స్టువర్ట్ పురం దొంగలు
అసలు దానికి కారణం ఏమిటి..? స్టువర్ట్ పురం అంతా ఒకే కులం ఎందుకు ఉంటుంది.వాళ్ళని దొంగలని బ్రిటిష్ కాలం నాటి రికార్డ్స్ ఎందుకు చెప్తున్నాయి...?
అసలు ఆ ఊరు ఎలా పుట్టింది...?
ఈ విషయాలు అన్ని తెలుసుకోవాలంటే ఈ పోస్ట్ చదవండి..
ఇండియన్ క్రిమినల్ ట్రైబల్ ఆక్ట్ 1871 అనేది చాలామందికి తెలియని బ్రిటిష్ కాలం నాటి చట్టం దీనిని 1871 న అమలులోకి తెచ్చారు..
మనిషి పుట్టగానే వాడిని దొంగ అని,నేరస్తుడు అని ముద్ర వేయడం అనేది విన్నారా...?
ఒక కులాన్ని దొంగలుగా / నేరస్తులుగా ముద్ర వేసి వాళ్ళనందరినీ ఒక చోట పెట్టి చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఏ నేరం జరిగినా వీరిని తీసుకొని వెళ్ళి నానా హింసలు పెట్టి చంపడం గురించి విన్నారా..?
అదే ఈ ఇండియన్ క్రిమినల్ ట్రైబల్ ఆక్ట్ యొక్క ఉద్దేశ్యం..
ఈ చట్టం పరిధిలోకి 237 కులాలను తీసుకుని వచ్చారు.. అంటే ఈ చట్టం ప్రకారం ఈ 237 కులాలలో అప్పుడే పుట్టిన శిశువు కూడా దొంగ /నేరస్థుడుగా పరిగణింపబడతారు...
వీరిని బ్రిటిష్ ప్రభుత్వం వారి మీద యుద్ధం చేసిన వర్గాల వారిని నేరస్తులుగా ముద్ర వేసి , విదేశీయులతో వీటి మీద పుస్తకాలు,లోకల్ వార్తా పత్రికలలో వార్తా కధనాలు రాయించి. ఊర్లలో పాలెగాళ్ళ చేత,జమిందార్ల చేత దండోరాలు వేయించి పుకార్లు సృష్టించి,కొన్ని కులాలను నేరస్తులుగా ముద్ర వేయించి, జనాల నుండి సరైన తిరుగుబాటు రాకుండా జాగ్రత్త పడ్డారు...
ఆ తరువాత ఆయా కులాలకి వేరే ఊర్లు కట్టి వారిని ఊరు వదిలి భయటకి వెళ్ళకుండా హుకుం జారీ చేసారు. పోనీ ఊర్లలో పని దొరక్క ఊరు దాటాలంటే పోలీస్ చెక్ పోస్ట్ దాటాలి ఒక వేళ బయట ఊర్లలో దొంగతనం జరిగితే నిర్దాక్షిణ్యంగా అక్రమ కేసులు బుక్ చేసేవారు. దానితో చాలామంది సరైన తిండి దొరక్క , వైద్య సదుపాయాలూ లేక చాలా చిన్న వయస్సులోనే ప్రాణాలు వదిలేవారు, ఇక దిక్కు లేక దొంగతనాలకి అలవాటుపడ్డారు...
సరిగ్గా ఈ సమయంలోనే క్రైస్తవ మిషనరిలను వైద్యం పేరుతో, తిండి పేరుతోనో ఇతర సమాజం నుండి వేరుచేయబడ్డ ఆ గ్రామంలోకి దింపేవారు,ఇంకేముంది గ్రామం మొత్తం క్రైస్తవమయం అయింది..తద్వారా ఆయా కులాలవారు మిగతా సమాజానికి దూరం అయ్యారు..
ఇలా వేరు చేసిన కులాలను తగ్గీస్ (Thuggees) అనగా తెలుగులో బందిపోటు దొంగలు అని ముద్ర వేసి చాలామందిని జైలులో పెట్టి చంపేశారు..
అటవీ సంపదని దోచుకుంటున్న బ్రిటిష్ పాలకులని అడ్డుకున్నందుకు దాదాపు అన్ని ST కులాలను బందిపోట్లుగా ముద్ర వేసారు.. వాళ్ల తండాల నుండి తరిమివేసారు. ఆ బాధితులలో లంబాడి తెగకు చెందినవారు ఒకరు ఈ బాధలు పడలేక ఒకప్పుడు బాంబే ప్రెసిడెన్సీ నుండి చాలా మంది వలస పోయి ఇప్పటి పాకిస్తాన్ లో ఉండిపోయారు.వాళ్ళలో చాలామంది ఇస్లాం స్వీకరించారు,మిగిలినవాళ్ళు హిందువులుగా ఉన్నారు వాళ్ళు ఇప్పటికి బంజారా / లంబాడి బాష మాట్లాడతారు..
ఈ కిరాతక చట్టం ద్వారా నానా కష్టాలు అనుభవించిన కులాలు చాలావరకు ప్రస్తుత SCలు , STలు, OBC ల వర్గానికి చెందినవారే..వారిలో దోపిడీ దొంగలుగా ముద్ర వేయబడ్డ వారు.. చమార్లు, గుజ్జర్లు, లోదిలు,హర్నిలు,బోయ.. Bowreah, Budducks, Bedyas, Domes, Dormas, Gujar, Bhar, Pasi, Dasads, Koneriahs, Moosaheers, Rajwars, Gahsees Boayas, Dharees, Sowakhyas మొదలగునవి..
