కెసిఆర్ చర్యలన్నీ "తాలిబన్" ప్రతిరూపాలే..!*
అధికార దాహానికి అలవాటు పడ్డ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు గత ఎన్నికల్లో *"ఆంధ్ర - తెలంగాణ"* అంటూ ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టారు. ప్రస్తుతం మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో *"తాలిబన్ - హిందూ* ముస్లిం వాదాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు. ఒక వ్యక్తికి మనసులో ఏముందో మాటల్లో అదే బయటకు వస్తుంది. ప్రస్తుతం కేసిఆర్ గారికి కూడా అదే జరుగుతుందనడంలో సందేహం లేదు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానన్న ముఖ్యమంత్రి గారు, ప్రస్తుతం *తాలిబాన్ రాజ్యాం* గా మారుస్తున్నాడు. రాష్ట్రంలో మొదటి నుంచి కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకు, అవకాశవాద రాజకీయాలకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి.... ఇటీవల కాలంలో తన మార్కు రాజకీయాలకు మరింత పదును పడుతున్నాడు. హిందూ వ్యతిరేక చర్యలకు పెద్దపీట వేస్తున్నాడు. *"చంకలో పిల్లిని పెట్టుకొని శకునాలు పలికినట్లు"* పోలీసులు పక్కకు జరిగితే *15 నిమిషాల్లో* హిందువులను చంపేస్తానన్న ఎంఐఎం పార్టీతో కలిసి అధికారం పంచుకుంటున్న ముఖ్యమంత్రి గారు దేశంలో తాలిబన్ రాజ్యం వస్తోందని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడడం నవ్వు తెప్పిస్తుంది. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నది తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలో మరెక్కడా లేదు. కానీ *"దొంగే దొంగ దొంగ* అంటున్న" రీతిలో తమ తప్పులు బయటపడకుండా ఎదురుదాడి చేయడంలో కేసీఆర్ రాజకీయ వ్యూహంలో భాగమే కావచ్చు. కానీ, తెలంగాణలో మతాల మధ్య అంతరం పెంచుతున్నది మాత్రం కెసిఆర్ అని చెప్పక తప్పదు. *15 నిమిషాల్లో హిందువులను చంపేస్తా* అనే పార్టీతో పొత్తు పెట్టుకోవడమే కాకుండా, నిన్న మొన్నటి విషయాలు పరిశీలిస్తే.. తాలిబన్ రాజ్యాన్ని నడిపిస్తున్నది ఎవరో తెలిసిపోతోంది. మునావర్ ఫరుకి అనే హిందూ ద్వేషిని ప్రశాంతమైన భాగ్యనగర్ కు ఆహ్వానించి, లెక్కకు మించిన భద్రత బలగాల మధ్య శిల్పారామం లో సభ పెట్టించింది కేసిఆర్ ప్రభుత్వం. రాముడు, సీత, హనుమంతుడి గురించి హాస్యంగా.. హేళనగా మాట్లాడించి, హిందువుల మనోభావాలు గాయపరిచే రీతిలో వ్యవహరించిన చరిత్ర కెసిఆర్ గారిది. దీంతో హిందూ ముస్లింల మధ్య అధికారికంగా చిచ్చుపెట్టిన సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మునావర్ ఫరూకి సభానంతరం ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందన. తరువాత అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేసి దాదాపు నాలుగు నెలల పాటు జైల్లో వేయడం వంటి చర్యలు తాలిబన్ రాజ్యానికి ప్రతీక కాదా..!? ఇది మతాల మధ్య చిచ్చుపెట్టే సంఘటన ఒకటైతే, సున్నితమైన అంశాలుగా భావించే కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు నాస్తికుల పేరుతో హిందూ దేవతలను దూషించడం మరోటి..!! అణగారిన వర్గాలు, అగ్రవర్ణాల మధ్య విషం చిమ్మే ప్రయత్నాలు చేయడం కేసీఆర్ చేస్తున్న అరాచకంలో భాగమే. నాస్తికత్వం పేరుతో హిందుత్వంపై ఘోరమైన విమర్శలు చేస్తూ అయ్యప్ప స్వామి పుట్టుకను ప్రశ్నించిన వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అంతకుమించి చదువుల తల్లి సరస్వతి దేవిని నీచాతి నీచంగా వర్ణించిన మరో ప్రబుద్ధుడిని నేటికీ అరెస్టు చేయకపోవడం కెసిఆర్ అసమర్ధ, హిందూ వ్యతిరేక పాలనకు నిదర్శనమే కదా.!!!?
