టి దీని ధర ఎంత ఉంటుంది అని ఒక యువుకుల గుంపులోకి వెళ్ళి అడిగితే అందరూ ఆ కారుని చూసి ఇది 80 లక్షలు ఉంటుంది అని ఖరాఖండిగా చెప్పేశారు దాంతో సదర్ న్యూస్ యాంకర్ ఇది టాటా పంచ్ కారు ఇండియా లో 6 లక్షలకి అమ్ముతున్నారు అని చెప్తే ఎవరూ నమ్మలేదు. 

******************

అన్నిటికంటే వందే భారత్ ఎక్స్ప్రెస్స్ వీడియొ లు పాకిస్థాన్ లో ఎక్కువగా ట్రెండ్ అయ్యాయి. PoK ప్రజల దృష్టిలో భారత్ పడకుండా చేయాలనే తాపత్రయం ఒక వైపు మరో వైపు భారత్ PoK ని స్వాధీన పరుచుకుంటుంది అనే పుకార్లు ఆందోళన కలిగిస్తున్నాయి అక్కడ ! 

ప్రస్తుతం మళ్ళీ డీజిల్ లోకో ఇంజిన్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నది పాకిస్థాన్ ని ! బాలా కోట్ దాడుల తరువాత పాకిస్థాన్ మన దేశంతో వర్తక,వాణిజ్య సంబంధాల మీద తనకై తానే నిషేధం విధించింది కాబట్టి గడిచిన 5 ఏళ్ల నుండి మన దగ్గర తీసుకున్న డీజిల్ ఇంజిన్ల విడి భాగాలు సప్లై లేక అల్లాడుతున్న నేపధ్యంలో వందే భారత్ పుండు మీద కారం చల్లినట్లు అయ్యింది. 

2023 సెప్టెంబర్ కల్లా మన దేశంలో మొదటి హైడ్రోజెన్ రైలు ట్రయల్ రన్ చేయడానికి యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక హైడ్రోజెన్ రైలు కనుక పట్టాల మీదకి వస్తే మన దేశంలోని పాకిస్థాన్ ప్రేమికుల పరిస్థితి ఎలా ఉండబోతున్నదో ఊహించుకుంటేనే నవ్వు వస్తుంది !

జైహింద్! జై భారత్ ! #🇮🇳దేశం



show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...