Monday 8 July 2024

   ముస్లిం యువకుడు మన హిందువుల గురించి



ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి పచ్చి నిజాలు విశ్లేషించి మరీ ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్. 

ఈమధ్య కాలంలో హిందువులలో చాలా మంది వాట్సాప్, ఫేస్ బుక్ లలో ముస్లింలపై, క్రైస్తవుల పై ద్వేష పూరిత పోస్టులు పెడుతున్నారు. వాటిపై స్పందించాలని నేను ఈ పోస్ట్ పెడుతున్నా. హిందూ సోదరులారా ముస్లింలు లేదా క్రైస్తవులు హిందువులకు ఏమి నష్టం చేస్తున్నారు అనే విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు అసలు హిందువులు హిందువులకు ఏం చేస్తున్నారు అనేది చూద్దాం.  . నారాయణ, చైతన్య వంటి పాఠశాలల్లో మీ హిందువుల పండుగలు వచ్చినప్పుడు పాఠశాలకు సెలవు ఇవ్వకుండా క్లాసులు పెడుతున్నప్పుడు మీలో ఎంతమంది యాజమాన్యంతో గొడవపడ్డారు? మా రంజాన్ పండుగకు లేదా క్రైస్తవుల క్రిస్మస్ పండుగకు అన్ని పాఠశాలలు సెలవులు ప్రకటిస్తాయి ఎందుకంటే సెలవు ఇవ్వకుండా క్లాసులు పెడితే మేము అస్సలు ఒప్పుకోము కనుక. మరి మీరు పాఠశాల యాజమాన్యం మీ పండగల రోజు క్లాసులు పెడితే అడగడం మానేసి మీ పిల్లల్ని పాఠశాలకు పంపించేది మీరే. మీకు మీ పండుగలు జరుపుకోకపోతే మీ పిల్లలకు మీ సంస్కృతి సాంప్రదాయాలు ఎలా తెలుస్తాయి అన్న బెంగ ఏమాత్రం లేదు. ఎంతసేపు మా పిల్లలకి మంచి ర్యాంకులు రావాలి క్లాసులో టాప్ రావాలి అన్న ధ్యాస తప్పితే మన పండగకి మన పిల్లలు ఇంట్లో లేకపోతే మన పద్ధతులు, ఆచారాలు మన పిల్లలకి ఎలా తెలుస్తాయి అనే ఆలోచనే లేదు. నాకు తెలిసిన ఒక హిందూ మిత్రుడు వారి పాపని చదివిస్తున్న నారాయణ స్కూల్ యాజమాన్యంకి ఫోన్ చేసి పండగ రోజు ఎందుకు స్కూలు పెట్టారు అని అడగగా వారు పిల్లల తల్లిదండ్రులే ఇలా స్కూలు పెట్టమని అడిగారు కనుక మీ ఒక్కరి పాప కోసం స్కూలు పెట్టకుండా మేము ఉండలేము మీకు ఇష్టం లేకపోతే మీ పాపని పంపకండి అంతే కానీ సెలవు ఇవ్వడం కుదరదు అని తెగేసి చెప్పారట. మరి అదే పిల్లల తల్లిదండ్రులు రంజాన్ కి క్రిస్మస్ కి సెలవు ఇచ్చినప్పుడు ఎందుకు స్కూలు పెట్టమని అడగడం లేదు. అలాగే ఆ పాఠశాలలు నడిపేది కూడా హిందువులే మరి.  ఇందులో ముస్లింల తప్పేముంది? 


మా ముస్లిం సమాజం మా పిల్లలకు చిన్న వయసు నుంచే టోపీ పెట్టుకోవడం, హిజాబ్ ధరించడం వంటివి నేర్పిస్తున్నాం. తద్వారా మా పిల్లలకు మా మతం అంటే గౌరవం కచ్చితంగా ఆచరించాలి అన్న తత్వం అలవడుతుంది. మరి మీరు? మీ పిల్లలకి మీ కట్టు, బొట్టు, మీ వస్త్రధారణ నేర్పిస్తున్నారా? చిన్నప్పటి నుంచే పాశ్చాత్య దుస్తులు, పాశ్చాత్య అలవాట్లు నేర్పించి మొక్కై వంగనిది మానై వంగదు అన్న సూక్తిని మరచి పెద్దయ్యాక వారికి మీ గ్రంధాల గురించి, మీ పురాణాల గురించి ఇంకా మీ ఆచారాల గురించి లేశమంతైనా తెలియకుండా పెంచుతున్నారు. ఇందులో ముస్లిం సమాజం తప్పెక్కడుంది? 