ఖాకీ సినిమా చూసే ఉంటారుగా అందులో తెగ పేరు బవరియా వాళ్ళు ఇప్పటికి రాజస్థాన్ లో ఉన్నారు..
#నాన్_మార్షల్_రేస్_ గా విభజించారు..
బ్రిటిష్ వారి ప్రకారం మార్షల్ రేస్ అంటే రాజ్యపాలనకి పనికోచ్చేవారు, యుద్ధానికి పనికోచ్చేవారు,తెలివైన వాళ్ళు, బలవంతులు..
వీరిని బ్రిటిష్ వారు పాలెగాళ్ళుగా,జమిందారులుగా, వారి ఆఫీసులలో ప్రధాన సహాయకులుగా, మునసబులుగా నియమించేవారు..
సైనిక నియామకంలో వీరినే తీసుకునేవారు..
బ్రిటిష్ వారు వారి పిల్లల్ని చదివించే స్కూల్ లలో హోదాని బట్టి అడ్మిషన్ ఇచ్చేవారు...
అదేవిధంగా నాన్ మార్షల్ రేస్ బ్రిటిష్ వారి పుస్తకాల ప్రకారం చిన్న పనులు చేయడానికి పనికోచ్చేవారు, శరీర ఆకృతి బలంగా లేని వాళ్ళు..
వీరిని సైనిక నియామకాలలోకి తీసుకునేవారు కాదు, వీరిని జమిందార్లుగా,గ్రామ మునసబులుగా బ్రిటిష్ వారు నియమించినట్టు నేను పాత రికార్డులలో ఎక్కడా చూడలేదు, అందుకే బ్రిటిష్ వారి కాలంలో పుట్టిన జమీందారి వ్యవస్థలో, మునసాబు దారి వ్యవస్థలో పాలేగాళ్ల వ్యవస్థలో ఒక్కరు కూడా దళితులు లేరూ...
ఉదాహరణకి మహార్ లని తీసుకుందాం మొదటి ప్రపంచ యుద్దంలో 1914 వరకు మహార్ కులస్తులకు ఆర్మీలో పెర్మనంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు.. 1941 వ సంవత్సరం వరకు మహార్ ల పేరు మీద రెజిమెంట్ నే ఇవ్వలేదు.. కారేగావ్ యుద్ధంలో సైనికుల బలం చాలక అవకాశం ఇచ్చినా మహార్ కులస్తులను మొదటి ప్రపంచ యుద్ధం వరకు వారికి ఆర్మీలో పనిచేసే అవకాశం ఇవ్వలేదు..
ఇంకా అర్ధమయ్యేలా చెప్పాలంటే భారతరత్న భీమ్ రావ్ రాం జి అంబేద్కర్ గారు చదివిన స్కూల్ ని తీసుకుందాం.. ఆ స్కూల్ పేరు ఎల్ఫిన్ స్టోన్ హై స్కూల్ ఆ స్కూల్ బ్రిటిష్ వారు వారి పిల్లల సౌలభ్యం కోసం 1822 లో ఈ స్కూల్ ని నిర్మించారు.. అంబేద్కర్ గారు ఆ స్కూల్ లో 1906లో అడ్మిషన్ తీసుకున్నారు. ఆ స్కూల్ లో అడ్మిషన్ తీసుకున్న మొట్టమొదటి దళితుడు కూడా అంబేద్కర్ గారు కావడం గమనార్హం.
కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే 1822 లో పెట్టిన స్కూల్ లో ఒక దళితుడిని చేర్చుకోవడానికి 90 సంవత్సరాలు పట్టింది. ఆ స్కూల్ కట్టించి, నడిపిస్తున్నది, బోధిస్తున్నది బ్రిటిష్ వారే. దీనిని బట్టి మీకు బ్రిటిష్ వారు సోషల్ ఇంజనీరింగ్ ని ఎంతబలంగా నమ్మేవారో అర్ధం అవుతుంది...
ముస్లిం రాజ్యాలు 1000 ఏళ్ళు షరియా చట్టాన్ని ఆధారంగా చేసుకొని పాలించాక, ఆ తరువాత బ్రిటిష్ వారు 300 ఏళ్ళు చర్చిచే డ్రాఫ్ట్ చేయబడిన కంపెనీ చట్టం బ్రిటిష్ రాజ్యాంగం ద్వారా పాలించాక..ఇంకా ఒక వర్గాన్ని తక్కువ చేసి చూసే దురాచారానికి హిందువులు మొత్తానికి ఆపాదించడం చాలా తప్పు. సమాజంలో దురాచారాలని కట్టడి చేసే అధికారం రాజులకే ఉంటుంది,అది సమాజానికి మొత్తానికి ఎట్లా ఆపాదిస్తాం...?
జనాలలో ఇంత వైషమ్యాలు రేపి విడగొట్టిన బ్రిటిషర్ లను సమాజోద్ధరణకి పాటుపడినవారిలా కొన్ని మిషనరీలకి అమ్ముడుపోయిన శక్తులు అభివర్ణించడం చాల హాస్యాస్పదం..
మీరు అడపాదడపా వీడియోలలో క్రైస్తవ మత ప్రచారకులు బ్రిటిష్ వారిని పొగుడుతూ అవి తెచ్చారు,ఇవి ఇచ్చారు అంటూ నోటికొచ్చింది వాగుతూ ఉంటారు.. మన అమాయక హిందువులు గుడ్డిగా గంగిరేద్దుల్లా తల ఊపుతున్నారు..
ఇకనైనా మేలుకోండి... జై హింద్..