Saturday, 31 December 2022

 అంతరిక్ష రంగ పితామహుడు శ్రీ విక్రమ్ సారాభాయ్ గారి వర్థంతి సందర్భంగా

#అహ్మదాబాద్‌లోని బట్టల మిల్లు యజమాని అంబాలాల్ సారాభాయ్ ఇంట్లో 1919 ఆగస్టు 12న ఒక మగపిల్లాడు పుట్టాడు. అతడిని చూడ్డానికి వచ్చిన అందరి కళ్లూ బిడ్డ చెవులపైకి వెళ్లాయి. ఆ చెవులు చాలా పెద్దగా ఉన్నాయి. వాటిని చూసిన వాళ్లంతా "అరే ఇవి గాంధీజీ చెవుల్లా ఉన్నాయే" అన్నారు.
అంబాలాల్ సన్నిహతులు కొందరైతే సరదాగా "తమలపాకుల్లా ఉన్న ఆ చెవులను కిళ్లీలా మడవచ్చు" అన్నారు. ఆ అబ్బాయికి విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ అనే పేరు పెట్టారు.
ఠాగూర్ ఎవరి ముఖమైనా చూడగానే వారి భవిష్యత్తు గురించి చెప్పేవారు. పిల్లాడుగా ఉన్న విక్రమ్‌ను ఆయన దగ్గరికి తీసుకురాగానే, టాగూర్ విశాలంగా విక్రమ్ నుదుటిని అలా చూస్తుండిపోయారు. "ఈ పిల్లాడు ఒకరోజు చాలా పెద్ద పని చేస్తాడు" అన్నారు.
#ఈనాడు 104 ఉపగ్రహాలను ఏకకాలంలో అంతరిక్షంలోకి ప్రయోగించి #ప్రపంచం ప్రశంసలనందుకున్న భారత అంతరిక్ష పరిశోధనలకు జనకుడు, ఇస్రో (1969) స్థాపకుడు విక్రమ్ సారాభాయ్ 12 ఆగస్టు 1919న అహ్మదాబాద్లో అంబలాల్, సరళాదేవి దంపతులకు జన్మించాడు. ఒక సంపన్న కుటుంబంలో అభ్యుదయ భావాలు కలిగిన తల్లిదండ్రులకు జన్మించిన ఎనిమిది మంది సంతానంలో ఒకడు. తల్లిదండ్రులు మాంటిస్సోరీ విద్యా విధానంలో ప్రారంభించిన 'రిట్రీట్’ లోనే అతడి పాఠశాల విద్యకొనసాగింది.
#అంబాలాల్ ఇంటికి ఎంతో మంది గొప్ప ప్రముఖులు వచ్చిపోతుండేవారు. విశ్వకవి రవీంద్రనాథ్టాగోర్, తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి, ప్రముఖ ఉపన్యాసకుడు, సాత్రంత్ర్య పోరాట యోధుడు వి.ఎస్ శ్రీనివాస శాస్త్రి, మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, సరోజినీ నాయుడు, విద్యావేత్త సి. ఎస్ ఆండ్రూస్, మౌలానా అబుల్ కలాం అజాద్, సి.వి రామన్ మొదలైనవారితో ముఖాముఖి ముచ్చటించ గలిగిన అవకాశాలు ఆయనకు దక్కాయి.
#మెట్రిక్యులేషన్ తర్వాత ఆయన ప్రకృతి (Natural Sciences) చదవాలని 1940 లో ఆయన ఇంగ్లాండ్ బయలుదేరి కేంబ్రిడ్డి విశ్వవిద్యాలయ అనుబంధిత సెయింట్ జాన్స్ స్కూల్లో చేరాడు. అయితే అప్పటికే రెండవ ప్రపంచ యుద్ధం (1939-1945) మొదలైంది. కొంతకాలం తర్వాత, ఆ పరిస్థితుల్లో చదువు కొనసాగించలేక ఆయన తిరిగి భారతదేశం చేరుకుని ఇండియన్ ఇన్స్టిటూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరులో ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సి.వి.రామన్ వద్ద పరిశోధక Soon (Research Scholar) చేరాడు. అక్కడ అతడికి విశ్వ శాస్త్రం (Cosmology) ప్రో ఆసక్తి కల్లింది. విశ్వకిరణాల కిరణాల మీద పరిశోధన చేయాలని సంకల్పించుకుని బెంగళూరులోనే పరికరాలు తయారు చేసుకున్నాడు. బెంగళూరు, పుణే హిమాలయాల్లో వాటిని గూర్చి కొన్ని కొలతలు తీసుకున్నాడు. రెండవ ప్రపంచ యుద్ధం ముగియగానే 1945 లో తిరిగి ఇంగ్లాండు చేరుకుని 1947 లో పి.హెచ్డి. పట్టా పొందాడు.
