కాసింత సరదా
జర హట్
*కాసేపు నవ్వుకోండి. ఆ తర్వాత మన తెలుగు భాష గొప్పదనాన్ని చూసి గర్వపడండి.
*'చచ్చిన' అనే పదాన్నికూడా బ్రతికించే భాష తెలుగుభాష!!
తెలుగువాడికి సాటి ఇంకొకడు లేడు. అందరిదీ ఒక దారైతే మనవాడిది ఇంకోదారి
అందరూ పొగ *పీలిస్తే* తెలుగువాడు పొగ *తాగుతాడు.
-ఇంతేకాదు తెలుగువాడు దెబ్బలు ‘తింటాడు’. దెబ్బలు ఏమైనా తినే పదార్థాలా? అంటే ఉలకడు పలకడు
సంస్కృతం అమరభాష అంటారు. దాని సంగతేమో కానీ తెలుగు మాత్రం కచ్చితంగా అమరభాషే! ఇందుకు ఉదాహరణలు ఉన్నాయి
*ఎవరి మీద అయినా ప్రేమ వచ్చినా, కోపమొచ్చినా ‘సచ్చినోడా’ అని తెలుగువాడు పిలుస్తాడు. ‘సచ్చినోడు’ ఎలా పలుకుతాడని ఆలోచించడు.
*చచ్చినా ఒప్పుకోను అంటాడు. చస్తే ఎలా ఒప్పుకుంటాడు? చచ్చినాక ఒప్పుdకుని చూపించిన వాడు ఒక్కడైనా ఉన్నాడా
*ఆశ చావడం లేదంటాడు. చెట్లకే ప్రాణం ఉందని చెప్పుకుని చావనివాళ్లు ఇంకా ఉన్నారు. అలాంటి వాళ్లు ఆశకు ప్రాణం ఉంటుందని ఎలా ఒప్పుకుని ‘చస్తా’రు
*తెలుగువాడు కంటి చూపుతో చంపేస్తాడు. అతడి శక్తి అలాంటిది
ఇలాంటి అతీత శక్తులు యావత్ ప్రపంచంలో తెలుగువాడికి మాత్రమే ఉన్నాయి
ఎంత గొప్ప! ఎంత చిత్రం
*మత్తు పానీయాలైన సారా, బ్రాందీ, విస్కీలను ‘సేవిస్తున్నా’ నంటాడు. అదే సమయంలో మంచినీళ్లు తాగుతున్నానంటాడు తప్ప సేవిస్తున్నాననడు
ఇదేం చిత్రమో!
*ఇంకా చిత్రమేంటంటే మందు ‘కొడుతున్నా’నంటాడు. కొట్టడానికి మందేమన్నా మనిషా? పశువా
*బాతాఖానీ కొట్టకు అంటాడు. దీని పరిస్థితీ ఇదే
*అనారోగ్యకరమైన నిషా పానీయాన్ని ఆరోగ్యప్రదాయిని అయిన మందు పేరుతో పిలుస్తాడు! అంతా ‘మందే’ అనుకునేవాడు తప్ప ఇంకెవ్వడైనా ఈ పని చేయగలడా
*తెలుగువాడు ఎందులోనైనా ఆటను చూడగలడు. మాట్లాడతానంటాడు. పోట్లాడతానంటాడు
*మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటాడు. మనసు పూర్తిగా కాకుండా అందులో ఏభై శాతమో, డెబ్భైఅయిదు శాతమో ఉంచి కోరుకుంటాడా ఏంటి
ఇంకోమాట
*హృదయపూర్వకంగా అభినందిస్తున్నానంటాడు. కాసేపు హృదయాన్ని పక్కనబెడితే, అభినందించే అవకాశం ఉందా? ఉంటుందా
*తెలుగువాడి ‘న్యాయమే’ వేరు
బడాయి గానీ మాట మాట్లాడితే ‘మనస్సాక్షిగా’ అంటాడు. మనసుకు ఏమన్నా రూపం ఉందా? మాట ఉందా? వచ్చి సాక్ష్యం చెప్పడానికి
*అగ్నిసాక్షిగా పెళ్లాడాను అని కూడా అంటాడు. అగ్ని ఏదో చిటపటలాడుతుంది కానీ ఎవరైనా సంసారంలో చిచ్చుపెడితే అదొచ్చి అడ్డుపడుతుందా ఏంటి
*కళ్లలో నిప్పులు పోసుకుంటున్నాడంటాడు! పోసుకోమనండి చూద్దాం
*పెళ్లికాని ఆడపిల్లను గుండెల మీద కుంపటి అంటాడు. ఇది ఎంత తప్పు! గుండెల మీద కుంపటి పెట్టుకున్న మొనగాళ్లు యావత్ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారా
*మాటేగా ఏదైనా అంటాడు. గుండె మీద బరువు తగ్గించుకున్నానంటాడు. గుండెల మీద బట్టల బరువు తప్ప ఇంకేం బరువు ఉంటుంది
*నవ్వితే నవరత్నాలు రాలతాయంటాడు. రత్నాలా పాడా? మరీ గట్టిగా నవ్వితే పళ్లు రాలిపోతాయేమో! చిటికెలో పని అయిపోతుందంటాడు
*అతిశయం కాకపోతే చిటికె వేస్తే శబ్దం అవుతుంది కానీ పని ఎలా అవుతుంది
*ఒట్టిమాటలు కట్టిపెట్టోయ్ అని గురజాడ చెప్పినా మనవాళ్లు వినరు.
