Thursday 2 February 2023

 అదానీ గ్రూప్ ఆఫ్ స్టాక్ మానిప్యులేషన్ పై రిపోర్ట్ ఇచ్చిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కంపెనీ పై ఫ్రాడ్, కుట్ర ఆరోపణలు పై అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విచారణకు ఆదేశించింది."

షార్ట్ కవరింగ్/షార్ట్ సెల్లింగ్ 

ఇంతకీ షార్ట్ కవరింగ్ అంటే..

సాధారణంగా షేర్లను ముందు ఒక ధరకు కొనుక్కోవడం తర్వాత ఆ ధర పెరిగితే అమ్ముకోవడం, లాభం సంపాదించడం మాత్రమే చాలామందికి తెలుసు. పెరుగుతుందనే ఉద్దేశంతో ముందు కొనుక్కుని, తర్వాత పెరిగినప్పుడు అమ్ముకుంటే లాభం వస్తుంది. కానీ ఆ షేర్ ధర తగ్గినప్పుడు మళ్ళీ అది పెరిగే వరకు వేచి చూడకుండా లేదా ఆ ధర ఇంకా పడిపోతుంది అనే భయం చేతో ఆ తక్కువ ధరకు అమ్మేసుకుని బైటపడాలనుకుంటే నష్టం వస్తుంది. 

దీనికి పూర్తిగా భిన్నమైనది షార్ట్ పొజిషనింగ్. షేరును ముందు అమ్మేసి ఆ తర్వాత కొనుక్కోవడం ఈ విధానంలో ఉంటుంది. షేరు ధర పడిపోతుందనే ఉద్దేశంతో దాన్ని ముందుగా అమ్మేసి, రేటు తగ్గాక కొనుక్కోవడం ద్వారా లాభాలు ఆర్జించడమన్నది షార్ట్ సెల్లర్ లక్ష్యంగా ఉంటుంది. ఒకవేళ ఊహించినట్లుగా రేటు తగ్గకుండా పెరిగిపోయిన పక్షంలో నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. షార్ట్ పొజిషనింగ్‌లో రెండు దశలు ఉంటాయి. ఒకటి షార్ట్ సెల్లింగ్ కాగా రెండోది షార్ట్ కవరింగ్.

షార్ట్ పొజిషనింగ్ దశలు ఇలా ఉంటాయి:

1.అవకాశం- మార్కెట్లో నిర్దిష్ట షేరు ధర పడిపోతుందని గుర్తించడం.

2.షార్ట్ పొజిషన్ తీసుకోవడం :– సదరు కంపెనీ షేర్లను ప్రస్తుత రేటుకు ఇన్వెస్టరు మార్కెట్ వర్గాల నుంచి లేదా బ్రోకింగ్ సంస్థ నుంచి చేబదులు తీసుకుంటారు.

3.షేరు విక్రయించడం :– చేబదులు తీసుకున్న షేర్లను ఇన్వెస్టరు విక్రయిస్తారు. దీన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు.

4.వెయిటింగ్ పీరియడ్ అంటే :– షార్ట్ పొజిషన్‌ను ముగించే క్రమంలో షేరు రేటు పడిపోయేంత దాకా నిరీక్షించే వ్యవధి.

5.షార్ట్ పొజిషన్ క్లోజ్ చేయడం :– ఊహించినట్లుగా షేరు రేటు పడిపోయాక, సరిగ్గా ఎన్నయితే షేర్లను చేబదులు తీసుకున్నారో అన్ని షేర్లను తిరిగి మార్కెట్ నుంచి కొనుగోలు చేయడం.