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతిగా నిలిచే బతుకమ్మను గేలిచేస్తూ మాట్లాడిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ తో కలిసి అధికారం పంచుకోవడం హిందూ ద్రోహ చర్య కాదా..!? అన్నదమ్ముల్లా జీవిస్తున్న హిందూ ముస్లింల మధ్య మజిలీస్ కార్యకర్తలు వివాదాలు సృష్టిస్తుంటే కేసీఆర్ ప్రభుత్వం నోరు మూసుకుంది. బుర్కా తొడిగిన ముస్లిం మహిళలను హిందూ యువకులు తమ వాహనాలపై లిఫ్ట్ ఇస్తే.. అకారణంగా తీవ్రంగా దాడికి పాల్పడుతున్న దుండగులపై తెలంగాణ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం తాలిబన్ రాజ్యానికి పరాకాష్ట కాదా..!!? స్నేక్ గ్యాంగ్ పేరుతో హిందూ యువతులను టార్గెట్ చేసి, పాములను ఉసిగొల్పి అత్యాచారాలు చేస్తున్న దుండగులను పెంచి పోషిస్తున్నది టిఆర్ఎస్ మిత్రపక్షం మజ్లిస్ కాదా..!!!?
గత సంక్రాంతి పండుగ పర్వదినాన భైంసాలో హిందువులపై దాడులకు దిగి, ఇళ్లు దహనం చేసి, ఇద్దరు హిందువులను పొట్టన పెట్టుకున్న విషయంపై కేసిఆర్ సార్ నోరు మెదపలేదు. కొండగట్టు అంజన్న స్వామి దగ్గర దాదాపు 60 మంది అంజన్న భక్తులు చనిపోతే పరామర్శించడానికి సమయం లేని ముఖ్యమంత్రి కేసిఆర్ గారు, వాళ్ళను పరామర్శిస్తే ఎక్కడ ముస్లింల ఓట్లు దూరమవుతాయోనని స్పందించక పోవడం చాలా గొప్ప విషయం.
తెలుగుజాతికి ప్రపంచవ్యాప్తంగా వన్నెతెచ్చిన ప్రముఖులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుగారు, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గారి సమాధులను కూల్చేస్తానన్న *"తాలిబన్ల"* ను తన ప్రభుత్వంలో భాగస్వాములైన విషయం గుర్తు చేసుకుంటే మంచిది. భాగ్యనగర్( హైదరాబాద్ ) కార్పొరేషన్ ఎన్నికల్లో తాలిబన్లను మించిన రీతిలో మాట్లాడిన ఎంఐఎం నేతలను నిలువరించడం మరచి, వారితో కలిసి జిహెచ్ఎంసి లో అధికారం పంచుకున్న విషయం ప్రజలకు తెలుసు. ఎవరు తాలిబన్లు, ఎవరు భారతీయులో ముఖ్యంగా ఎవరు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారో కూడా ప్రజలందరికీ తెలుసు.!
తెలంగాణ ప్రజలు విజ్ఞులు, ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటే పప్పులో కాలేసినట్లే!.
