పుస్తకాలు చదవడమనేది మంచి అలవాటు. పుస్తక పఠనం ద్వారా జ్ఞానం, పద సంపద పెరుగుతుంది. మనుషుల వ్యక్తిత్వాలు, సమాజం, వివిధ అంశాల పట్ల అవగాహన వస్తుంది. అందుకే పుస్తకాలు చదివేవాళ్లు జీవితాన్ని బాగా అర్థం చేసుకోగలరని పెద్దలంటారు. కానీ, ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో పుస్తకాలు చదవాలన్న ఆసక్తి ఎవరూ కనబర్చేట్లనేది చేదు నిజం. కొందరు పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని పుస్తకాలు ముందు పెట్టుకొని కూర్చున్నా ఎక్కువ రోజులు చదవలేకపోతున్నారు. అందుకే పుస్తక పఠనంపై ఆసక్తి ఉన్నవాళ్లు దాన్ని అలవాటుగా మార్చుకోవడానికి ఈ చిట్కాలు పాటించి చూడండి..
నచ్చిన అంశానికి సంబంధించిన పుస్తకాలే ఎంచుకోండి
పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలనుకుంటే
మొదట మీకు నచ్చిన అంశానికి సంబంధించిన పుస్తకాన్ని మాత్రమే ఎంపిక చేసుకో…