Friday, 1 July 2022


గర్వ భంగం



 *సత్య భామ శ్రీకృష్ణునితో ఒకసారి’ స్వామీ ! రామావతారంలో సీత మీ భార్యకదా! ఆమె నాకంటే అందంగా ఉండేదా?’ అని అడిగింది.*

*ఆ సమయంలో అక్కడే ఉన్న గరుడుడు “ప్రభూ, నాకంటే వేగంగా ఈ ప్రపంచం లో ఎవరైనా ప్రయాణించ గలరా?”అన్నాడు.*
*పక్కనే ఉన్న సుదర్శనుడు (సుదర్శన చక్రం) కూడా.. ‘పరంధామా*! *అనేక యుద్ధాల్లో పాల్గొని మీకు విజయాన్ని తెచ్చి పెట్టాను.నాతో సరితూగు వారెవరు స్వామీ ? అన్నాడు.*
*ముగ్గురి మాటలూ విన్న నంద గోపాలుడు వారికి గుణపాఠం చెప్పాలను కున్నాడు.*
*దీర్ఘంగా ఆలోచించి..*
*సత్యా, నువ్వు సీతగా మారిపో…నేను రాముణ్నవుతాను.*
*గరుడా నువ్వు ఆంజనేయుని దగ్గరికి వెళ్లి సీతారాములు నిన్ను తీసుకు రమ్మన్నారని చెప్పి తోడ్కనిరా.*
*చక్రమా !నా అనుమతి లేనిదే ఎవరూ లోపలికి ప్రవేశించ కుండా చూడు*
*~అంటూ ముగ్గురి కీ మూడు బాధ్యతలు అప్పగించాడు.*
*గరుత్మంతుడు హనుమంతుని వద్దకు వెళ్లి.. సీతా రాములు రమ్మన్నారని చెప్పాడు.*
*హనుమ ఆనందంతో పుల కించిపోతూ ‘నేను నీ వెనుకే వస్తాను. నువ్వు పద’ అని గరుత్మంతుని సాగనంపుతాడు.*
*ఈ ముసలి వానరం రావడానికి ఎంతకాలమవుతుందో కదా అనుకుంటూ గరుడుడు రివ్వున ఆకాశానికి ఎగురు తాడు.*
*కానీ.. *
*ఆయన కంటే ముందే హనుమ ద్వారక చేరడం తో గరుత్మంతునికి మతి పోతుంది. సిగ్గుతో తలదించు కొని మౌనంగా ఉండి పోతాడు.*
*ఇంతలో..’హనుమా’ అన్నపిలుపుతో పులకించిన ఆంజనేయుడు తన రాముని వైపు చూశాడు.*
*’లోనికి రావడానికి నిన్నెవరూ అడ్డగించలేదా ?’అని అడగ్గా..*
*హనుమ తన నోటి నుండి చక్రాన్ని తీస్తూ ‘ప్రభూ, ఇదిగో ఈయన నన్ను లోపలికి రాకుండా ఆపాడు.ఎన్ని చెప్పినా వినక పోవడంతో ఇక లాభం లేదని భావించి నోట్లో పెట్టుకొని మీ ముందు వచ్చి నిలిచాను’ అన్నాడు.*
*సుదర్శనుడు కూడా గరుడని వలె అవమానంతో నేలచూపులు చూస్తూ ఉండిపోయాడు.*
*ఇంతలో హనుమంతుని చూపు తన రాముని పక్కన కూర్చున్న స్ర్తీ పై పడి ‘స్వామీ !మీ పక్కనుండ వల్సింది నా తల్లి సీతమ్మ కదా! ఎవరీవిడ ప్రభూ’ అన్న మాటలు విన్నదే తడువుగా సత్యభామకు కూడా గర్వ భంగమై ప్రభువు కాళ్ళ మీద పడింది.*
*అలా కృష్ణపరమాత్ముడు ముగ్గురిలోనూ మొగ్గతొడిగిన గర్వాన్ని తుంచి వేసి వినయాని కున్న విలువేమిటో తెలియ చెప్పాడు.*
*ॐశ్రీవేంకటేశాయ నమః*
*~శ్రీరామ్

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...