ఈ విషయంలో మా ఐకమత్యం వల్ల ప్రభుత్వాలు సైతం మా వెనకే ఉన్నాయి. మాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడానికి భయపడడమే కాక, మీ హిందువులని, మీ ఆచారాలని అణిచివేసే నిర్ణయాలు, నిబంధనలు పెడుతూ మా ముస్లిం సమాజాన్ని ప్రోత్సహించే దిశగా కొత్త నిబంధనలు ఏర్పాటు చేస్తూ ఉన్నప్పటికీ మీ హిందువులందరూ ఆయా పార్టీల వారికే ఓట్లు వేసి మరీ గెలిపిస్తున్నారు. దీనికి ఉదాహరణగా మీరు ఈ మధ్యకాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్న కొన్ని పరీక్షలప్పుడు మీ హిందూ మహిళలు ధరించిన తాళిబొట్లు, కాలి మెట్టెలు, చెవి దిద్దులు, గాజులు వంటివి బయటనే తీసివేసి పరీక్షా హాలు లోకి ప్రవేశించాలి అనే దుర్మార్గమైన నిబంధనను పెట్టినప్పటికీ మీరెవరూ ప్రశ్నించరు. పైగా వారికే ఓట్లు వేసి మరీ గెలిపిస్తారు. మరొకపక్క మా ముస్లిం మహిళలు పూర్తిగా హిజాబ్ ధరించి, బుర్కా ధరించి వచ్చినా సరే పరీక్ష హాల్లోకి అనుమతిస్తున్నారు. ఎందుకంటే మా జోలికి వస్తే ఏమవుతుందో వారికి తెలుసు కనుక. ఇక్కడ చేతగాని చవట దద్దమ్మలు ఎవరు?

దీంట్లో ముస్లింల తప్పు ఎక్కడ ఉంది?


మా ముస్లింలలో ఎవరైనా ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే అందులో పని వాళ్ళను మా ముస్లింలనే పెట్టుకుంటాం. కానీ మీ హిందువులు మీ హిందువులను పనివాళ్ళుగా పెట్టుకుంటున్నారా? మీరు కూడా మా ముస్లింలని, లేదా క్రైస్తవులని పనివాళ్ళుగా పెట్టుకుంటున్నారు.

ఇందులో మా ముస్లింల తప్పు ఎక్కడ ఉంది?


అలాగే మా ముస్లింలు అందరం మా యొక్క వ్యాపార భవనాలు లేదా ఇండ్లు దాదాపు వీలైనంతవరకు ముస్లింలకు మాత్రమే బాడుగకు ఇస్తాము. మరి మీరు? మీకు 500 రెంటు ఎక్కువ ఇస్తే ముస్లింలకి, క్రైస్తవులకు బాడుగకు ఇస్తారు. ఎందుకంటే మీకు మీ ధర్మం కంటే, మీ ధర్మం పైన మీకున్న గౌరవం కంటే డబ్బే ముఖ్యం కనుక. 

ఇందులో ముస్లింల తప్పు ఎక్కడ ఉంది?


అలాగే ప్రార్థన చేసుకునే ప్రదేశాల విషయానికి వస్తే

మేము మా మసీదులకు సంబంధించిన వ్యాపార సముదాయ కట్టడాలను మా ముస్లింలకు మాత్రమే బాడుగకు ఇచ్చుకుంటాము. కానీ మీరు దేవాలయ భూములు లేదా షాపులు ఏవైనా సరే డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వారికి అనగా మా ముస్లిం సోదరులకు ఇస్తారు. కావాలంటే మీ దేవాలయాలు వద్ద మీరు గమనిస్తే ఆఖరికి మీరు మీ దేవునికి పూజ చేయడానికి గుడిలోకి తీసుకువెళ్లే పూలు, పండ్లు, పూజ సామగ్రి అమ్మేవాళ్లు 90 శాతం పైగా కొన్నిచోట్ల 100% మా ముస్లిం సోదరులే. 

దీంట్లో ముస్లింల తప్పు ఎక్కడుంది?


మా ముస్లిం సమాజంలో షియాలు సున్నీలు అని రెండు ముఖ్యమైన విభాగాలుగా ఉన్నా, మరలా సున్నీలలో 300 పైన రకాలుగా విభజించబడి ఉన్నా, షియాలలో 200 పైన రకాలుగా విభజించబడి ఉన్నా, అందరూ కొలిచేది అల్లానే అయినప్పటికీ ఏ ఒక్క వర్గానికి రెండో వర్గం వారంటే పడకుండా ఎన్నో అంతర్యుద్ధాలు మాలో మేము జరుపుకుంటున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజానికి ఏదైనా నష్టం కలిగించే విషయంపై అందరం ఒక్కతాటిపైకి వచ్చి ఏకాభిప్రాయం పైన నిలబడతాం, ఇంకా ఎంతదాకా అయినా పోరాడుతాం. క్రైస్తవులు సైతం క్యాథలిక్ లు, ప్రొటెస్టెంట్లు అని రెండు ముఖ్య రకాలుగా ఉన్నా.. క్యాథలిక్లలో 150 వర్గాలు అలాగే ప్రొటెస్టెంట్లలో 380 వర్గాలు ఇలా ఎవరి చర్చి వారిదే అయినప్పటికీ, ఒకరి చర్చిలోకి ఒకరు పోనప్పటికీ క్రైస్తవ సమాజానికి ఏదైనా నష్టం కలిగించే విషయంపై స్పందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజం మొత్తం ఒకటవుతుంది.