#ఇండియాకు తిరిగివచ్చి భౌతికశాస్త్ర పరిశోధనా (Soporate) (Physical Research Laboratory-PRL) అహ్మదాబాద్లో తల్లిదండ్రులు నడిపిస్తున్న మహాత్మాగాంధీ సైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అహ్మదాబాద్ ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన నాలుగు గదుల్లో ఏర్పాటు చేశాడు. తర్వాత కాలంలో దీనిని శాస్ర, పారిశ్రామిక పరిశోధనా సంస్థ (Council of Scientific and Industrial Research - CSIR) ప్రభుత్వంలోని అణు శక్తి విభాగం (Department of Atomic Energy – DAE) గుర్తించాయి. విశ్వ కిరణాల (Cosmic Rays) పై వాతావరణ పరిస్థితులు ఏ - ప్రభావం చూపవనీ, సూర్యునిలో జరిగే సార చర్యలే విశ్వ కిరణాలలోని మార్పులకు కారణమవుతాయనీ తేల్చి చెప్పాడు. అంతేకాకుండా గ్రహాంతర భౌతిక శాస్రంలో పరిశోధనలు జరిగే తరుణం ఆసన్నమైందని కూడా భావించాడు.
vikramstatue1957-58 సంవత్సరాన్ని అంతర్జాతీయ భూ భౌతిక సంవత్సరంగా (International Geo-Physical year - IGY) అమెరికా ప్రకటించింది. అదే సమయంలో సోవియెట్ యూనియన్ తన మొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుట్నిక్-1 ని ప్రయోగించింది. దానితో భారతదేశం వెంటనే స్ఫూర్తిపొంది విక్రం సారాభాయ్ చైర్మన్ గా భారత జాతీయ పరిశోధనా కమిటీని నియమించింది.
భారత అణుశక్తి కార్యక్రమ #పితామహుడు హెూమి జహంగీర్ భాభా సహకారంతో విక్రం సారాభాయ్ రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని తుంబా (తిరువనంతపురం సమీపంలో) నెలకొల్పాడు. తుంబా మధ్యవృతీయ రాకెట్ ప్రయోగ కేంద్రం (Thumba Equatorial Rocket Launching Station-TERLS) సంక్షిప్తంగా ఈనాడు తుంబా రాకెట్ ప్రయోగ కేంద్రంగా పిలుసున్నారు. దీన్ని నవంబర్ 21, 1963 లో ప్రారంభించారు. రెండేళ్ళలోపునే ఐక్యరాజ్య అంతర్జాతీయ సదుపాయాలున్న కేంద్రంగా గుర్తించింది.
1957లో రష్యా మొట్ట మొదటి శాటిలైట్ అయిన #స్పుత్నిక్‌ను ప్రయోగించినపుడు... భారత భవిష్యత్ అవసరాలకు శాటిలైట్ల అవసరం గురించి ఎంతో విషయ సేకరణ చేయటమేగాకుండా, ఆ శాటిలైట్ యొక్క ఆవశ్యకతను అప్పటి ప్రధానమంత్రి అయిన జవహర్‌లాల్ నెహ్రూకు వివరించి, ఆయనను ఒప్పించారు సారాభాయ్. ఆ తరువాత 1962లో భారత అణుశక్తి వ్యవస్థ పితామహుడయిన హోమీ బాబా పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ (ఐఎన్‌సీఓఎస్‌పీఏఆర్) సెంటర్‌ను ఆయన ఏర్పాటు చేశారు. తదనంతరం ఆయన ఆదర్శాలకు అనుగుణంగా ఇస్రో ఎన్నో విజయాలను సాధించి భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపచేసింది.