*అప్పు తీసుకునేటప్పుడు ‘నీ డబ్బు వడ్డీతో సహా పువ్వుల్లో పెట్టి ఇస్తా’నంటారు. వడ్డీ ఇస్తే ఇవ్వచ్చుగానీ పువ్వుల్లో పెట్టి ఇచ్చినవాడు ఎవడైనా ఉన్నాడా? ఇది అప్పిచ్చిన పిచ్చివాడి చెవిలో పువ్వు పెట్టడం కాదూ
*ఎవరో చిన్నచూపు చూస్తున్నారని తెలుగువాడు ఆక్షేపిస్తాడు. దూరపు చూపు, దగ్గరి చూపు ఉంటాయి తప్ప చిన్న చూపు, పెద్ద చూపు అని ఎక్కడైనా ఉంటాయా
*వంట చేయడాన్ని చేయి కాల్చుకోవడం అంటాడు. ఇదే నిజమైతే ఆడవాళ్ల చేతులన్నీ ఏమైపోయేవి
*సంగీతమంటే చెవి కోసుకుంటానని ఒక్కొక్కరు వంకర్లు తిరిగిపోతుంటారు. అయితే అతడు ఎంతసేపు పాటలు వింటున్నా కోసుకున్న చెవి కిందపడదే అని నిరాశ పడ్డవాళ్లూ ఉన్నారు.
*తప్పు చేసినవాడు అడ్డంగా దొరికిపోయాడు అంటారు. దొరికినవాడెవడైనా అడ్డంగా దొరుకుతాడా? నిలువుగా దొరుకుతాడు తప్ప
*అన్నట్టు గిట్టనివాణ్ని అడ్డమైనవాడు అని తిడతారు. అదేంటి? దాని భావ మేంటి? పండితార్థం ఏమైనా పిండితార్థం ఒకటుంది
*పశువా అని తిట్టినట్టు. మనుషులు నిలువుగా ఉంటారు. పశువులు అడ్డంగా ఉంటాయి. అదీ సంగతి
*ఎవడి మీదైనా కోపం వస్తే ఏ మొహం పెట్టుకుని వచ్చావంటాడు తెలుగువాడు. ఎవడికైనా ఒకటే ముఖం ఉంటుంది కానీ బ్రహ్మలాగా నాలుగు ముఖాలు, రావణబ్రహ్మలాగా పది ముఖాలు ఉండవు కదా
*ఫలానావాడు తలలు మార్చేరకం అనేది కూడా తెలుగువాడి వాడుక. ఇదెలా సాధ్యం? వినాయక వృత్తాంతంలోలాగా తలలు మార్చేశక్తి సామాన్య మానవులకు ఉంటుందా
*తెలుగువాడు బండ చాకిరీ చేస్తానంటాడు. బండ దాని మొహం! ఎక్కడ పడేస్తే అక్కడే ఉంటుంది కానీ అది చేసే చాకిరీ ఏముంటుంది
*ఏముంది ఎడమ చేత్తో చేస్తానంటాడు. ఎడమ చేత్తో చేసే పనులేంటో అందరికీ తెలుసు. దానితో అన్ని పనులూ అతివేగంగా చేస్తానంటే ఎలా కుదురుతుంది
*అన్నం ఉడకలేదా అంటాడు. ఇదేంటి? ఉడికితే కానీ అన్నం కాదు కదా
*జోకులు పేల్లేదు అంటాడు. జోకు ఏమైనా బాంబా? పేలడానికి
*వీపు విమానం మోత మోగుతుందని అంటాడు. విమానం మోత మోగితే ఆ వీపు అసలు ఉంటుందా? మనిషి అసలు ఉంటాడా
