దొంగలు దూరిన ఆరునెలలకు .. అని ఒక సామెత ఉంది. గత నాలుగు రోజులుగా అనేక పత్రికల్లో ఇదే తరహా వార్తలు .
గత సంవత్సరం మే నెల అనుకొంటా . అయ్యా డీవీఎస్పీ గుప్త గారు . డేట్ గుర్తుందా ? భాగ్యనగర వైశ్య యూత్ అసోసియేషన్ వారు నాతొ జూమ్ క్లాస్ నిర్వహించారు .
అందులో నేను చెప్పిన అంశాలు ; వైశ్య కులానికి చెందిన వారికి ఎక్కువగా కరోనా వల్ల సైటోకిణిన్స్ట్రోమ్ రావడం కనిపిస్తోంది . ఒక్కో కుటుంబం లో ఇద్దరు ముగ్గురు చనిపోవడం .. యువకులు కూడా చనిపోవడం కనిపిస్తోంది . సైటోకిణిన్ స్ట్రామ్ అంటే వ్యక్తి రక్షక వ్యవస్థే వ్యక్తి అంగాల పై దాడి చెయ్యడం . ఇందువల్ల గుండె ఊపిరి తిత్తులు పాడైపోతాయి .{ నేను చెప్పిన కొద్దీ రోజులకే ప్రముఖ గాయకుడూ కూడా ఇదే కారణం వల్ల మరణించాడు . అయన బ్రాహ్మణ కులానికి చెందిన వాడు అని అందరకీ తెలిసిందే . }
ఇలా సైటోకిన్ స్ట్రామ్ రావడానికి కారణాలు . 1 . జన్యుపరమైన కారణాలు .. ఇది ఒక రకమైన ఇమ్యూన్ డిసార్డర్ . జన్యు పరమైన లోపాలను అధిగమించలేము . కానీ భయపడాల్సిన అవసరం లేదు . 2 . శాఖాహారం లో బి 12 లోపం ఉంటుంది . కాబట్టి ఆ టాబ్లెట్స్ తీసుకోండి . ౩. మూడో కారణం డి విటమిన్ లోపం .. ఇంకా ఊపిరి తిత్తుల్లో కొవ్వు ఎక్కువ గా ఉండడం .. వొంట్లో కొవ్వు ఉంటే నష్టం . దానికన్నా ఊపిరి తిత్తుల్లో కొవ్వు అధిక నష్టం చేస్తుంది . కరోనా తన కొమ్ములతో ఆ కొవ్వుకు అతుక్కొంటుంది . కాబట్టి రోజూ ఎండలో కాసేపు నడవండి . కనీసం ఊయిరి తిత్తుల్లోని కొవ్వు కరుగుతుంది . డి విటమిన్ వస్తుంది . 4 . వ్యైసుల్లో భయం కాస్త ఎక్కువగా ఉంటుంది . కరోనా అంటే భయపడొద్దు . ఇదే విషయాన్ని మా స్కూల్ ఎంప్లాయిస్ ఇంకా తల్లితండ్రులు తో కూడా షేర్ చేసుకొన్నా .
మా ఎంప్లాయిస్ లో అలాగే తల్లితండ్రుల్లో వైస్యులూ, బ్రాహ్మణులు , మార్వాడి లు, జైన్ లు ఎక్కువ .. ఛ.. ఇలా కులాల పేరు ప్రస్తావిస్తూ నేను పోస్ట్ పెట్టాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు . నాకు లోకం లో రెండే కులాలు .. రెండే మతాలు కనిపిస్తాయి . మంచి .. చెడు.
మా ఎంప్లాయిస్ ఇంకా అందరూ కాక పోయినా ఎంతో మంది తల్లితండ్రులు నేను చెప్పిన పద్దతి ని పాటించారు . ఇప్పుడు రెండో వేవ్ లో వందల మందికి కరోనా సోకింది . కుటుంబాలకు కుటుంబాలు కరోనా బారిన పడ్డాయి . అందరూ గట్టెక్కసారు . 75 ఏళ్ళ వృద్ధులు కూడా ఇంటి వద్ద నుంచే కరోనా ను గెలిచారు .