మరి మూడు కోట్ల దేవతలని పూజించే మీ హిందువులు అన్ని గుళ్ళకి అందరూ వెళ్లినప్పటికీ కులాల వారీగా మీరు విడిపోయి మీలో మీరు కొట్టుకొని చస్తూ కులగజ్జి తో మీ కుల నాయకులకు ఓట్లు వేస్తూ మీరందరూ హిందువులు అన్న విషయాన్ని మరిచిపోయి మీ ధర్మానికి మీరు చేసినంత ద్రోహం మరొకరు చేసే అవకాశాన్ని ఇవ్వకుండా మీరే మీ సనాతన ధర్మం అని చెప్పుకునే హిందూ ధర్మాన్ని నాశనం చేసుకుంటుంటే అందులో మా ముస్లింల, క్రైస్తవుల తప్పేముంది? మిమ్మల్ని కులాలవారీగా మేమేమైనా విభజించామా? ఈరోజుకి మీరందరూ మిమ్మల్ని కులాలుగా విభజించే పార్టీలలోనే ఉంటూ వారికే ఓట్లు వేస్తూ వారందరూ హిందూ ధర్మ వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే దిశగా ప్రోత్సహిస్తూ మీరే మీ ధర్మాన్ని నాశనం చేసుకుంటుంటే అందులో మా తప్పు ఎక్కడ ఉంది?


మీ దేవాలయాలను ప్రభుత్వ ఆధీనంలోకి ఇచ్చేసి మీకు నియంత్రణ లేకుండా చేసుకుని మీ దేవాలయాలలో సైతం ముస్లింలను క్రైస్తవులను పనివాళ్ళుగా పెట్టుకుని నెలవారి జీతాలు ఇచ్చి మరీ మతమార్పిడులు జరిగే లా అవకాశం కల్పించి మీరు హుండీలో సమర్పించే డబ్బులు అన్నీ మా మసీదులకి, చర్చిలకి లేదా మన రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి ఉపయోగించడానికి ప్రభుత్వాలు తీసుకుంటూ ఉంటే నిస్సిగ్గుగా సమర్థిస్తూ అదే పార్టీలకు ఓట్లు వేస్తూ మీలో మీరు కుమ్ములాటలు చేసుకుంటుంటే అందులో ముస్లింల తప్పు ఎక్కడ ఉంది? 


మా ముస్లింలు మా మసీదులలో కేవలం మేము మాత్రమే పని చేస్తాం. మసీదు కి రావాలని అందరికీ పిలుపునిస్తాం రోజుకు ఐదుసార్లు. వచ్చిన వారికి మా ధర్మం గురించి బోధిస్తాం. అలాగే క్రైస్తవ సమాజం కూడా వారి చర్చిలకి రమ్మని అందర్నీ కోరుతారు. ఇల్లిల్లూ తిరిగి మరీ చర్చికి ఆహ్వానిస్తారు. చర్చికి వెళ్ళాక వారి మత బోధనలు చేసుకుంటారు. మరి మీరు ఎప్పుడైనా గుడికి వెళ్లారా? గుడికి ప్రతిరోజు రమ్మని ఇల్లిల్లూ తిరిగి చెప్పారా?

మా ముస్లిం సమాజం లేదా క్రైస్తవ సమాజం మా ప్రార్థన ఆలయాలకు ప్రతినెలా మా సంపాదనలో 10 శాతాన్ని విరాళంగా ఇచ్చి ఆర్థికంగా మేము ఆదుకుంటాము. మా మత ప్రచారానికి వాడుకుంటాం.  ప్రభుత్వాలు కూడా మా ఇమామ్లకు అలాగే క్రైస్తవ పాస్టర్లకు నెలవారి జీతాలను కూడా ప్రకటించాయి. ఇలా ప్రకటించేవి అన్ని హిందువులు పెట్టిన పార్టీలే. మేము ఐకమత్యంగా ఉంటాం కనుక మాకు ఇలాంటివి మీ హిందువులే చేస్తున్నారు. ఇందులో ముస్లింల తప్పు ఎక్కడుంది?