"భారత అంతరిక్ష రంగ పితామహుడు"గా కీర్తి గడించిన #సారాభాయ్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను 1962లో శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డుతో, 1966లో పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. జాతీయ స్థాయిలోను, అంతర్జాతీయంగానూ అర్థవంతమైన పాత్ర పోషించగలగాలంటే, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని మానవ సమాజ సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవడంలో మనం ఎవరికీ తీసిపోకుండా ఉండాలని” చెప్పి, ఆ దిశగా కృషి చేసిన సారాభాయ్ 1971, డిసెంబరు 30వ తేదీన పరమపదించారు.
గ్రామీణ ప్రజల కోసం #ఉపగ్రహాలను రూపొందించటం విక్రమ్ సారాభాయ్ వ్యూహంలో ప్రధానమైనదిగా ఉండేది. సాంకేతిక పరిజ్ఞాన ఉపయోగాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకొని రావాలని, అప్పుడే మన దేశంలోని ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చని సారాభాయ్ తోటి శాస్త్రవేత్తలను ప్రొత్సహించేవారు.
#సహజ వనరుల వివరాలు సేకరించే పరిజ్ఞానాన్ని రూపొందించటం, రిమోట్ సెన్సింగ్‌కు అవసరమైన సాధనాలను ఏర్పాటు చేసుకోవటం అనేవి అందులో కీలక భాగాలు. ఈ రంగాలను ఎలా ఉపయోగించుకోవాలి? అంతరిక్షంలోకి మానవుల్ని ఏలా పంపాలి? సంప్రదాయపద్ధతిలో ఉన్న వ్యవస్థల్లోకి అంతరిక్ష వ్యవస్థను ఎలా కలపాలి? అన్న విషయాలన్నీ విక్రమ్ సారాభాయ్ వ్యూహాల్లో భాగాలుగా ఉండేవి.
#విజిల్ వేస్తూ ల్యాబ్‌లోకి వెళ్లేవారు.....
విక్రమ్ సారాభాయ్ చాలా కష్టపడేవారు. ఆయన శాస్త్రవేత్తే కాదు, మంచి అడ్మినిస్ట్రేటర్ కూడా. టెన్షన్ తగ్గించుకోడానికి ఆయన ఎక్కువగా సంగీతం వినేవారు.
ఆయన దగ్గర గ్రామ్‌ఫోన్ రికార్డుల భారీ కలెక్షన్ ఉండేదని చెబుతారు. ఆయనకు నచ్చిన గాయకుడు 'కుందన్ లాల్ సెహగల్' ఆయనకు విజిల్ వేయడం అంటే చాలా ఇష్టం. విజిల్‌తోపాటూ మెట్లపై చెప్పుల శబ్దం వినిపించగానే ల్యాబ్‌లో పనిచేస్తున్నవారు విక్రమ్ సారాభాయ్ వచ్చేశారని తెలుసుకునేవారు.
విక్రమ్ సారాభాయ్‌కు శాస్త్రీయ, వెస్ట్రన్, భారతీయ సంగీతం చాలా ఇష్టం.
డాక్టర్ ఏపీజే #అబ్దుల్ కలాంకు గురువు:
భారత మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ పేరుతో పాపులరైన ఏపీజే అబ్దుల్ కలాంకు విక్రమ్ సారాభాయ్ గురువు. ఒక సారి "మిమ్మల్ని దిల్లీలో కలవాలని అనుకుంటున్నట్లు" సారాభాయ్ నుంచి కలాంకు ఒక మెసేజ్ అందింది. కలాం చాలా విమానాలు మారి దిల్లీ చేరుకున్నారు. సారాభాయ్ ఆయనకు ఉదయం మూడున్నరకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు.