*లేస్తే మనిషిని కానంటాడొకడు. మరి లేచినవాళ్లందరూ ఏంటి? అలాంటప్పుడు కూర్చుని ఉంటేనే మేలు కదా
*శక్తిని కూడా భక్తికి ముడి పెట్టడం తెలుగువాడికి రివాజు
*ఉన్న పూజలు చాలక బడితెపూజ ఒకటి
*జంతువుల్లో కూడా దేవుళ్లను చూసుకుని భారతీయులు ఆరాధిస్తారు. ఇందుకు తెలుగువాడు కూడా మినహాయింపు కాదు. ఎటొచ్చీ మనుషుల్లో జంతువుల్ని చూడటం అతగాడి ప్రత్యేక
*గిట్టనివాళ్లను పంది, కుక్క, గాడిద అని తిట్టే తెలుగువాడు, ఇష్టమైనవాణ్ని పులి, సింహం, గుర్రం అని అభిమానంగా చూస్తాడు. పిలుస్తాడు
*ఏదైనా కళ్లారా చూస్తే తప్ప నమ్మకూడదు. తెలుగు భాష ఇందుకు ఇంపు అయిన మినహాయింపు
*గుండె జారిపోయింది అంటారు. ఇప్పటివరకు ఎవరికైనా జారిపోయిందా? లేదే
*నీ నోరు పడిపోను అని తిట్టిపోస్తారు. ఎవరి నోరు అయినా ఎప్పుడైనా పడిపోవడం చూశామా
*పాడమని అడిగితే గాయకులు గొంతుపోయింది అంటారు. గొంతు ఎక్కడికి పోతుంది? పోతే ఎవరు తీసుకురాగలరు
*నోరు పారేసుకోవడం అంటారు. అది ఎలా సాధ్యం
*మా ఆయనకు నోట్లో నాలుకలేదని ఓ ఇల్లాలు వాపోతుంటుంది. నోట్లో నాలుక లేకుండా మనిషి ఎలా ఉంటాడు
*‘వాసన చూడు’ అంటారు. వాసనను పీలుస్తారు కానీ ఎలా చూస్తాం
*రుచి చూడటం కూడా అంతే. ఎవరు చూడగలరు
*పత్రికలు చదివి చదివి వాటిలోని పడికట్టు మాటలను కంఠస్థం చేసేశాడు తెలుగువాడు
*ఫలానావాడు బాధకు గురయ్యాడు అంటాడు. మధ్యలో గురి ఎందుకు? బాధపడ్డాడు అనొచ్చుగా
*దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడంటారు. దిగ్భ్రాంతి చెందాడు అనడు. దిగ్భ్రాంతిని ఎలా వ్యక్తం చేస్తాడంటే చెప్పడు
*తప్పు చేస్తే పాపం అంటాడు సరే. ఎదుటివాడు కష్టాల్లో ఉంటే అయ్యో ‘పాపం’! అంటాడు. తెలుగు భాష ఏమన్నా పుణ్యానికి వచ్చిందా ఏంటి
*దేశ భాషలందు తెలుగు లెస్స
*తెలుగు భాష జిందాబాద్
💐💐💐**?. . . ? ? ? ? ? ? ! . .త. .. ! ? ! ! ? ? ?! ! . . !? ! !. ! ? ! ? ! . ? ! ? . ? . ? . !. . ? ? . . * ! *-)-🙏కే ‘పాపం’! అంటాడు. తెలుగు భాష ఏమన్నా పుణ్యానికి వచ్చిందా ఏంటి?
*దేశ భాషలందు తెలుగు లెస్స*
*తెలుగు భాష జిందాబాద్*
💐💐💐