Wednesday, 26 October 2022

                                             నడకుదురులో నకరాసుర వధ





విజయవాడకు 56 కిలోమీటర్ల దూరాన ఉన్న నడకుదురులో నకరాసుర వధ జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.

నడకుదురు లోని శ్రీ ప్రుద్దేస్వర స్వామి వారి దేవాలయం .పురాతనమయిన ఈ దేవాలయం చూడాలంటే విజయవాడ నుండి కృష్ణా కరకట్ట రోడ్ లో ఉంటుంది .ఈ రోడ్ ద్వారా 47కి .మీ ఉంటుంది
నడకుదురు ప్రుధ్వీశ్వర స్వామి
కృష్ణా జిల్లాలో చల్ల పల్లి మండలం లో చల్ల పల్లికి దగ్గర కృష్ణా నదీ తీరం లో ‘’నడకుదురు ‘’క్షేత్రం ఉంది .ఇక్కడే నరకాసురుడి వధ జరిగిందని స్కాంద పురాణం చెబుతోంది అందుకే దీనికి ‘’నరకోత్తార క్షేత్రం ‘’ అనే పేరు .నరకాసుర సంహారం తర్వాత సత్య భామా సమేతుడై శ్రీ కృష్ణుడు ఇక్కడ వెలసిన లక్ష్మీ నారాయణులను ‘’పాటలీ పుష్పాలు ‘’తో పూజించారని పురాణ కధనం .దేవలోకం నుండి పాటలీ వృ క్షాలను తెచ్చి శ్రీ కృష్ణుడే ఇక్కడ నాటిన్చాదట .నరకోత్తార క్షేత్రం క్రమంగా నరకోట్టూరు ,నడక దూరు నడకుదురు గా మారింది .కృష్ణ సత్యలు పూజించిన లక్ష్మీ నారాయణ విగ్రహాలు ఇక్కడి కార్తీక వనం లో ఉన్నాయి ద్వాపర యుగం నాటికే ఇక్కడ పరమేశ్వరుడు ‘’ప్రుద్వీశ్వరుడు ‘’గా వెలసి ఉన్నాడు నరకుడు ఇక్కడ ద్విముఖుడనే బ్రాహ్మణుడిని చంపాడట .ఆ పాపం పోగొట్టుకోవటానికి ప్రుద్వీశ్వర లింగాన్ని అర్చిన్చడట .ప్రుద్వీశ్వరుడు సంతాన ప్రదాత గా ప్రసిద్ధుడు .ఈ క్షేత్రానికి ఇంకో విశేషం ఉంది .కాశీ క్షేత్రం తర్వాత దేశం లో మరెక్కడా లేని పాటలీ వృక్షాలు నడకుదురు లో మాత్రమె ఉన్నాయి .కాశీలో దాదాపు అంత రించి పోయే స్తితిలో ఉన్నాయి అవి వేరొక చోట నాటినా పెరగవట .ఇదో విచిత్రం .ఇప్పటికీ నడకుదురు లో పాటలీ వృక్షాలున్న వనం ఉంది .కార్తీకం లో ఇక్కడి శివునికి పాటలీ పుష్పాలతో పూజ చేయటం విశేష పుణ్య ప్రదం.

show image

  A TRIBUTE TO A GREAT SON OF MOTHER INDIA FIELD MARSHAL SAM HORMUSJI FRAMJI JAMSHEDJI MANEKSHAW MC ON HIS 17TH DEATH ANNIVERSARY TODAY. Sam...