కలాం తన ఆత్మకథ 'వింగ్స్ ఆఫ్ ఫైర్'లో ఆరోజు గురించి రాశారు. "నేను అంత ఉదయం అశోకా హోటల్‌కు ఎలా వెళ్లాలా అని నాకు కంగారుగా ఉంది. దాంతో, నేను రాత్రంతా ఆ హోటల్ లాబీలోనే ఉండాలని అనుకున్నా. ఆ హోటల్లో భోజనం చేస్తే, నా జేబు ఖాళీ అయిపోతుంది. అందుకే నేను ఒక దాభాకు వెళ్లి భోజనం చేశాను. రాత్రి 11 గంటలకు హోటల్ లాబీలోకి చేరుకున్నాను" అని చెప్పారు.
దాదాపు 3 గంటలప్పుడు అక్కడకు ఒక వ్యక్తి వచ్చి కూచున్నారు. ఆయన సూట్‌ వేసుకుని, ఒక మెరిసే టై కట్టుకుని ఉన్నారు. బూట్లు మెరుస్తున్నాయి. సరిగ్గా మూడు గంటలకు మమ్మల్నిద్దరినీ సారాభాయ్ గదికి తీసుకెళ్లారు. ఆయన లోపలికి పిలిచి మమ్మల్ని ఒకరినొకరికి పరిచయం చేశారు. 'కలామ్ అంతరిక్ష విభాగంలో నా సహచరుడు అని ఆయనకు, గ్రూప్ కెప్టెన్ నారాయణన్, ఎయిర్‌ఫోర్స్ హెడ్ క్వార్టర్స్‌లో పనిచేస్తారు అని నాకు చెప్పారు"
"కాఫీ తాగాక డాక్టర్ సారాభాయ్ మా ఇద్దరికీ 'రాకెట్ అసిస్టెడ్ టేకాఫ్' అంటే RATO గురించి తన ప్లాన్ చెప్పారు. దీని సాయంతో భారత యుద్ధ విమానాలు హిమాలయాల్లో చిన్న రన్‌వేపై కూడా సమర్థంగా టేకాఫ్ అవుతాయన్నారు".
"#కాసేపటి తర్వాత ఆయన మమ్మల్నిద్దరినీ కార్లో కూచోమని చెప్పారు. ఇద్దరినీ తనతోపాటూ ఫరీదాబాద్‌లో ఉన్న తిల్పత్ రేంజి తీసుకెళ్లారు. 'నేను పరిశోధన కోసం మీకు ఒక రాకెట్ అందుబాటులో ఉంచితే, మీరు 18 నెలల్లో దాని స్వదేశీ వెర్షన్ తయారు చేసి మన హెచ్ఎఫ్-24 విమానానికి ఫిట్ చేయగలరా' అని ఒక టీచర్‌లా అడిగారు. మేమిద్దరం 'అది సాధ్యమే' అన్నాం. అది వినగానే ఆయన నరాలు ఉప్పొంగాయి. ఆయన తన కారులోనే మాఇద్దరినీ తిరిగి అశోకా హోటల్ తీసుకొచ్చారు. తర్వాత టిఫిన్ సమయంలో ప్రధానమంత్రిని కలవడానికి ఆయన ఇంటికి వెళ్లారు" అని కలాం తన ఆత్మకథలో చెప్పారు.
#గుండెపై పుస్తకం పెట్టుకునే వీడ్కోలు:
1971 డిసెంబర్ 30న విక్రమ్ సారాభాయ్ త్రివేండ్రమ్ ‌దగ్గరున్న కోవలం బీచ్ గెస్ట్ హౌస్‌లో ఉన్నారు. ఉదయం నిద్రలేవకపోయేసరికి ఆయన పడుకున్న గది తలుపులు విరగ్గొట్టారు. లోపల దోమతెరలో ఆయన ప్రశాంతంగా పడుకుని కనిపించారు. ఆయన గుండెలపై ఒక పుస్తకం ఉంది. డాక్టర్ ఆయన్ను పరీక్షించి, రెండు గంటల ముందే చనిపోయారని చెప్పారు. అప్పుడు విక్రమ్ సారాభాయ్ వయసు కేవలం 52 ఏళ్లు.

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...