తెలంగాణ లో ఎంఐఎం మతోన్మాదులు బెంగాల్, కేరళలో వేలాది మంది హిందువులను ఘోరంగా హతమార్చిన కమ్యూనిస్టులు, హిందూ దేవుళ్లను మాత్రమే వ్యతిరేకించే ఎజెండాగా పనిచేస్తున్న నాస్తిక వాద సంఘాలతో కలిసి మరోసారి తెలంగాణలో అధికారం సాధించడానికి తాలిబన్ల మాటలు తెరపైకి తీసుకురావడంలో అంతర్భాగంగానే భావించవచ్చు. భైంసాలో అల్లర్లు, లెక్కకు మించిన లవ్ జిహాద్ కేసులు.. మతమార్పిడులు, అన్నీ కూడా కేసీఆర్ తాలిబాన్ కార్యకలాపాల్లో భాగమని భావించవచ్చు. నిజమైన రాజకీయాల కోసం హిందుత్వాన్ని వాడుకోవడం దుర్మార్గం. కెసిఆర్ కు చిత్తశుద్ధి ఉంటే లవ్ జిహాద్ చట్టం చేయాలి. గోరక్షణ చట్టం కఠినంగా అమలు చేయాలి. మతమార్పిడిని అరికట్టి తమ మిత్రపక్షమైన ఎంఐఎం కు ముకుతాడు వేయాలి. అన్యాక్రాంతమవుతున్న దేవాలయాల ఆస్తులను పరిరక్షించాలి. కానీ, అవేవి చేయకుండా హిందువేతరుల ఓట్ల కోసం హిందువులను విమర్శిస్తే తగిన రీతిలో మూల్యం చెల్లించుకోక తప్పదు అనే విషయాన్ని గ్రహించాలి. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ ఇటీవల ఏసుక్రీస్తును పోగడటం, క్రీస్తు దయతో కరోనా అదుపులోకి వచ్చిందని చెప్పడం, పవిత్రమైన సంక్రాంతి పర్వదినాన హిందువుల సెలవులను రద్దుచేసి విధుల్లో పాల్గొనేలా సర్క్యులర్ జారీ చేయడం కెసిఆర్ తాలిబాన్ రాజ్యానికి ప్రతీకగా చెప్పవచ్చు.
తాలిబాన్లను మించిన హిందూ వ్యతిరేక రాజ్యం తెలంగాణలో కొనసాగుతోంది. ఇక్కడ హిందూ ముస్లింలకు సఖ్యత ఏర్పడాలంటే రామరాజ్యం రావాల్సిందే. రంజాన్, క్రిస్మస్ పండుగలకు ప్రత్యేకంగా సెలవులు ఇచ్చి హిందువుల పండుగలైన సంక్రాంతి పండుగకు సెలవులు రద్దు చేయడం తాలిబన్ రాజ్యానికి నిదర్శనం. ముస్లిం మైనార్టీ సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కెసిఆర్ ప్రభుత్వం తాలిబన్లను మించి హిందువులపై అరాచకాలు సాగిస్తోంది. దేవాలయాల ఆస్తులపై, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రాముల వారి భూములు కబ్జాకు గురవుతున్నా పట్టించుకోని పెద్దలు సెక్యులరిజం, తాలిబాన్ల గురించి మాట్లాడటం వారికే చెల్లింది. ఏది ఏమైనా తమ తప్పులు బయటపడకుండా వైరి పక్షంపై నెపాన్ని నెట్టేసి., రాజకీయంగా లబ్ధి పొందే విధంగా మాట్లాడడం సరికాదనే విషయం గ్రహించాలి. రాజకీయాలను హిందుత్వానికి ముడి పెట్టకుండా, మజ్లిస్ మతోన్మాదులకు అవకాశవాదం కల్పించకుండా పాలన సాగించాలని.., లేదంటే మూల్యం చెల్లించుకోక తప్పదని హిందూ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆకాశం పై ఉమ్ము వేస్తే.. తిరిగి వచ్చి అది మీ ముఖం పైనే పడుతుంది అనే విషయం గౌరవ ముఖ్యమంత్రిగారు గ్రహించాలి.