6.లాభం లేదా నష్టం – ఈ మొత్తం ప్రక్రియలో రెండు అంశాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ట్రేడరు ఊహించినట్లుగానే షేరు రేటు పడిపోయిందంటే లాభాలు వస్తాయి(ఎక్కువ రేటు దగ్గర అమ్మి, తక్కువ రేటు వద్ద కొనుక్కోవడం వల్ల). ఒకవేళ అలా జరగుండా షేరు రేటు పెరిగిపోయిందంటే నష్టాలు వస్తాయి (అమ్మిన రేటు కన్నా ఎక్కువ రేటు దగ్గర కొనాల్సి రావడం వల్ల). ఈ మొత్తం ప్రక్రియలో ముందుగా అమ్మిన షేర్లను తర్వాత దశలో కచ్చితంగా కొనుగోలు చేసి పొజిషన్ క్లోజ్ చేయాల్సి ఉంటుంది.

ఇది ఒక వ్యాపారం. ఈ పద్దతిలో షేర్ ధర ఖచ్చితంగా పడిపోతేనే లాభాలు వస్తాయి. కానీ పడిపోయేటట్లు చేయడం కుదురుతుందా?

అదే అదాని కంపెనీ షేర్లతో అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిడెన్ బర్గ్ ఆడిన ఆట. ముందుగా ఆదాని షేర్ ఇంత ధరకు అంటే ఉదా: ఒక్కో షేర్ 3500కి ఫలానా టైం లోగా అమ్ముతాను అని ముందుగా తన చేతిలో షేర్స్ లేకపోయినా ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తరువాత ఆదాని గ్రూప్ మీద ఘాటైన వ్యతిరేక రిపోర్ట్ తయారు చేసి మార్కెట్ లో విడుదల చేసింది. అంత పెద్ద టెక్నికల్ రిపోర్ట్ చదివి అర్ధం చేసుకుందికి టైం ఉండక మదుపు దారులు అమ్మో అదాని కంపనీ ఇంత దారుణంగా ఉందా? అయితే దాని షేర్ ధర పడిపోతుంది అని భయంతో అమ్మకానికి పెట్టేసారు. ఒకేసారి ఎక్కువ మంది షేర్ అమ్మకానికి పెడితే ధర సాధారణ వస్తువు ధర లాగే షేర్ రేట్ కూడా పడిపోతుంది. అలాగే అదాని గ్రూప్ షేర్ ధర ₹3500 నుండి ₹2800కి వచ్చేసింది. అంటే ఒకేసారి ₹700 తగ్గింది. ఈ హిడెన్ బర్గ్ సంస్థ వెంటనే మార్కెట్ లో ఈ ₹2800 కి కొని ముందుగా తన దగ్గర 3500 కొంటాను అని వుప్పొండం కుదుర్చుకున్న వాళ్ళకి అమ్మేస్తుంది. ఆ భారీ లాభం జేబులో వేసుకుంటుంది.

అమెరికాలో ఇటువంటి సంస్థలు చాలా వున్నాయి. అయితే ఇటువంటి సంస్థలు తమ లాభార్జన కోసం ఇటువంటి రిపోర్టులు తయారు చేస్తూ పెద్ద పెద్ద కంపెనీలను తద్వారా చిన్న చిన్న షేర్ హోల్డర్స్ ని నష్టాలు పాలు చేస్తున్నారు అని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది.

అందుకే ఇటువంటి షార్ట్ సెల్లింగ్ వ్యాపారం చేస్తున్న 30 సంస్థలు మరియు ఇటువంటి వ్యాపారమే చేస్తున్న 30 మందికి పైగా ఉన్న వ్యక్తులపై విచారణకు అమెరికా ప్రభుత్వం లో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విచారణకు ఆదేశించింది. తమకు ఆకస్మిక నష్టాలు కలుగ చేస్తున్న ఇటువంటి షార్ట్ సెల్లింగ్ కంపెనీల మీద ప్రపంచంలో గల చిన్న మదుపుదారులు చాలా కోపంగా వున్నారు.

ఆ 30 కంపెనీల లిస్టులో మొన్న ఆదాని గ్రూప్ మీద రిపోర్ట్ ఇచ్చిన హిడెన్ బర్గ్ కంపనీ పై కూడా ఈ విచారణ జరుగుతోంది.

....చాడా శాస్త్రి....

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...