ఇప్పుడు మీడియా మేల్కొంది . కనీసం ఇప్పుడైనా సరైన మార్గం చూపిస్తారా అంటే అదీ లేదు . వైస్యులు తమ కులం లోనే పెళ్లి చేసుకొంటారట . అదేదో మిగతా కులాలు వేరే కులం వారిని పెద్ద ఎత్తున పెళ్లి చేసుకొన్నటు. చెత్త రాతలు . వైస్యుల జీన్స్ లో ఉందట . అంటే ఇంకా మీరేమి చేసినా ఇంతే గతి . కరోనా సోకితే పోవడమే అని వారిని భయపెట్టడం . అసలే భయస్తులు . ఇలాంటి రాతలు చదివితే ఇక ఏమి గతి ?
అయ్యా .. గుప్త గారు .. నిన్ననే నేను మీకు మీసెంజర్ లో మెసేజ్ పెట్టాను . నా సూచనలు గత సంవత్సరంగా పాటించిన వారి పై దీని ప్రభావం ఎలా ఉందొ తెలియచేయండి . నాకు తెలిసి మీతో సహా ఎంతో మంది మొదటి వేవ్ లోనే సులభంగా కరోనా ను జయించేసారు . ఎవరి జోలికి వెళ్లొద్దు .. మనం .. మన కుటుంబం .. మన వ్యాపారం అంటూ భయంగా జీవించే ఆర్య వైస్యులు భయం తో చచ్చి పోయే స్థితి వచ్చింది . నాకు దయ చేసి ఫీడ్ బ్యాక్ ఇవ్వండి .నా విశ్లేషణ లో తప్పుంటే .. నా సూచనల వల్ల మీకు నష్టం జరిగి ఉంటే బహిరంగంగా గుంజీలు తీస్తాను . ఇంకా పెద్ద శిక్షకైనా రెడీ .
చివరిగా ఒక విషయం .. ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్టు ఇది కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోని వైస్యులకు సంబందించిన సమస్య కాదు . శాఖాహార కులాలైన మార్వాడీలు .. జైనులు .. కాస్త తక్కువ స్థాయిలో బ్రాహ్మణులు ఇదే సమస్య ను ఎదుర్కొంటున్నారు . గుజరాత్ , మహారాష్ట్ర లాంటి చోట్ల .. ఇంకా ఢిల్లీ లాంటి నగరాల్లో మరణాలు ఎక్కువ ఉండడానికి ఇదే కారణం .
ఈ ఒక్క పోస్ట్ మాత్రమే చదివి ఆయ్ మరణాలు శాఖాహారుల్లో మాత్రమే ఉందా ? మరైతే మాంసాహారులు ఎందుకు మరణిస్తున్నారు అని అడగకండి . నా వల్ల కాదు బాబు .. చెప్పి నోరు .. కాదు టైపు చేసి చేసి వేళ్ళు అరిగిపోతున్నాయి . కరోనా మరణాలకు మూడు కారణాలు . 1 . డి విటమిన్ లోపం . ఇది అందరు నగర వాసులకు వర్తిస్తుంది . అందుకే నగరాల్లో మరణాలు ఎక్కువ . 2 . శాకాహారులు .. బి 12 లోపం .. సైటోకిన్ స్ట్రామ్ . ౩ టీవీ లు .. వాట్సాప్ గ్రూప్ లు - భయం . ఇంకా చెప్పాలంటే కనీసం కనీసం పల్స్ ఆక్సీమేటర్ లు చెక్ చేసుకోనంత అజ్ఞానం . మాస్కు .. పూస్కో.. అంటూ చేసిన ప్రచారం లో సగం అసలు విషయాల పైన చేసి ఉంటే పరిస్థితి బిన్నంగా ఉండేది .
ఈ విషయాల పై పదమూడు నెలలుగా నెత్తినోరు బాదుకొంటున్నా. అమెరికా డాక్టర్ కరోనా కు డి ౩ మందు అన్నారు అని ఇప్పడు వార్తలు . నేను గత సంవత్సరం ఏప్రిల్ నెల లోనే ఈ విషయాన్ని చెబితే ఎండలో కూర్చుంటే కరోనా చచ్చిపోతుందా అని సెటైర్ లు .. సెటైర్ లు వేసిన వారు రిటైర్ అయిపోయారేమో తెలియదు .. అదే జీవితాన్నుంచి . చివరిగా ఒక మాట .. నిద్ర పోయేవాడిని లేపొచ్చు . నిద్ర నటించే వాడిని లేపడం ఎలా ?