Thursday, 25 November 2021

 వీరాంగన ఝల్కారీ బాయి..

1857లో భారత స్వాతంత్ర్య పోరాటంలో పురుషులతో పాటు స్త్రీలు భుజం భుజం కలిపి సమాన సహకారం అందించారు. కొన్ని చోట్ల, బ్రిటిష్ అధికారులు మరియు పోలీసులు వారి ధైర్యసాహసాలు చూసి ఆశ్చర్యపోయారు. అలాంటి వీరనారీమణుల్లో ఒకరు ఝల్కారీ బాయి ఆమె తన వీరోచిత చర్యలతో పురుషులను కూడా వెనుకకు నెట్టింది..

ఝల్కారీ బాయి 1830 నవంబర్ 22న భోజ్లా (ఝాన్సీ, ఉత్తరప్రదేశ్) గ్రామంలో జన్మించింది..తండ్రి మూలచంద్ర జీ ఆర్మీలో పనిచేసేవారు. దీంతో ఇంటి వాతావరణంలో శౌర్యం, దేశభక్తి ప్రభావం నెలకొంది. సభలో తరచూ యుద్ధాలు, సైనిక పోరాటాలు, సైన్యం సాధించిన విజయాల గురించి చర్చలు జరిగేవి. చిన్నప్పటి నుండి, మూలచంద్ర జీ ఝల్కారీకి ఆయుధాల ఆపరేషన్ నేర్పించారు. దీంతో పాటు చెట్లు ఎక్కడం..నదుల్లో ఈత కొట్టడం..ఎత్తు నుంచి దూకడం వంటి పనుల్లో కూడా ఝల్కారీ ప్రావీణ్యం సంపాదించింది.


ఒకసారి ఝల్కారీ అడవి నుండి కలపను తెస్తున్నప్పుడు భయంకరమైన చిరుతపులి నేరుగా దాడిచేసింది. ఝల్కారీ ఒక చిన్న బాకుతో చిరుతపులిని చంపేసి దాన్ని భుజంపై వేసుకెళ్లింది. ఒకసారి గ్రామ పెద్దని దారిలో బందిపోట్లు చుట్టుముట్టారు. యాదృచ్ఛికంగా ఝల్కారీ అక్కడికి వచ్చింది..బందిపోటు దొంగలమీద లంఘించి కేవలం చేతి కర్రతో బందిపోట్లను తరిమికొట్టి గ్రామపెద్దను కాపాడుకుంది..ఇలాంటి వీరోచిత సంఘటనల వల్ల ఝల్కారీ ఊరందరికీ ముద్దుల కూతురు అయింది.

ఝల్కారీ చిన్నతనంలో, ఆమె ఝాన్సీ సైన్యంలో గన్నర్ అయిన పురాన్ కోరిని వివాహం చేసుకుంది. ఝల్కారీ రాణి లక్ష్మీబాయి నుండి ఆశీర్వాదం కోసం వెళ్ళినప్పుడు, ఆమె వీరత్వాన్ని యుద్ధవిద్యా నైపుణ్యాన్ని చూసి ఆమెను దుర్గా దళంలోకి చేర్చుకుంది. 1857లో ఝాన్సీని పట్టుకోవడానికి ఆంగ్లేయ సైన్యం కోటలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఝల్కారీ రాణి రాజభవనానికి చేరుకొని రాణి ఝాన్సీ ఆమె దత్తపుత్రుడితో కలిసి కోట నుండి సురక్షితంగా బయటపడటానికి సహాయం చేసింది.

ఇందుకోసం ఝల్కారీ చేసిన పనిని ఊహిస్తేనే తనువు పులకించిపోతుంది.  స్వయంగా భర్తే రాణి లక్ష్మీబాయికి సంబంధించిన ఆభరణాలు వస్త్రాలు ఝల్కరీ భాయి కి  ధరింపచేశాడు..ఝాన్సీ రాణికి సాధారణ స్త్రీ దుస్తులు ధరించేలా చేశాడు. రాణి ఝాన్సీ మారువేషంలో కోట బయటకు వెళ్ళిపోయారు..మరోవైపు రాణి వేషం ధరించిన ఝల్కారీ బాయి రణచండీగా మారి బ్రిటిష్ వారిపై విరుచుకుపడింది..

చాలా సేపు బ్రిటిష్ సైన్యం అధికారులు గందరగోళంలో పడిపోయారు. వారు రాణి లక్ష్మీబాయిని చనిపోయిన లేదా సజీవంగా అరెస్టు చేయాలని కోరుకున్నారు కానీ రెండు చేతుల్లో కత్తులతో ఝల్కారీబాయిబ్రిటిష్  సైనికులను క్యారెట్లు, ముల్లంగిలా కోస్తున్నది.. శివతాండవం చేస్తున్న ఝల్కరీ బాయ్ మీద కనీసం కత్తి విసిరే సాహసం కూడా బ్రిటిష్ సైనికులు చేయలేకపోయారు..అప్పుడు ఒక దేశద్రోహి  జనరల్ హురోజ్‌తో తను రాణి లక్ష్మీబాయి కాదని దుర్గా దళ నాయకురాలు ఝల్కారీ బాయి అని చెప్పాడు..

ఈ విషయం తెలిసి తను మోసపోయానని హురోస్ ఆగ్రహంతో ఊగిపోయాడు.. తానే స్వయంగా సైనికులతో కలిసి దాడి చేసి ఝల్కారీని చుట్టుముట్టి తమ అదుపులోకి తీసుకున్నారు.. ఝల్కారీబాయి ఉరి బదులు వీరమరణాన్ని కోరుకున్నారు..తన భర్త వీర్బల్ కు ముందుగా అనుకున్నట్టు సైగ చేశారు.. సిగ్నల్ అందిన వెంటనే వీర్బల తనను తాను కాల్చుకునే ముందు తన భార్య ఝల్కరీ బాయి ని కాల్చివేసి జీవితాన్ని ముగించాడు..ఝల్కారీ బాయి తన జీవితం మరియు మరణం రెండింటినీ అర్ధవంతం చేసింది..

ఇలాంటి మహాతల్లుల త్యాగఫలం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం..

అడుక్కుంటే వేసేది బిక్ష..పోరాడితే వచ్చేది స్వతంత్రం..

వీరనారి ఝల్కర్ బాయి కి ఘన నివాళులు..

నేడు వారి జయంతి..

show image

MBA lesson .....EGG Analogy for most internal affairs: egg should break from ...so a life is born. for most external affairs: egg should bre...