మా మసీదు జోలికి వస్తే మేము ఊరులో ఉన్న ముస్లింలం అందరం ఒక్కటయ్యి అవతలి వారు ఎంతటి వారైనా సరే పోరాడుతాము.


మరి మీరు మీ గుడుల జోలికి ఎవరైనా వచ్చినప్పుడు మీరందరూ ఏకమవుతారా? కులానికి ఒక దేవత గుడి కట్టుకొని దేవుడికి కూడా కులాన్ని అంటగట్టిన మీరు మీ ధర్మానికి అన్యాయం కాక ఏం చేస్తున్నారు? శైవులు, వైష్ణవులు అని కొట్లాడుకునే బ్రాహ్మణులు,  మా కులం అని వాసవీ మాతని నిలువెల్లా నింపుకున్న వైశ్యులు, మా కులమే అని కృష్ణుడిని అంగీకరించినంతగా ఇతర దేవుళ్ళను అంగీకరించని యాదవులు, మా కులం వాడే కాశి రెడ్డి నాయన కి గుడులు కట్టి పూజించే రెడ్లు, మా కులం ఆమె అని వెంగమాంబని పూజించే కమ్మలు, మా కులం ఆమె అని దొంతులమ్మ ని పూజించే బలిజ వర్గం. ఇలా దేవుళ్ళని కూడా మా కులం అని పూజించే కులగజ్జి గాళ్ళు మీరు అయి ఉండి హిందూ ధర్మానికి మీరే ద్రోహులుగా మారి మళ్లీ ఇతర మతస్తులను ఎందుకు దోషులను చేస్తారు?

ఇందులో ముస్లింల తప్పు ఎక్కడ ఉంది?


మేము మా మసీదులలో ప్రతి సంవత్సరం కొంచెం కొంచెంగా శబ్దాన్ని పెంచుతూ మసీదులపై ఉన్న లౌడ్ స్పీకర్ల నుంచి రోజుకు ఐదుసార్లు ఊరు మొత్తం వినపడే విధంగా ఒక్కొక్క మసీదు ఒక్కొక్క సమయంలో అలా సుమారు గంటసేపు ఊరు మొత్తం మా మసీదుల నుంచి వచ్చే అజాన్ అందరి చెవులు చిల్లులు పడేలా అంత పెద్ద సౌండ్ తో వినిపించేలా మేము ముందుకు పోతుంటే మీరు మాత్రం గతంలో కనీసం ఒక పావుగంట అయినా మీ గుడుల పైన ఉన్న మైక్ లో పాటలు పెట్టేవారు ఇప్పుడు ఏ గుడి పైన ఉన్న మైక్ లో నుంచీ ఎటువంటి పాటలు, శబ్దాలు, మంత్రాలు ఏమీ వినిపించడం లేదు. మీరు ఎవరికో దేనికో భయపడి మీరే మైకులు పెట్టడం మానేసుకున్నారు.

ఇందులో ముస్లింల తప్పు ఎక్కడుంది?


మీ హిందువులు మీ కులం కాదని ఇతర కులస్తుడైన మీ సాటి హిందువుని ఎప్పుడూ అసూయ భావంతో మీరే చెడు చేసుకుంటూ ఉంటుంటే ఇక ముస్లింలు క్రైస్తవులు హిందువులకు నష్టం చేస్తున్నారని ఎలా మాట్లాడుతారు?


కనుక హిందూ సోదరులారా , ఇప్పటికైనా మీ హిందూ ధర్మానికి శత్రువులు ముస్లింలమైన మేమో లేక క్రైస్తవులో కాదు అన్న విషయాన్ని గుర్తించండి. ఈ ప్రపంచంలో హిందూ ధర్మానికి ఏకైక శత్రువు మీరే. హిందువునని మరిచిన మీరే. కులాలుగా కులగజ్జితో విడిపోయి మీలో మీరే కుమ్ములాటలు చేసుకుంటూ మీరే మీ హిందూ ధర్మానికి అతి పెద్ద శత్రువుగా తయారయ్యి మీ ధర్మాన్ని ఎలాగైనా లేకుండా చేయాలని విరామం లేకుండా మరీ నిరంతరం శ్రమిస్తున్నది మీరే. 

మరి ఇన్ని తప్పులు చేస్తున్నది మీరే అయినప్పుడు ఇతరులను ఎందుకు ద్వేషిస్తారు? ముందు మీ తప్పులేంటో మీరు చూసుకోండి ఆ తర్వాత మా జోలికి రండి.

show image

    ముస్లిం యువకుడు మన హిందువుల గురించి ఇది ఒక ముస్లిం యువకుడు మన హిందువుల గురించి, మన ఆలోచనల గురించి, మన ధర్మం పై మనకు ఉన్న గౌరవం గురించి ప...